News


జీఎస్టీ రేట్ల తగ్గింపు అంచనాలతో జోరుగా అటోషేర్ల ర్యాలీ

Wednesday 11th September 2019
Markets_main1568195553.png-28309

మందగమనంలో ఉన్న అటోరంగానికి ఊతమిచ్చేందుకు అటోరంగంపై జీఎస్టీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలతో అటో షేర్లు జోరుగా ర్యాలీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఎన్‌ఎస్‌ఈలో అటోరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ ఇంట్రాడేలో 3.50శాతానికి పైగా ర్యాలీ చేసింది. ఈ సెప్టెంబర్‌ 20తేదిన కేంద్రం జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించనుంది. తీవ్ర సంక్షోభంలో కొట్టిమిట్టాడుతున్న అటో రంగాన్ని ఆదుకునే దిశగా కేంద్రం అటో రంగంపై విధించిన 28శాతం జీఎస్టీని 18శాతానికి తగ్గించవచ్చనే అంచనా నెలకొన్నాయి. ప్రస్తుతం అటోపరిశ్రమను అదుకోనే దిశగా త్వరలోనే వెహికల్ స్క్రాపేజ్ పాలసీని తీసుకురావాలనే యోచనతో పాటు హైబ్రీడ్ వాహనాలపై జీఎస్టీని తగ్గించాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోందని గడ్కరీ ప్రకటనతో నేడు షేర్లకు కొనుగోళ్ల డిమాండ్‌ పెరిగింది. అంతర్జాతీయంగా కూడా అటో రంగ షేర్ల లాభాల ర్యాలీని అందిపుచ్చున్నాయి. ఫలితంగా ఇంట్రాడే నిఫ్టీ అటో ఇండెక్స్‌ దాదాపు 4శాతం ర్యాలీ చేసి 7442.20 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం గం.3:10లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు (7,165.35)తో పోలిస్తే 3.83శాతం లాభంతో 7,439.65 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇండెక్స్‌లో అన్ని షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా టాటామోటర్స్‌ షేర్లు 11శాతం పెరిగింది. ఐషర్‌మోటర్స్‌ షేర్లు 5శాతం, మారుతి, మదర్‌సుమి షేర్లు 4.50శాతం, టీవీఎస్‌మోటర్స్‌ 4శాతం, బజాజ్‌ అటో షేర్లు 3.50శాతం, భారత్‌ ఫోర్జ్స్‌, అమరరాజా బ్యాటరీస్‌, హీరోమోటోకార్ప్‌, ఎంఅండ్‌ఎం షేర్లు 3శాతం పెరిగాయి. ఎంఆర్‌ఎఫ్‌ షేర్లు 2శాతం, అపోలో టైర్స్‌ 1.50శాతం, అశోక్‌లేలాండ్స్, భాష్‌ లిమిటెడ్‌, ఎక్సైడ్‌ షేర్లు 1శాతం లాభపడ్డాయి. ఇండెక్స్‌లోని టాటామోటర్స్‌, మారుతి, ఎస్కార్ట్స్‌, బజాజ్‌ అటో, హీరోమోటోకార్ప్‌, ఎంఆర్‌ఎఫ్‌ షేర్లు నెలరోజుల గరిష్టస్థాయి వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

బీటా ర్యాలీతో బాగుపడేవి ఇవే!

Wednesday 11th September 2019

అంతర్జాతీయంగా ఈక్విటీలకు సానుకూలతలు కనిపిస్తున్నాయని, అందువల్ల దేశీయ మార్కెట్లో కూడా షార్ట్‌టర్మ్‌లో బీటా ర్యాలీ వస్తుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. ర్యాలీ అంచనాల నేపథ్యంలో హైబీటా ఉండి, వడ్డీరేట్ల ప్రభావితమయ్యే స్టాకులు మంచి దూకుడు చూపుతాయని పేర్కొంది. అలాంటి ఏడు స్టాకులను సూచించింది. అవి... ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, బీపీసీఎల్‌, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, ఎల్‌అండ్‌టీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌. (బీటా అనేది స్టాక్‌ ఒడిదుడుకులను మార్కెట్‌ సాపేక్ష దృష్టితో లెక్కించే సాధనం.

మరో రెండేళ్లలో 2000డాలర్ల స్థాయికి పసిడి: సిటిగ్రూప్‌

Wednesday 11th September 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర మరో రెండేళ్లలో 2,000డాలర్ల స్థాయికి చేరుకుంటుందని సిటిగ్రూప్‌ అంచనా వేస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక మంద్య భయాలు, కీలక వడ్డీరేట్లపై ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు నామమాత్రపు (సున్నా) వైఖరికి ఇష్టపడుతుండటం లాంటి అంశాలు పసిడి ర్యాలీకి తోడ్పాటునిస్తాయని సిటి బ్యాంక్‌ అభిప్రాయపడింది.స్పాట్‌ గోల్డ్‌ దీర్ఘకాలం పాటు స్థిరమైన ర్యాలీని కొనసాగిస్తూ 2000డాలర్ల స్థాయి అధిగమించే అవకాశం ఉంది. వచ్చే ఒకటి, రెండేళ్లలో ఏదో పాయింట్‌ వద్ద కొత్త

Most from this category