News


నష్టాల బాటలో అటో రంగ షేర్లు

Wednesday 25th September 2019
Markets_main1569403395.png-28544

మార్కెట్లో నెలకొన్న అమ్మకాల్లో భాగంగా అటో రంగ షేర్లు బుధవారం నష్టాల బాట పట్టాయి. నేడు ఎన్‌ఎస్‌ఈలో అటోరంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ 4.50శాతం క్షీణించింది. కేంద్రం ప్రకటించిన కార్పొరేట్‌ పన్ను తగ్గింపు వల్ల దేశీయ అటోపరిశ్రమకు పెద్దగా మేలు జరగదని జెఫరీస్‌ లాంటి బ్రోకరేజ్‌ సంస్థలు ప్రకటించాయి. అలాగే మార్కెట్లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి కూడా అటో రంగ షేర్లపై ప్రభావాన్ని చూపుతుంది. నేటి మార్కెట్‌ ప్రారంభం నుంచి ఈ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. అత్యధికంగా టాటామోటర్స్‌ షేర్లు 6.50శాతం నష్టపోయాయి. మదర్‌సుమీ 6శాతం, అశోక్‌ లేలాండ్‌ 5.50శాతం, టీవీఎస్‌ మోటర్స్‌, మారుతి సుజుకీ, ఐషర్‌మోటర్స్‌ షేర్లు 5శాతం క్షీణించాయి. ఎంఅండ్‌ఎం, భారత్‌ ఫోర్జ్‌ 4శాతం, ఎక్సైడ్‌, భాష్‌ లిమిటెడ్‌ 3.50శాతం, హీరోమోటోకార్ప్‌, ఎంఆర్‌ఎఫ్‌, అమరరాజాబ్యాటరీస్‌ షేర్లు 2శాతం, అపోలోటైర్స్‌, బజాజ్‌ అటో షేర్లు 1శాతం క్షీణించాయి. ఇండెక్స్‌ మధ్యాహ్న గం.2:30లకు క్రితం ముగింపు(7,773.25)తో పోలిస్తే 4శాతం నష్టంతో 7,461.50 వద్ద ట్రేడ్‌ అవుతోంది. You may be interested

మార్కెట్‌ పతనానికి ‘‘పంచ’’ కారణాలివే..!

Wednesday 25th September 2019

మార్కెట్‌ బుధవారం భారీగా నష్టపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ప్రతిపక్ష పార్టీ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం,  ఆసియా అంతటా మందగమనం వ్యాపించిందనే సంకేతాలు  ఆసియా డెవెలప్‌మెంట్‌ బ్యాంక్‌ నుంచి వెలువడటం వంటి కారణాలతో పాటు లాభాల స్వీకరణ తోడవ్వడంతో మార్కెట్‌ అమ్మకాలు అడ్డూఅదుపు లేకుండా పోయాయి. సెన్సెక్స్‌ 581 పాయింట్లు నష్టపోయి 38,510.97 వద్ద, నిఫ్టీ 166 పాయింట్లను కోల్పోయి 11,421.80 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ మిడ్‌క్యాప్‌,

ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్ల భారీ పతనం

Wednesday 25th September 2019

వరుసగా రెండోరోజూ ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ బుధవారం ఉదయం సెషన్‌లో 4శాతం నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 2,495.45 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇండెక్స్‌ ఒకదశలో 4శాతం క్షీణించి 2,421.15 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. ఈ రంగానికి

Most from this category