News


తగ్గిన వాహన విక్రయ రిజిస్ట్రేషన్లు: నష్టాల బాటలో అటోషేర్లు

Wednesday 22nd January 2020
news_main1579677296.png-31098

వరుసగా రెండోరోజూ అటో రంగ షేర్లు నష్టాల బాటపట్టాయి. డిసెంబర్‌లో అటో రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణమైంది. గతేడాది డిసెంబర్‌లో వాహనాల రిజిస్ట్రేషన్లు 15శాతం తగ్గినట్లు పట్టినట్లు మంగళవారం ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య (ఎఫ్‌ఏడీఏ) గణాంకాలు వెల్లడించాయి. పండుగ సీజన్‌ సందర్భంగా 2019లో అక్టోబర్‌, నవంబర్‌లో వాహన అమ్మకాలుగా పెరిగాయి. ఈ తర్వాత నెల డిసెంబర్‌లో డిమాండ్‌ తగ్గడంతో అమ్మకాలు క్షీణించాయని ఎఫ్‌ఏడీఏ తెలిపింది. ఆఫర్లు అందుబాటులో ఉన్నా కొనుగోళ్లు ఆశించినంత లేవని ఎఫ్‌ఏడీఏ చెప్పుకొచ్చింది. ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేకపోవడంతో అటో రంగ షేర్లు వరుసగా రెండో ట్రేడింగ్‌ సెషన్‌లో నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ 1.20శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.12:30ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(8147.15)తో పోలిస్తే 1శాతం నష్టంతో 8,170.50వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో టాటామోటర్స్‌ అత్యధికంగా 3శాతం నష్టపోయింది. మారుతి 2శాతం, భారతీ ఫోర్జ్‌, భాష్‌ లిమిటెడ్‌ షేర్లు 1శాతం క్షీణించాయి. అపోలో టైర్స్‌, బజాజ్‌ అటో, అశోక్‌ లే లాండ్‌ షేరు అరశాతం పతనమయ్యాయి. మదర్‌ సుమీ, హీరో మోటో కార్ప్‌, ఎఅండ్‌ంఎ షేరు 0.10శాతం నష్టపోయాయి. ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ 1.50శాతం లాభపడ్డాయి. ఎంఆర్‌ఎఫ్‌ అరశాతం, ఐషర్‌ మోటర్స్‌, టీవీఎస్‌ షేర్లు అరశాతం లాభపడ్డాయి. 



You may be interested

లో బడ్జెట్‌ ఐ ఫోన్‌ వచ్చేస్తుంది!

Wednesday 22nd January 2020

తక్కువ ధరతో ఐ ఫోన్‌! మార్చినాటికి మార్కెట్లో విడుదల మార్కెట్లోకి  కొత్త స్మార్ట్‌ ఫోన్లు ఎన్ని వచ్చినా.. ఐఫోన్‌కు ఉండే క్రేజ్‌ ఏమాత్రం తగ్గదు. క్రేజ్‌కు తగ్గట్టుగానే దీని ధరం కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే ఎక్కువమంది వినియోగదారులకు ఐఫోన్‌ను చేరువచేసేందుకు యాపిల్‌ కంపెనీ తక్కువ ధరలో ఐఫోన్‌ను త్వరలో విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో వచ్చేనెల ఫిబ్రవరి నుంచి ఈ కొత్త  ఐఫోన్‌ విడిభాగాల అసెంబ్లింగ్‌ను ప్రారంభించనుంది. ఈ ఫోన్‌ను  మార్చినాటికి వినియోగదారులకు

కోటక్‌పై అంచనాలు తగ్గించిన బ్రోకరేజ్‌లు

Wednesday 22nd January 2020

డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాల అనంతరం కోటక్‌ మహీంద్రా బ్యాంకు ఎర్నింగ్స్‌ అంచనాలను బ్రోకరేజ్‌లు తగ్గించాయి. క్యు3లో బ్యాంకు నికర లాభం 24 శాతం పెరిగి రూ. 1596 కోట్లకు చేరింది. అయితే ఇది అనలిస్టుల అంచనాల కన్నా తక్కువ. బ్యాంకు ఈ త్రైమాసికంలో రూ. 444 కోట్ల ప్రొవిజన్లు కేటాయించింది. దీంతో బ్యాంకు షేరుపై బ్రోకరేజ్‌ల అంచనాలు తగ్గుముఖం పట్టాయి. ఫలితాల అనంతరం బ్యాంకు షేరు నెగిటివ్‌గా కొనసాగుతోంది. బ్యాంకు

Most from this category