STOCKS

News


పండుగ సీజన్‌ ముగిసింది.. ఆటో షేర్లు కొనొచ్చా?

Friday 22nd November 2019
Markets_main1574398680.png-29779

ఆటో కంపెనీల విక్రయాలకు జోష్‌నిచ్చే పండుగ సీజన్‌ ముగిసింది. దీంతో మరో రెండు మూడు నెలల పాటు నెలవారీ ఆటో విక్రయాలు సాధారణంగా ఉండొచ్చని అంచనాలున్నాయి. ఆటో అమ్మకాల జోరు తగ్గే నేపథ్యంలో ఆటో కంపెనీల షేర్లపై నిపుణుల అభిప్రాయాలు మాత్రం బుల్లిష్‌గానే ఉన్నాయి. గతాన్ని పరికిస్తే ఆటో స్టాకులు పండుగ సీజన్‌ అనంతరం ఆటో షేర్ల జోరు కొనసాగడం కనిపిస్తుంది. నవంబర్‌, డిసెంబర్‌లో నిఫ్టీతో పోలిస్తే నిఫ్టీ ఆటో సూచీ గడిచిన పదేళ్లలో 8 సార్లు మెరుగైన ప్రదర్శన జరిపిందని ఐడీఎఫ్‌సీ గణాంకాలు చెబుతున్నాయి. రెండు నెలల ఉమ్మడి ప్రదర్శనను పరిగణిస్తే పదేళ్లలో ప్రధాన సూచీ కన్నా ఆటో సూచీ 2 శాతం అధిక రాబడినిచ్చింది. అత్యధికంగా 2009లో ఆటో సూచీ చివరి రెండు నెలల్లో దాదాపు 17.4 శాతం లాభం ఇచ్చింది. అత్యల్పంగా 2011లో -14 శాతం నష్టం చూసింది. గత మూడు నెలలుగా ప్రధాన సూచీ కన్నా ఆటో సూచీ సుమారు 4 శాతం లాభంలో కొనసాగుతోంది. 2011 తర్వాత వరుసగా మూడు నెలలు లాభాలు ఆ తర్వాత నెల ప్రాఫిట్‌ బుకింగ్‌ నమోదు కావడం ఇదే తొలిసారి.

ఈ రెండు నెలల్లో వాల్యూంలు తగ్గినా సైక్లిక్స్‌ పుంజుకోవడమనే అంశం ఆటో షేర్లను లాభాల్లో నడిపిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందువల్ల ఒకవేళ ప్రస్తుతం ఆటో సూచీ, షేర్లలో చిన్నపాటి వెనుకంజ కనిపించినా లాంగ్స్‌ తీసుకోవచ్చని ఐడీఎఫ్‌సీ సూచించింది. నిఫ్టీ ఆటో లాంగ్స్‌కు 9050 పాయింట్లను టార్గెట్‌గా పేర్కొంది. హీరో, టీవీఎస్‌, ఐషర్‌, మారుతీ వాహనాల విక్రయాల్లో జోరు కొనసాగవచ్చని అంచనా వేసింది. నిఫ్టీ ఆటో సూచీ ప్రస్తుతం 8000 పాయింట్లకు అటు ఇటుగా కదలాడుతోంది.



You may be interested

రిలయన్స్‌ అప్‌... ఎయిర్‌టెల్‌, ఐడియా డౌన్‌..!

Friday 22nd November 2019

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌ఎస్‌బీసీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేయడంతో శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో ఈ కంపెనీ షేరు 2శాతం ర్యాలీ చేసింది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.1543.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. జియో, రిటైల్‌ వ్యాపార రంగాల అత్యుత్తమ ప్రదర్శన అప్‌సైడ్‌ ట్రెండ్‌ను కొనసాగిస్తాయని హెచ్ఎస్‌బీసీ తన నివేదికలో తెలిపింది. అలాగే రిలయన్స్‌ కన్జూ‍్యమర్‌ వ్యాపారం కూడా కంపెనీ వృద్ధికి తోడ్పతుందని తెలిపింది. ప్రస్తుత

ప్లాట్‌గా రూపీ

Friday 22nd November 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో శుక్రవారం సెషన్లో 71.75 వద్ద ప్లాట్‌గా ప్రారంభమైంది. కాగా ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ బలహీనపడడంతో పాటు, చమురు ధరలు తగ్గడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో ప్రారంభ నష్టాల నుంచి కోలుకొని చివరికి 5 పైసలు బలపడి 71.76 వద్ద ముగిసింది. యుఎస్-చైనా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి కొనసాగడంతో చమురు ధరలు నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో డాలర్‌-రూపీ నవంబర్‌ కాంట్రాక్ట్‌

Most from this category