News


అటోరంగ షేర్ల పరుగు

Wednesday 27th November 2019
Markets_main1574833447.png-29893

మార్కెట్‌ ప్రారంభంలో అటోరంగ షేర్లు పరుగులు పెడుతున్నాయి. నేడు జరగనున్న కేంద్ర కేబినేట్‌ సమావేశంలో.... కాలం చెల్లిన వాహనాలను వినియోగం నుంచి తొలిగించేందుకు ప్రభుత్వం రూపొందించిన వెహికిల్ స్క్రాప్ పాలసీకి ఆమోదం లభించవచ్చనే అంచనాలు అటో రంగ షేర్లకు డిమాండ్‌ను పెంచుతున్నాయి.ఎన్‌ఎస్‌ఈలో అటోరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ 2శాతం పెరిగింది. భారత్‌ ఫోర్జ్‌ 3శాతం, టాటామోటర్స్‌, ఎంఅండ్‌ఎం, అశోక్‌లేలాండ్‌ షేర్లు 2.50శాతం లాభపడ్డాయి. మారుతి, ఐషర్‌ మోటర్స్‌, టీవీఎస్‌ మోటర్స్‌, హీరోమోటో కార్ప్‌ షేర్లు 2 శాతం ర్యాలీ చేశాయి. భాష్‌ లిమిటెడ్‌, బజాజ్‌ అటో, అపోలో టైర్స్‌ షేర్లు 1శాతం పెరిగాయి. ఎంఆర్‌ఎఫ్‌, మదర్‌సుమీ అరశాతం లాభపడ్డాయి. అమరరాజా బ్యాటరీస్‌, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేరు అరశాతం లాభపడ్డాయి. ఉదయం గం.10:00లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు (8,099.90)తో పోలిస్తే 1.75శాతం లాభంతో 8,240.95 వద్ద ట్రేడ్ అవుతోంది. 



You may be interested

2020లో మార్కెట్‌ ర్యాలీ పరిమితం!

Wednesday 27th November 2019

రాయిటర్స్‌ పోల్‌లో అంచనాలు దేశీయ మార్కెట్లు వచ్చే ఏడాది కూడా అప్‌మూవ్‌ చూస్తాయని, కాకపోతే పరుగులు చాలా పరిమితంగా ఉంటాయని రాయిటర్స్‌పోల్‌లో పాల్గొన్న ఈక్విటీ నిపుణులు అత్యధికులు అంచనా వేశారు. విత్త ఉద్దీపనలు, ఆర్‌బీఐ సరళీకృత మానిటరీ పాలసీలు దేశ ఆర్థిక మందగమనాన్ని నిరోధించలేకపోతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. అందువల్ల ఈ ప్రభావంతో ఈక్విటీ జోరు కొంత మేరే ఉంటుందని తెలిపారు. ఆర్‌బీఐ, ప్రభుత్వం తీసుకునే చర్యలు క్రమానుగత రికవరీకి దోహదం చేస్తాయని,

సిటీ టాప్‌ మిడ్‌క్యాప్‌ సిఫార్సులు

Wednesday 27th November 2019

మిడ్‌క్యాప్‌ స్టాకులు ర్యాలీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయా? బెంచ్‌మార్క్‌ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ మంగళవారం సెషన్‌లో కొత్త గరిష్ఠాలకు చేరుకోవడంతో, ఈ ర్యాలీ అండర్‌పెర్ఫార్మ్‌ చేస్తున్న మిడ్‌క్యాప్‌ స్టాకుల వైపు మరలుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సెన్సెక్స్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 30 శాతం అండర్‌పెర్ఫార్మ్‌ చేస్తుండడంతో, ఈ సమయంలో మిడ్‌క్యాప్‌లను కొనుగోలుచేయడం మంచిదని సిటీ పేర్కొంది.‘సాధరణంగా ఆర్థిక వ్యవస్థ బాగున్నప్పుడు మిడ్‌క్యాప్‌లు మంచి ప్రదర్శన చేస్తుంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితులలో ఈ నిర్ణయాన్ని

Most from this category