News


ఆటో స్టాకులను ఏం చేద్దాం?

Wednesday 31st July 2019
Markets_main1564569694.png-27450

ఏడాదిలో భారీగా పతనమైన పలు షేర్లు
అమ్మకాల్లో క్షీణతే అసలు కారణం
ఏడాది కాలంగా దేశీయ ఆటో రంగాల షేర్లు భారీగా పతనమవుతూ వస్తున్నాయి. లిక్విడిటీ కొరత కారణంగా అమ్మకాలపై నెగిటివ్‌ ప్రభావం పడడం ఆటో షేర్లను కుంగదీస్తోంది. దీనికితోడు నియంత్రణా పరమైన నిబంధనల మార్పులు, రిజిస్ట్రేషన్‌ ధరల పెరుగుదల, మందగమనంలాంటివి ఆటో కంపెనీలను ఇబ్బందిపెడుతున్నాయి. దీంతో ఏడాదిలో మొత్తం 16 ఆటో, ఆటో అనుబంధ రంగాల కంపెనీల షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. 2017 డిసెంబర్‌తో పోలిస్తే చాలా ఆటో కంపెనీల షేర్లు దాదాపు 30 శాతం మేర పతనమయ్యాయి. దీంతో రంగాలవారీ 19 సూచీల్లో ఆటో సూచీ ఈ ఏడాది అత్యంత అధ్వాన్న ప్రదర్శన చూపింది. వినిమయంలో తరుగుదల, నగదు లభ్యత తగ్గడం వంటివి ఆటో ఉత్పత్తుల విక్రయాలపై నెగిటివ్‌ ప్రభావం చూపింది. దీంతో పలు కంపెనీల వద్ద ఇన్వెంటరీ ఎక్కువైంది. అంతకుముందేడాది ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్దిచెందుతున్న ఆటో మార్కెట్‌గా పేరొందిన ఇండియా ఆటో రంగం 2018 కాలానికి కుదేలైంది. సెన్సెక్స్‌లో మారుతీ, హీరోమోటో, ఎంఅండ్‌ఎం లాంటి దిగ్గజాలు ఈ ఏడాది అత్యంత నష్టపూరిత స్టాకులుగా నిలవడం విశేషం. దేశ జీడీపీలో ఆటో రంగం వాటా 7 శాతం కాగా ఉత్పత్తి జీడీపీలో వాటా 49 శాతం. ఈ రంగంలో కుంగుదల మొత్తం ఎకానమీపై కనిపిస్తుందని అంతర్జాతీయ బ్రోకరేజ్‌లు హెచ్చరిస్తున్నాయి. ఆటో రంగంలో కుంగుదల దాదాపు 80 లక్షల మంది ఉపాధి అవకాశాలను దెబ్బతీయగలదని చెబుతున్నాయి.

ఏడాదిలో ఆటో రంగ షేర్ల ప్రదర్శన వివరాలు...


డైలమాలో ఇన్వెస్టరు
దేశీయ ఆటో రంగానికి చెందిన పలు కంపెనీల వాల్యూషన్లు ప్రస్తుతం ఆకర్షణీయంగా మారాయి. అందువల్ల చాలామంది లాంగ్‌టర్మ్‌కు వీటిపై ఆసక్తి చూపుతున్నారు. ఇటీవలి కుంగుబాటు అనంతరం రికవరీ రావాలంటే సమయం పడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. జీడీపీతో పోలిస్తే ఆటో రంగ వృద్ధి చాలా తక్కువగా ఉందని, ఇందుకు విక్రయాల్లో రెండంకెల తరుగుదలే కారణమని వివరిస్తున్నారు. చాలా ఆటో స్టాకులు ప్రస్తుతం తమ 200 రోజుల డీఎంఏకు దిగువన ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆటో రంగంలో కొంత మెరుగుదల కనిపించేవరకు వీటికి దూరంగా ఉండడమే మంచిదని ఎక్కువమంది నిపుణుల సూచన. ఆటో షేర్లలో కుంగుదలకు కీలకమైన ఫండమెంటల్స్‌ కారణమని, అందువల్ల ఇవి తిరిగి సరయ్యేవరకు వేచిచూడాలని సలహా ఇస్తున్నారు. ఇప్పుడు వీటి వాల్యూషన్లు బాగా దిగివచ్చినా వెనువెంటనే రికవరీ ఉండదని, ఆటో విక్రయాల్లో సైతం ఊహించినంత వేగమైన రికవరీ రాదని విశ్లేషిస్తున్నారు. అందువల్ల కొంత పాజిటివ్‌ సంకేతాలు కనిపించేవరకు వేచిచూడడమే ఉత్తమమని చెప్పారు.  ప్రస్తుతం నొమురా, సీఎల్‌ఎస్‌ఏ తదితర దిగ్గజాలు ఆటో స్టాకులకు అమ్మొచ్చు రేటింగ్‌ మెయిన్‌టెయిన్‌ చేస్తూ ఆటో రంగాన్ని అండర్‌వెయిట్‌గా చూస్తున్నాయి. You may be interested

దుమ్ములేపిన మైక్రోసాఫ్ట్, ఆపిల్, ఫేస్‌బుక్ షేర్లు

Wednesday 31st July 2019

యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ భయాలు ఈ ఏడాది మే లో పెరగడంతో అప్పుడు యుఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 500 ఇండెక్స్‌ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఆ తర్వాత యుఎస్‌ ఫెడరల్‌ బ్యాంక్‌ ఆర్థిక వ్యవస్థ పుంజుకోడానికి వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాల నేపథ్యంలో ఈ ఇండెక్స్‌ బాగా రాణించింది. ఇప్పుడీ ఇండెక్స్‌ 3,000 స్థాయికి పైన కొత్త రికార్డులను సృష్ఠిస్తోంది. ఎస్‌ అండ్‌ పీ 500 ఇండెక్స్‌ ఈ ఏడాదిలో

11,100 పైన నిఫ్టీ ముగింపు

Wednesday 31st July 2019

మెటల్‌, ఫార్మా, అటో రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు రెండురోజుల వరుస నష్టాలకు విరామం లభించింది. నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 11,100 పైన 11,113.80  వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 83.88 పాయింట్లు పెరిగి 37,481.12 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాలతో నేడు మార్కెట్‌ నష్టంతో మొదలైంది. ఒకదశంలో అమ్మకాలు తీవ్రతరం కావడంతో నిఫ్టీ 86 పాయింట్లు నష్టపోయి 10,999 స్థాయికి పతనమైంది.

Most from this category