News


ఎవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ 4 శాతం డౌన్‌

Monday 2nd March 2020
Markets_main1583129120.png-32211

సోమవారం ఎవెన్యూ సూపర్‌ మార్ట్‌ షేరు 4 శాతం పడిపోయింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో 4.04 శాతం తగ్గి 2, 230 వద్ద ట్రేడ్‌ అవుతోంది. భారీ హెచ్చుతగ్గులను నివారించడానికి స్టాక్‌ఎక్సేంజ్‌ ఎవెన్యూ సూపర్‌ మార్ట్స్‌(డీమార్ట్‌) షేర్లను  ట్రేడ్‌ టు టేడ్ర్‌ (టీ సెగ్మెంట్‌)లోకి శుక్రవారం మార్చింది. దీంతో నేడు షేరు 4 శాతం పడిపోయింది. టీసెగ్మెంట్‌లో ఉన్న షేర్లను... ఇన్వెస్టర్లు కొన్న షేర్లను అమ్మడానికిగానీ, అమ్మిన షేర్లను అదేరోజు కొనుక్కోవడానికి గాని వీలుండదు. అంతేగాక ఈ షేర్లు 5 శాతం మాత్రమే పెరిగే అవకాశంతోపాటు 5శాతం మాత్రమే తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎవెన్యూ సూపర్‌ మార్ట్‌తో పాటు ఎవరెడీ ఇండస్ట్రీస్‌ను కూడా స్టాక్‌ ఎక్సేంజ్‌ ట్రేడ్‌ టు ట్రేడ్‌ కేటగిరిలోకి మార్చింది. ఇది మార్చి 4నుంచి ‘ఏ’ గ్రూప్‌లో కొనసాగనుంది.You may be interested

వేదాంత షేరు 2% అప్‌!

Monday 2nd March 2020

సోమవారం వేదాంత కంపెనీ షేరు 2 శాతం పెరిగింది. ఉదయం 11గంటల ప్రాంతంలో వేదాంత షేరు 2.41 శాతం పెరిగి 116.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీపీసీఎల్‌) మెజారిటీ వాటాను కొనేందుకు అందరికంటే ముందు ఆసక్తి కనబర్చిన వేదాంత కంపెనీ ప్రస్తుతం వెనకడుగు వేసింది. బీపీసీఎల్‌ కంపెనీ​విలువ చాలా ఎక్కువగా ఉందని, తుది బిడ్డింగ్‌ పత్రం వచ్చిన తర్వాత పరిశీలిస్తామని వేదాంత కంపెనీ అధినేత అనీల్‌

మార్కెట్లపై కాకుండా స్టాక్స్‌పై దృష్టి పెట్టండి!

Monday 2nd March 2020

స్టాక్స్‌ ధరలు అందుబాటులో ఉన్నప్పుడు కొనుగోలు చేయండి మార్కెట్లు ఎప్పుడు బాటమవుట్‌ అవుతాయన్నది చెప్పలేం - జోనాథన్‌ షీల్‌, ఐఐఎఫ్‌ఎల్‌ ఫండ్‌ మేనేజర్‌ కరోనా సృష్టిస్తున్న విలయంకారణంగా ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు పతనమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొనుగోలు అవకాశాల కోసం చూడవచ్చు. అయితే మార్కెట్లు ఎక్కడ బాటమ్‌అవుట్‌ అవుతాయన్నది అంచనా వేయలేమంటున్నారు జోనాథన్‌ షీల్‌. కరోనా వైరస్‌, కేంద్ర బ్యాంకులు, మార్కెట్లు తదితర అంశాలపై ఐఐఎఫ్‌ఎల్‌ ఫండ్‌ మేనేజర్‌ జోనాథన్‌ ఒక ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలను

Most from this category