News


నేలచూపులు చూస్తోన్న ఏవియేషన్‌ షేర్లు

Monday 12th November 2018
Markets_main1542017404.png-21908

ఏవియేషన్‌ షేర్లకు సోమవారం మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ముడిచమురు ఎగుతుల్లో అతిపెద్ద ఎగుమతిదారైన సౌది అరేబియా డిసెంబర్‌ నుంచి ముడిచమురు సరఫరాను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా సోమవారం ఒక్కరోజులోనే ముడిచమురు ధరలు శాతానికి పైగా ర్యాలీ చేశాయి. చమురు ధరల పెరుగుదలతో రానున్న రోజుల్లో కంపెనీ మార్జిన్లు తగ్గవచ్చనే అంచనాలతో ఏవియేషన్‌ షేర్లు నేడు నేలచూపులు చూస్తున్నాయి. ఏవియేషన్‌ రంగంలో ప్రధాన షేర్లైన జెట్‌ఎయిర్‌వేస్‌, స్పైస్‌జెట్‌, ఇంటర్‌గ్లోబ్‌ఏవియేషన్‌ షేర్లు 4 నుంచి 6.50శాతం నష్టపోయాయి.
జెట్‌ఎయిర్‌వేస్:- నేడు బీఎస్‌ఈలో రూ.256.20ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఏకంగా 7.50శాతం నష్టపోయి రూ.238 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.3:15ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.257.4)తో పోలిస్తే 6శాతం నష్టంతో రూ.242ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.163.00 రూ.883.65లుగా నమోదయ్యాయి. రేపు విడుదల కానున్న జెట్‌ఎయిర్‌వేస్‌ క్యూ2 ఫలితాల్లో కంపెనీ భారీ నష్టాలను ప్రకటిస్తుందనే అంచనాలతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నట్లు విశ్లేషకలు అంచనా వేస్తున్నారు.You may be interested

యూనియన్‌ అభ్యర్థనతో కోల్‌ ఇండియా డౌన్‌

Monday 12th November 2018

ఒకటిన్నర శాతం పతనమై రూ.264 వద్ద ముగింపు కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (సిఐఎల్‌) ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో బిడ్లు దాఖలు చేయవద్దని ఆ రంగ యూనియన్లు ఉద్యోగులను కోరాయి. ప్రైవేటు రంగానికి సంస్థను అప్పజెప్పే ప్రయత్నాలు కొనసాగుతున్నందున ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అందరూ ఈమేరకు కట్టుబడి ఉండాలని కోరింది. నవంబర్‌ 15న ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ప్రారంభంకానుండగా.. సంస్థ ఉద్యోగులకు 5 శాతం డిస్కౌంట్‌తో రూ.252.22 ధరకే 99,00,196 షేర్లను జారీ

‘ఆటో’ ట్రబుల్‌

Monday 12th November 2018

ఆటో రంగ షేర్లు సోమవారం పతనమయ్యాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ 2 శాతానిపైగా పడిపోయింది. 9,047 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఒక్క భారత్‌ఫోర్జ్‌ మినహా ఆటో ఇండెక్స్‌లోని షేర్లన్నీ నష్టపోయాయి. టాటా మోటార్స్‌ భారీగా పతనమైంది. షేరు ధర దాదాపు 5 శాతంమేన నష్టపోయింది. దీని తర్వాత టాటా మోటార్స్‌ డీవీఆర్‌, హీరో మోటొకార్ప్‌ షేర్లు 4 శాతానికిపైగా పడిపోయాయి. ఇక మదర్‌సన్‌ సుమి, అపోలో టైర్స్‌ స్టాక్స్‌ 3

Most from this category