దూకుడొద్దు... కాస్త నిదానం..!
By Sakshi

దేశీయ మార్కెట్లు సోమవారం చాలా దూకుడు ప్రదర్శించి మంగళవారం చల్లబడిపోయాయి. ఒక శాతం వరకు నష్టపోయాయి. ప్రధానంగా గరిష్టాల వద్ద విక్రయాలు చేయడం మార్కెట్ల నష్టాలకు కారణం. ఎన్నికల ఫలితాలకు ముందు ఇన్వెస్టర్లు ఒకింత అప్రమత్తత ప్రదర్శించినట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. లాభపడి, నష్టపోయిన షేర్ల నిష్పత్తి సైతం సానుకూలంగా లేకపోవడాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక వోలటాలిటీ ఇండెక్స్ వీఐఎక్స్ 9.23 శాతం పెరిగి 25.86కు చేరిపోయింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల వరకు కాస్త అప్రమత్తత పాటించడం మంచిదన్న సూచన వ్యక్తమవుతోంది. బుధవారం మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమై, అస్థిరతల మధ్య చలించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 11,750-11,810 తక్షణ నిరోధ స్థాయిలుగా పేర్కొన్నారు. మద్దతు స్థాయిలు 11,660-11,610. లాభాల స్వీకరణ కొనసాగే అవకాశం ఉంటుందని, అదే సమయంలో మార్కెట్లు పెద్దగా పతనం కావన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. కాకపోతే ఫలితాలకు ముందు అస్థిరతలు పెరిగే అవకాశం ఉంటుందని జెమ్‌స్టోన్ ఈక్విటీ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ మిలాన్ వైష్ణవ్ అన్నారు. ఎన్నికల ఫలితాలను మార్కెట్లు సర్దుబాటు చేసుకునే వరకు ట్రేడర్లు అగ్రెస్సివ్ బెట్స్కు దూరంగా ఉండాలని సూచించారు. చాలా మంది మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎన్డీకు మెజారిటీ తీర్పు వస్తుందని భావించడం లేదని ఐఐఎఫ్ఎల్ గ్రూపు చైర్మన్ నిర్మల్ జైన్ పేర్కొన్నారు. అలాగే, మార్కెట్లలో ఎన్నో షార్ట్‌లు ఉన్నట్టు చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వానికి అవకాశం లేకపోలేదన్నారు. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంతో భారత్ ఎక్కువగా ప్రయోజనం పొందుతుందున్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే, పెద్ద ఎత్తున నిధులు భారత్‌కు వస్తాయన్నారు. స్థిరమైన ప్రభుత్వం, సరైన అవకాశాల కోసం పెద్ద ఎత్తున నిధులు వేచి చూస్తున్నట్టు జైన్ చెప్పారు. కొన్ని ఆర్థిక గణాంకాలు మాంద్యాన్ని గుర్తు చేస్తున్నాయని, కానీ క్షేత్ర స్థాయిలోని హోటళ్లు, ఎయిర్‌లైన్స్ పూర్తి సామర్థ్యం మేరకు పనిచేస్తుండడాన్ని గమనిస్తే ఎక్కడో అనుసంధానం తెగిపోయినట్టు కనిపిస్తోందన్నారు. మార్కెట్లు ప్రస్తుత స్థాయిల నుంచి గరిష్టాలకు వెళితే అది మార్కెట్ వ్యాప్త ర్యాలీగా ఉంటుందన్న అంచనా వ్యక్తం చేశారు. మంచి మిడ్‌క్యాప్ స్టాక్స్ విలువలను ప్రజలు గుర్తించడం ప్రారంభించి పెట్టుబడులకు ముందుకు వస్తారని పేర్కొన్నారు.
You may be interested
ఈ ఏడాది మిడ్‌క్యాప్ మెరుగైన పనితీరు: దిపేన్ మెహతా
Wednesday 22nd May 2019స్థిరమైన ప్రభుత్వం, తక్కువ వడ్డీ రేట్లు ఉన్న తరుణంలో నిఫ్టీ, సెన్సెక్స్ కంపెనీలు ఇన్వెస్టర్ల పెట్టుబడులకు ఈ తరుణంలో సరైన ఎంపిక కావని ఎలిగ్జిర్ ఈక్విటీస్ డైరెక్టర్ దీపేన్ మెహతా అభిప్రాయపడ్డారు. మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో టర్న్‌అరౌండ్‌కు అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది బ్లూచిప్ స్టాక్స్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్ స్టాక్స్ పనితీరు మెరుగ్గా ఉండొచ్చని అంచనా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. సూచీలు సోమవారం
39000 దిగువన సెన్సెక్స్
Tuesday 21st May 2019మార్కెట్లో లాభాల స్వీకరణ 119 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ ముంబై: క్రితం ట్రేడింగ్‌లో భారీగా లాభపడిన సూచీల్లో నేడు లాభాల స్వీకరణ జరగడంతో మార్కెట్ నష్టాలతో ముగిసింది. బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్ 382 పాయింట్లను కోల్పోయి 39000 పాయింట్ల దిగువున 38,970, నిఫ్టీ 119 పాయింట్లు నష్టపోయి 11,709.10 పాయింట్ల వద్ద ముగిశాయి. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి ఒడిదుడుకుల ట్రేడింగ్ కూడా మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావాన్ని చూపింది. ఫలితంగా సూచీల మూడురోజుల