News


ఫార్మా, వినియోగం, ఆటో రంగాలకు దూరం!

Friday 22nd November 2019
Markets_main1574418808.png-29791

‘బ్యాంకింగ్‌ సెక్టార్‌లో మేం దృష్ఠి సారించిన ఒకేఒక లార్జ్‌క్యాప్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌’ అని యస్‌ సెక్యురిటీస్‌ జాయింట్‌ ఎండీ అండ్‌ సీఈఓ, ప్రశాంత్‌ ప్రభాకర్‌ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లో..
ఫార్మాకు దూరం..
 సమీపకాలంలో ఫార్మా సెక్టార్‌కూ దూరంగా ఉండాలని సలహాయిస్తున్నాం.  దీనితో పాటు ఆటో, వినియోగ రంగాలకు దూరంగా ఉండడం మంచిది. ఫార్మా సెక్టార్‌లో  మార్జిన్‌ ఒత్తిళ్లు కాకుండా యూఎస్‌ ఎఫ్‌డీఏ నియంత్రణలు అతి పెద్ద సమస్యలుగా మారాయి. ఈ రంగానికి సంబంధించి కేవలం ఇప్కా ల్యాబ్స్‌పై సానుకూలంగా ఉన్నాం. ఈ స్టాక్‌ తాజాగా 52 వారాల గరిష్ఠానికి చేరుకుంది కూడా. ఈ స్టాక్‌ మినహా మిగిలిన మొత్తం సెక్టార్‌ దూరంగా ఉండమని ఇన్వెస్టర్లకు సలహాయిస్తున్నాం. ఫార్మా రంగానికి సంబంధించి దేశియ మార్కెట్‌ పరంగా బుల్లిష్‌గా ఉన్నాం. 
కేవలం ఐసీఐసీఐ బ్యాంక్‌..
బ్యాంకింగ్‌ సెక్టార్‌ పరంగా మేము కేవలం ఒకేఒక లార్జ్‌క్యాప్‌పై దృష్ఠి సారించాం. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌లలో విస్తృత ర్యాలీ చాలా దూరంగా ఉందని మా అభిప్రాయం. లార్జ్‌క్యాప్‌లో మేం దృష్ఠిసారించిన ఏకైక స్టాక్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌. గత రెండేళ్లలో ఈ స్టాక్‌ అనేక సమస్యలను అధిగమించింది. ప్రస్తుతం ఈ స్టాక్‌ వృద్ధి పరంగా సరియైన దిశలో ఉందని అంచనావేస్తున్నాం. ఐసీఐసీఐ బ్యాంక్‌ బలమైన ప్రాంఛైజ్‌ కావడంతోపాటు, ఈ బ్యాంక్‌ అవసరానికంటే అధికంగా ప్రోవిజన్లు చేసింది. ఒకవేళ రైట్‌ బ్యాక్‌కు సంబంధించిన వార్తలేమైన వస్తే, ఈ బ్యాంక్‌ మిగిలిన బ్యాంక్‌లతో పోలిస్తే మంచి స్థాయిలో ఉంటుంది. అంతేకాకుండా ఈ బ్యాంక్‌ వాల్యుషన్‌ కూడా ఆకర్షిస్తోంది. 
ఎన్‌బీఎఫ్‌సీల సమస్య..
ఎన్‌పీఏ సైకిల్‌కు సంబంధించి బాటమ్‌అవుట్‌ ప్రభావం గత ఏడాది లేదా అంత కంటే ముందే జరిగింది. కానీ ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం వలన ఈ సైకిల్‌లో మరో సరికొత్త సమస్య ఏర్పడింది. ప్రస్తుతం ఈ సంక్షోభం నుంచి డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ బయటపడుతుందని అనుకున్నప్పటికి,  పరిస్థితులు అ విధంగా కనిపించడం లేదు.   
    ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోడానికి బ్యాంకింగ్‌ విభాగం నుంచి రిస్క్‌ తీసుకోవాలనే స్వభావం అవసరం. దీనికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుత పరిస్థితులలో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ వార్తలు ఈ రంగానికి మంచివి కావు. అంతేకాకుండా ఎన్‌బీఎఫ్‌సీలో ఎస్‌ఎంఈ, ఎంఎస్‌ఎంఈ విభాగాలు మరింత క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ కంపెనీల నిధుల సమీకరణ బాగలేకపోతే ఆర్థికవ్యవస్థ పుంజుకోడానికి మరిన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. 



You may be interested

సెన్సెక్స్‌ నష్టం 216 పాయింట్లు

Friday 22nd November 2019

54పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ ఐటీ షేర్లకు రేటింగ్‌ షాక్‌ వారాంతపు చివరి రోజైన శుక్రవారం సూచీలు నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ 54పాయింట్లు నష్టంతో 11,914.40 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 216 పాయింట్లను కోల్పోయి 40359.41 వద్ద స్థిరపడింది. సూచీలకి వరుసగా ఇది రెండో రోజూ నష్టాల ముగింపు. ఐటీ రంగ షేర్ల భారీ పతనం, సూచీల గరిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు, ట్రేడర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడం, ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకానమీ కో అపరేషన్‌

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో 10 శాతం అప్‌సైడ్‌కు ఛాన్స్‌

Friday 22nd November 2019

అంతర్జాతీయ ఆర్థిక దిగ్గజం హెచ్‌ఎస్‌బీసీ సంస్థ రియలన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేయడంతో పాటు కొనుగోలు టార్గెట్‌ను పెంచింది. ‘రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన కన్జూమర్‌, జియో, రిటైల్‌ వ్యాపారాల్లోని వృద్ధి అప్‌సైడ్‌ ట్రెండ్‌ను నడిపిస్తాయి. అలాగే ప్రస్తుత ధర వద్ద షేరు వ్యాల్యూవేషన్‌ ఆకర్షణీయంగా ఉందని’బ్రోకరేజ్‌ పేర్కొంది. ఈ క్రమంలో షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించడంతో పాటు షేరు కొనుగోలు టార్గెట్‌ ధరను రూ.1,700 పెంచుతున్నట్లు బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది.  వొడాఫోన్‌

Most from this category