News


అవంతీ ఫీడ్స్‌ పతనం- గ్రాన్యూల్స్‌ జోరు

Wednesday 5th February 2020
Markets_main1580881337.png-31523

13 శాతం కుప్పకూలిన అవంతీ
5 శాతం జంప్‌చేసిన గ్రాన్యూల్స్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో ఆక్వా రంగ కంపెనీ అవంతీ ఫీడ్స్‌ కౌంటర్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. అయితే మరోపక్క అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్‌ఎఫ్‌డీఏ) నుంచి ఏఎన్‌డీఏకు అనుమతి లభించినట్లు వెల్లడించడంతో ఫార్మా రంగ కంపెనీ గ్రాన్యూల్స్‌ ఇండియా జోరందుకుంది.

అవంతీ ఫీడ్స్‌ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌- డిసెంబర్‌)లో అవంతీ ఫీడ్స్‌ లిమిటెడ్‌ నికర లాభం 35 శాతం క్షీణించి రూ. 48 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నిర్వహణ లాభం సైతం 36 శాతం వెనకడుగుతో రూ. 73 కోట్లకు చేరింది. అయితే మొత్తం ఆదాయం మాత్రం 10 శాతం పుంజుకుని రూ. 923 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో అవంతీ ఫీడ్స్‌ షేరు దాదాపు 13 శాతం కుప్పకూలి రూ. 585 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 566 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.  

గ్రాన్యూల్స్‌ ఇండియా
సైటోమెగలోవైరస్‌ కారక వ్యాధుల చికిత్సకు వినియోగించే ఏఎన్‌డీఏకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుం‍చి గ్రీన్‌సిగ్నల్‌ లభించినట్లు గ్రాన్యూల్స్‌ ఇండియా తాజాగా వెల్లడించింది. వల్గన్సిక్లోవిర్‌ హైడ్రోక్లోరైడ్‌గా పేర్కొనే ఈ ఔషధం 50 ఎంజీ, ఎంఎల్‌ డోసేజీలలో విక్రయించేందుకు వీలు చిక్కినట్లు తెలియజేసింది. ఇది రోషే పాలో ఆల్టో కంపెనీ ఔషధం వాల్సైట్‌కు జనరిక్‌ రూపమని పేర్కొంది. యాంటీవైరల్‌ ఔషధంగా వినియోగమవుతుందని వివరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో గ్రాన్యూల్స్‌ ఇండియా షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 154 వద్ద ట్రేడవుతోంది. కంపెనీలో ప్రమోటర్లకు 42.90% వాటా ఉంది. 
 



You may be interested

నేటి వార్తల్లోని షేర్లు

Wednesday 5th February 2020

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం స్టాక్‌ మార్కెట్‌లో ప్రభావితమయ్యే షేర్లు రిలయన్స్‌ ఇన్‌ఫ్రా: రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనీల్‌ అంబానీ కుమారులు జై అనమోల్‌ అంబానీ, జై అన్షల్‌ అంబానీలు రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బోర్డుకు నియమితులైన ఆరునెలల్లోనే రాజీనామా చేశారు. ఐఓసీ:  ఇజ్రాయిల్‌కు చెందిన బ్యాటరీ డెవలపర్‌ ఫినర్జీలో ఐఓసీ చిన్నమొత్తం వాటాను కొనుగోలు చేసినట్లు అధికారిక ప్రకటనలో వెల్లడించింది సన్‌ఫార్మా: పెద్ద పరిమాణంలో ఇబ్బంది పెట్టె మొటిమలను నివారించేందుకు ఆబ్సొరికా ఎల్‌డీ క్యాప్య్సూల్‌లను

టాటా గ్లోబల్‌- భారత్‌ వైర్స్‌ హైజంప్‌

Wednesday 5th February 2020

సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ 12,000 పాయింట్లకు ఎగువన నిఫ్టీ  వరుసగా మూడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10.15 ప్రాంతంలో సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ చేసింది. 204 పాయింట్లు పెరిగి 40,994 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 56 పాయింట్లు పుంజుకుని 12,035 వద్ద ట్రేడవుతోంది. వెరసి సెన్సెక్స్‌ 41,000 పాయింట్ల మా‍ర్క్‌కు చేరువకాగా.. నిఫ్టీ 12,000 పాయింట్ల మైలురాయికి ఎగువన కదులుతోంది. ఈ నేపథ్యంలో

Most from this category