News


నేలచూపులు చూస్తున్న ఏవియేషన్‌ షేర్లు

Wednesday 4th March 2020
Markets_main1583309907.png-32272

  • 52వారాల కనిష్టానికి స్పైస్‌జెట్‌
  • 5శాతం నష్టపోయిన ఇండిగో షేరు

కరోనావ్యాధి వ్యాప్తి భయాలతో ఏవియేషన్‌ షేర్లు నేలచూపులు చూస్తున్నాయి. బీఎస్‌ఈ ఇండెక్స్‌లో బుధవారం చెందిన ఈ రంగ షేర్లు 8శాతం నష్టాలను చవిచూశాయి. చైనాలో అకస్మత్తుగా పుట్టుకొచ్చి ప్రమాదకరంగా కరోనా వైరస్‌ వ్యాధి ఇప్పుడు ప్రపంచదేశాలకు విస్తరించింది. గతంలో సార్స్‌ వ్యాధి ప్రబలిన సమయంలో కొన్ని దేశాలు విమాన సర్వీసులను రద్దు చేయడంతో ఎయిర్‌ ట్రాఫిక్‌, రెవెన్యూ, ఎర్నింగ్‌ బాగా క్షీణించాయి. ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాధి అదే పరిస్థితి పునరావృతం అవుతోందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ విశ్లేషకుడు ఫిలిప్‌ ఏ.బాగ్గలే, రాచెల్ జే. గేరీష్ అభిప్రాయపడ్డారు.

ఎయిర్‌ ఇండియా ఇటలీ, జపాన్‌, కొరియా దేశాలకు తన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. మరోవైపు ఇండిగో సంస్థకు చెందిన 4గురు సిబ్బంది కరోనా వ్యాధి లక్షణాల కారణంగా ఆసుపత్రి పరిశీలనలో ఉన్నారు. క్రిమిరహితంగా ఉండేందుకు విమానాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడంతో పాటు వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి తగిన భద్రతా జాగ్రత్తలు తీసుకోవడానికి సివిల్ ఏవియేషన్ రెగ్యులేటర్ సూచనలు జారీ చేసింది. 

స్పైస్‌జెట్‌ షేరు 8శాతానికి పైగా నష్టపోయి రూ.68.25 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఇండిగో షేరు సైతం 5శాతం నష్టాన్ని చవిచూసింది. ఒకవేళ నేడు ఈ రెండు షేర్లు నష్టాలతో ట్రేడింగ్‌ ముగిస్తే వరుసగా ఇది 5రోజు నష్టాల ముగింపు అవుతోంది. ఇక్రా రేటింగ్‌ ఏజెన్సీ ప్రకారం కరోనా వ్యాధి వ్యాప్తి భయాలతో ఇప్పటికీ దేశీయ విమానయన రంగ షేర్లకు ‘‘నెగిటివ్‌’’ రేటింగ్‌ కొనసాగుతోంది. 

మధ్యాహ్న గం.1:30ని.లకు స్పైస్‌జెట్‌ 5.78 శాతం నష్టంతో రూ.70.05 వద్ద,  ఇండిగో షేరు 3.39శాతం క్షీణించి రూ.1,187.50 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. You may be interested

కరోనా ఎఫ్‌క్ట్‌: భారత్‌ వైపు చూస్తున్న ఎంఎన్‌సీలు!

Wednesday 4th March 2020

కరోనావైరస్‌ ప్రభావంతో మల్టీ నేషనల్‌ కంపెనీ(ఎంఎన్‌సీ)లు అన్ని ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. కోవిడ్‌-19 దాటికీ చైనా మార్కెట్‌ అతలాకుతలమవ్వడం, దీనిపై ఆధారపడ్డ కంపెనీలన్నీ ఆర్థికంగా నష్టపోతుండడంతో... గ్లోబల్‌ కంపెనీలన్నీ పెట్టుబడులు పెట్టేందుకు చైనాకు ప్రత్యామ్నాయంగా ఇండియా వైపు చూస్తున్నాయని యూబీఎస్‌ తాజాగా ఇచ్చిన నివేదికలో వెల్లడించింది.కాగా యూబీఎస్‌ గతేడాది డిసెంబర్‌ నుంచి ఈ ఏడాది జనవరి మధ్యకాలంలో 450 మంది సీనియర్‌ ఎక్సిక్యూటివ్‌లను సంప్రదించి ఈ నివేదికను

భారీ ట్రేడింగ్‌తో ఈ షేర్లు జూమ్‌

Wednesday 4th March 2020

కరోనా భయాలతో దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తున్నాయి. లాభనష్టాల మధ్య కదులుతున్నాయి. మధ్యాహ్నం 12.30 ప్రాంతంలో సెన్సెక్స్‌ 143 పాయింట్లు క్షీణించి 38,480కు చేరగా. నిఫ్టీ 34 పాయింట్లు తక్కువగా 12,269 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం జోరం‍దుకుంది. అంతేకాకుండా ఈ కౌంటర్లలో కొనుగోళ్లు పెరగడంతో భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. జాబితాలో ఈక్లర్క్స్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌,

Most from this category