News


విమానయాన రంగం తిరిగి పుంజుకోనుంది

Saturday 20th July 2019
Markets_main1563598722.png-27198

బోర్డు రూమ్‌ వివాదాలు, రుణాల భారం, భవిష్యత్తుపై అనుమానాలు వలన విమానయాన పరిశ్రమ ఇటివల అందరి దృష్ఠిని ఆకర్షిస్తోంది. సాధరణంగా ఈ పరిశ్రమ అధిక స్థిర ఆస్తి వ్యయాన్ని కలిగి ఉంటుంది. ఫలితంగా ఈ రంగంలో మార్జిన్లు తక్కువగా ఉంటాయి. వీటికి తోడు విమానయాన రంగ కంపెనీలు సంక్షోభం‍లో చిక్కుకోవడంతో ఈ రంగం ​చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ మూతపడడంతో పాటు తాజాగా ఇండిగో సంస్థ యాజమాన్య గొడవలు విమానయాన మంత్రిత్వ శాఖకు, సెబీకి వెళ్లడంతో విమానయాన రంగంపై  ఇన్వెస్టర్లు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులన్ని ఏవియేషన్‌ రంగానికి నెగిటివ్‌ ఔట్‌లుక్‌నిస్తున్నాయి. 
    భారతదేశం నుంచి అంతర్జాతీయ గమ్యస్థానాలకు చేరే  విమానాల కోసం తాజాగా పాకిస్తాన్ ఎయిర్‌స్పేస్ మేనేజ్‌మెంట్ తన గగనతలం తెరవడంతో కొంత సానుకూలత కూడా ఉంది. దీనివలన  పరిశ్రమకు రూ. 6,500 కోట్ల ఖర్చులు ఆదా అవుతాయి. అంతేకాకుం‍డా అధిక ఖర్చు భయాలతో నిలిపివేసిన  కొన్ని విమానాలను తిరిగి ప్రారంభించటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ‘విమాన ఫైనాన్సింగ్, లీజింగ్ కార్యకలాపాలకు గ్లోబల్ హబ్’ గా భారతదేశాన్ని మార్చాలనే కలను నెరవేర్చడానికి బడ్జెట్ 2019 లో ఆర్థిక మంత్రి వివిధ నిబంధనలను ప్రతిపాదించారు.  సివిల్ ఏవియేషన్ పరిశ్రమకు రూ.6,602 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇది పరిశ్రమ తిరిగి కోలుకోడానికి సహాయపడుతుంది. సమస్యల్లో ఉన్న విమానయాన రంగం  ఈ అంశాల వలన కొంత సానుకూలతలను చూసిందని, సమీప భవిష్యత్తులో ఈ రంగంపై బుల్లిష్‌ ఆశలున్నాయని పరిశీలకులంటున్నారు.



You may be interested

కొన్ని ప్రధాన కంపెనీల క్యూ1 ఫలితాలు

Saturday 20th July 2019

డాబర్‌ ఇండియా లాభం రూ.364 కోట్లు 10 శాతం వృద్ధి  9 శాతం వృద్ధితో రూ.2,273 కోట్లకు ఆదాయం  న్యూఢిల్లీ: దేశీయ ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం డాబర్‌ ఇండియా  నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో 10 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.330 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.364 కోట్లకు పెరిగిందని డాబర్‌ ఇండియా తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.2,081 కోట్ల నుంచి 9

ఫుట్‌బాల్ మ్యాచ్ టికెట్లు, వాచీలు..

Saturday 20th July 2019

రేటింగ్‌ ఏజెన్సీల అధికారులకు లంచాలు  మెరుగైన రేటింగ్‌ పొందేందుకు అడ్డదారులు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ స్కామ్‌లో వెలుగులోకి నిజాలు న్యూఢిల్లీ: వేల కోట్ల రుణాల డిఫాల్ట్‌తో మార్కెట్లను అతలాకుతలం చేసిన ఇన్‌ఫ్రా ఫైనాన్స్‌ సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ కుంభకోణంలో విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అధిక రేటింగ్‌ పొందేందుకు కంపెనీ మేనేజ్‌మెంట్‌ ఏ విధంగా అడ్డదారులు తొక్కినదీ వివరాలన్నీ ఒక్కొక్కటిగా బైటికొస్తున్నాయి. రేటింగ్‌ ఏజెన్సీల అధికారులకు ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ టికెట్ల నుంచి వాచీలు, షర్టుల దాకా  తాయిలాలిచ్చి ఏ

Most from this category