News


టాప్‌గేర్లో ఆటో రంగ షేర్ల ర్యాలీ

Tuesday 27th August 2019
Markets_main1566896059.png-28050

నెమ్మదించిన వాహనరంగాన్ని పరుగులు పెట్టేందుకు కేంద్రం ఉపశమన చర్యలు ప్రకటించడంతో రెండోరోజూ ఆటో షేర్లు ర్యాలీ చేస్తున్నాయి.  వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజు వాయిదా వేయడం, ప్రభుత్వ విభాగాలు పెట్రోలు, డిజిల్‌ వాహనాలు కొనుగోలు చేయకుండా ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం, వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనుగోలు చేసే బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్‌ గడువు మొత్తం వరకు కొనసాగించడం లాంటి పలు ఉద్దీపన చర్యలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి ఆటో రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లబిస్తోంది. ఇండెక్స్‌ నిన్నటి ట్రేడింగ్‌లో అరశాతానికి పైగా ర్యాలీ చేసింది. నిన్నటి లాభాల ట్రేడింగ్‌నకు కొనసాగింపుగా నేటి ట్రేడింగ్‌లోనూ ఆటో రంగ షేర్లు లాభాల బాటపట్టాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఆటోరంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒకదశలో 2.50శాతం పెరిగి 7,185.00 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఇండెక్స్‌లో అత్యధికంగా టాటామోటర్స్‌ షేర్లు 7.50శాతం లాభపడ్డాయి. అలాగే అశోక్‌ లేలాండ్‌ 5.50శాతం పెరిగాయి. అలాగే అపోలో టైర్స్‌ 3.50శాతం, ఐషర్‌మోటర్స్‌ షేర్లు 3శాతం, ఎక్సైడ్‌ షేర్లు 2.50శాతం, భాష్‌ లిమిటెడ్‌, బజాజ్‌ ఆటో, ఎంఅండ్‌ఎం, భారత్‌ ఫోర్జ్‌ షేర్లు 2శాతం లాభపడ్డాయి. అలాగే హీరోమోటోకార్ప్‌, అమరరాజా బ్యాటరీస్‌, మదర్‌సుమీ, మారుతి, టీవీస్‌ మోటర్స్‌ షేర్లు 1శాతం నుంచి అరశాతం పెరిగాయి.



You may be interested

కొనడానికి తొందరొద్దు!

Tuesday 27th August 2019

ప్రస్తుత ర్యాలీ స్వల్పకాలికమే ముందుంది మరింత పతనం దీర్ఘకాలిక పెట్టుబడులను ఎంచుకోండి దీపక్‌ షెనాయ్‌   ‘ఆర్థిక మంత్రి ప్రకటించిన ఆర్థిక చర్యలలో పెద్ద ఆర్థిక ఉద్దీపనలు లేవు. కానీ ఇలాంటి చర్యలు, ప్రభుత్వం మనల్ని పట్టించుకుంటోంది అనే పాజిటివ్‌ సెంటిమెంట్‌ పెరగడానికి ఉపయోగపడతాయి’ అని క్యాపిటల్‌ మైండ్ వ్యవస్థాపకుడు దీపక్ షెనాయ్ ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే... ఉద్దీపనలు లేవు... గత వారం ఆర్థిక మంత్రి ప్రకటించిన ఆర్థిక చర్యలు..ఆర్థిక

టాటా మోటర్స్‌ ర్యాలీ

Tuesday 27th August 2019

అటోరంగ షేర్లు ర్యాలీలో టాటామోటర్స్‌ షేర్లు మంగళవారం భారీగా లాభపడ్డాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.112.30ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. దేశీయంగా చిన్నాభిన్నమైన అటో పరిశ్రమను గాడిన పెట్టేందుకు శుక్రవారం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ పలు ఉద్దీపనలు ప్రకటించారు. అందులో భాగంగా వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజు వాయిదా వేయడం, ప్రభుత్వ విభాగాలు పెట్రోలు, డిజిల్‌ వాహనాలు కొనుగోలు చేయకుంగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం లాంటి పలు ఉద్దీపన

Most from this category