News


లాంగ్‌టర్మ్‌కు మెటల్స్‌ వద్దు!

Monday 16th December 2019
Markets_main1576488351.png-30250

సుదీప్‌ బందోపాధ్యాయ సూచన
షార్ట్‌టర్మ్‌కు ఓకే కానీ, దీర్ఘకాలానికి మెటల్‌ కౌంటర్ల జోలికి పోకపోవడం మంచిదని ఇండిట్రేడ్‌ క్యాపిటల్‌ చైర్మన్‌ సుదీప్‌ బందోపాధ్యాయ సూచించారు. అంతర్జాతీయ పరిణామాలు చూస్తే మెటల్‌స్టాక్స్‌కు బ్రెగ్జిట్‌ పాజిటివ్‌ వార్తని చెప్పారు. దీనికితోడు చైనాలో మెటల్‌స్టాకుల రీస్టాకింగ్‌ జరుగుతోందని, అందువల్లే ఈ కౌంటర్లలో కొనుగోళ్ల జోరు కనిపిస్తోందని చెప్పారు. కానీ ఇది చాలా స్వల్పకాలికమన్నారు. వీటన్నిటికన్నా ముఖ్యమైన ట్రేడ్‌వార్‌పై వ్యాఖ్యానిస్తూ ఈ యుద్ధం ముగిసిందని తాను భావించడం లేదని చెప్పారు. వచ్చే యూఎస్‌ ఎన్నికలకు ముందు ట్రేడ్‌వార్‌ ముగియబోదని అంచనా వేశారు. అందువల్ల స్వల్పకాలానికి మినహా దీర్ఘకాలానికి మెటల్‌ కౌంటర్ల జోలికిపోవడం మంచిది కాదని సలహా ఇచ్చారు. 
ఫార్మా రంగంపై...
దేశీయ వ్యాపారంపై ఫోకస్‌ ఉన్న ఫార్మా కంపెనీలను తాము పరిశీలిస్తున్నట్లు సుదీప్‌ చెప్పారు. యూఎస్‌లో ఫార్మా వ్యాపారం నియంత్రణా నిబంధనల సవాళ్లు సహా అనేక ఛాలెంజ్‌లు ఎదుర్కోనుందన్నారు. అందువల్ల యూఎస్‌కు ఎక్కువ వ్యాపారం కలిగిఉన్న ఫార్మా కంపెనీలు సమీప భవిష్యత్‌లో ఆటుపోట్లు చూడవచ్చని అంచనా వేశారు. అందువల్ల దేశీయంగా ఎక్కువ వ్యాపారం నిర్వహించే ఫార్మా కంపెనీలను ఎంచుకోవాలని సూచించారు. టొరెంట్‌ ఫార్మా, నాట్కో, డా.రెడ్డీస్‌ ల్యాబ్‌ షేర్లపై పాజిటివ్‌గా ఉన్నామన్నారు. డా.రెడ్డీస్‌ చైనా మార్కెట్లో చొచ్చుకుపోతోందన్నారు. దీనికితోడు ఈ మూడు కంపెనీలకు దేశీయంగా మంచి మార్కెట్‌ ఉందని వివరించారు. 



You may be interested

కొత్త రికార్డుస్థాయికి హెచ్‌డీఎఫ్‌సీ

Monday 16th December 2019

ప్రయివేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ షేరు సోమవారం ట్రేడింగ్‌లో కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. నేడు బీస్‌ఈలో ఈ షేరు రూ.2357.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో షేరు దాదాపు 1.50శాతం పెరిగి రూ.2384.50 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఈ స్థాయికి షేరు కొత్త జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. మార్కెట్‌ ముగిసే సరికి  1.02శాతం లాభంతో రూ.2376.90 వద్ద స్థిరపడింది. నేటి ఇంట్రాడేలో నిఫ్టీ-50 ఇండెక్స్‌లో ఆర్జించిన

పెరిగిన టోకు ధరల ద్రవ్యోల్బణం

Monday 16th December 2019

టోకు ధరల సూచీ(డబ్ల్యుపీఐ) ద్రవ్యోల్బణ సూచీ  నవంబర్‌లో 0.58శాతానికి పెరిగింది. అక్టోబర్‌లో ఇది 0.16శాతంగా నమోదైంది. గతేడాది ఇదే నవంబర్‌లో ఇది 4.47శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఉల్లిపాయలతో పాటు ఇతర కూరగాయల ధరలు పెరగడంతో నవంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం పెరిగినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ  విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. ప్రైమరీ ఆర్టికల్‌ విభాగంలో ధరల పెరుగుదల అక్టోబర్‌లో 6.4శాతంగా నమోదుకాగా, ఈ నెలలో 7.7శాతానికి ఎగిసింది ఫుడ్‌ ఆర్టికల్స్‌

Most from this category