News


ఆటో స్టాక్స్‌ కొనుగోళ్లకు ఇది అనువైన సమయమా?

Wednesday 20th March 2019
Markets_main1553105542.png-24719

ఆటో స్టాక్స్‌ ఎర్నింగ్స్‌ పట్ల ఆశావహ అంచనాలు లేకపోయినప్పటికీ సమీప కాలంలో ఆకర్షణీయంగా మారొచ్చన‍్న అభిప్రాయాలు విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి కరెక్షన్‌ నేపథ్యంలో స్టాక్స్‌ చౌకగా మారాయని, దీర్ఘకాలం కోసం వీటిని ఎంచుకోవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ ఏడాది బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఇప్పటి వరకు 5.7 శాతం మేర ర్యాలీ చేయగా, ఇదే కాలంలో ఆటో ఇండెక్స్‌ 5.52 శాతం పడిపోయింది. కారణం అమ్మకాలు బలహీనంగా ఉండడం వల్లే. మెటల్స్‌ తర్వాత అత్యంత దారుణ పనితీరు ఆటోనే అంటున్నారు విశ్లేషకులు. తక్కువ డిమాండ్‌ కారణంగా డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించిన ఫలితాల విషయంలో ఆటో కంపెనీలు ఇన్వెస్టర్లను నిరాశపరిచిన విషయం గమనార్హం. అధిక చమురు ధరలకుతోడు, బీమా వ్యయాలు వంటివి ప్రభావం చూపించాయి. అయితే, మార్చి త్రైమాసికం ఫలితాలపైనా ఇదే రకమైన ప్రభావం ఉండొచ్చంటున్నారు విశ్లేషకులు. 

 

బీఎస్‌ఈ ఆటో ఇండెక్స్‌లో 16 కంపెనీలకు గాను 12 కంపెనీలు ఈ ఏడాది ఇన్వెస్టర్లు సంపదకు చిల్లుపెట్టినవే. మహీంద్రా అండ్‌ మహీంద్రా షేరు ఒక్కటే 13.45 శాతం పడిపోయింది. ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలు కూడా ఆశాజనకంగా లేవని బీఎన్‌పీ పారిబాస్‌ ఈక్విటీ స్ట్రాటజిస్ట్‌ మనిషి రాయ్‌చౌదరి పేర్కొన్నారు. ‘‘ఇది ఇన్వెస్టర్లకు కొనుగోళ్లకు అవకాశంగా భావిస్తున్నాం. మధ్య కాలానికి ప్రీమియం ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాల విస్తరణ గణనీయంగా పెరగనుంది’’ అని ఆయన చెప్పారు. కీలకమైన ఉత్పత్తుల విభాగంలో ఉన్నవి లేదా బలమైన డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ ఉన్నవి మార్కెట్‌ వాటాను రానున్న కాలంలో పెంచుకునే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ రంగంలో కేవలం కొన్ని ఎంపికలకే పరిమితమయ్యే వారికి మంచి అవకాశాలు ఉన్నాయన్నారు.  ఈ ఏడాది హీరో మోటోకార్ప్‌, టీవీఎస్‌ మోటార్‌ షేర్లు 12 శాతం వరకు నష్టపోయాయి. మారుతి సుజుకి 5 శాతం నష్టపోయిన విషయం గమనార్హం. మారుతి సుజుకి తదితర కంపెనీల విక్రయాల్లో మందగమనం రానున్న కొన్ని నెలల పాటు కొనసాగుతుందని సెంట్రమ్‌ వెల్త్‌మేనేజ్‌మెంట్‌ ఈక్విటీ అడ్వైజరీ హెడ్‌ దేవాంగ్‌మెహతా అభిప్రాయపడ్డారు. దేశీయ వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేసుకోవచ్చేమో గానీ, అలా అని రద్దు చేసుకునే అవకాశం లేదన్నారు. మారుతి, ఎంఅండ్‌ఎం గ్రామీణ, చిన్న పట్టణాల్లో మంచిగా పుంజుకునే అవకాశం ఉందన్నారు.You may be interested

ఈ విడత ర్యాలీలో లీడర్లు మారారు!

Wednesday 20th March 2019

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి 38,989 (2018 ఆగస్ట్‌లో నమోదైన)కు 603 పాయింట్ల (1.6 శాతం) దూరంలోనే ఉంది. మరి ఈ విడత మార్కెట్‌ పరుగుకు ప్రధాన గుర్రాలు ఏవనుకుంటున్నారు... ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, యాక్సిస్‌ బ్యాంకు, ఇన్ఫోసిస్‌గా విశ్లేషకులు పేర్కొంటున్నారు. సూచీలు ఆల్‌టైమ్‌ గరిష్టాలను టచ్‌ చేస్తాయని, అదే సమయంలో ఇండెక్స్‌లోని చాలా స్టాక్స్‌ గత గరిష్ట స్థాయిలను చేరుకోకపోవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది.

సెన్సెక్స్‌ ప్లస్‌, నిఫ్టీ మైనస్‌

Wednesday 20th March 2019

ఏడురోజుల సుధీర్ఘ ర్యాలీ తర్వాత సూచీలు బుధవారం మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్‌ 23 పాయిం‍ట్ల లాభంతోనూ 38387 వద్ద, నిఫ్టీ 11 నష్టంతోనూ 11521 వద్ద స్థిరపడ్డాయి. ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ కారణంగా బ్యాంక్‌ నిఫ్టీ 65పాయింట్లు లాభపడి 29,832 వద్ద స్థిరపడింది. సూచీలు వరుస ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు తోడు  ఫెడరల్‌ రిజర్వ్ పాలసీ సమీక్ష, చైనా, అమెరికా మధ్య వాణిజ్య వివాద చర్చలు

Most from this category