News


అమ్మకాల క్షీణతతో ఆటో షేర్ల రివర్స్‌ గేర్‌..!

Tuesday 3rd September 2019
Markets_main1567485473.png-28158

అగస్ట్‌లో వాహనరంగ అమ్మకాలు భారీగా పడిపోవడంతో అటోరంగ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. క్రితం నెలలో అమ్మకాలు భారీగా తగ్గుముఖం పట్టడం, పలు బ్రోకరేజ్‌ సంస్థలు అటోరంగ షేర్లపై రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడం ఇందుకు కారణమయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో అటోరంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌ ప్రారంభంలోనే దాదాపు 2శాతం నష్టపోయింది. శనివారం పలు అటోరంగ కంపెనీలు ఆగస్ట్ మాసపు అమ్మకాలు గణాంకాలను వెల్లడించాయి. అధిక బీమా, ద్రవ్యలభ్యత కొరత, వడ్డీ వ్యయం పెరగడం, బీఎస్‌-6 ఉద్గార నిబంధనలు అమలు, రిజిస్ట్రేషన్‌ ఫీజులు పెరగడం తదితర ప్రతికూల అంశాల నేపథ్యంలో వాహన అమ్మకాలు ఆగస్ట్‌లో రెండెకల క్షీణతను నమోదుచేశాయి. ఫలితంగా పలు బ్రోకరేజ్‌ సంస్థలు ఆయా కంపెనీల షేర్లపై రేటింగ్‌ రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ చేయడంతో పాటు టార్గెట్‌కు ధరను తగ్గించాయి. ఈ నేపథ్యంలో నేడు అటో రంగ షేర్ల తీవ్రంగా నష్టపోతున్నాయి. టాటామోటర్స్‌ 3శాతం క్షీణించింది. అమరరాజా బ్యాటరీస్‌, భాష్‌ లిమిటెడ్‌, ఐషర్‌ మోటర్స్‌ షేర్లు 2శాతం నష్టపోయాయి. ఎంఅండ్‌ఎం, అశోక్‌ లేలాండ్‌ షేర్లు 1శాతం పతమయ్యాయి. మారుతి, ఎంఆర్‌ఎఫ్‌, ఎక్సై‍డ్‌ లిమిటెడ్‌, భారతీ ఫోర్జ్‌ షేర్లు అరశాతం క్షీణించాయి. మరోవైపు ఇదేరంగానికి చెందిన హీరోమోటోకార్ప్‌ షేర్లు 1.50శాతం పెరిగాయి. అపోలోటైర్స్‌, టీవీఎస్‌ మోటర్స్‌, బజాజ్‌ అటో షేర్లు స్వల్పంగా అరశాతం లాభపడ్డాయి. 



You may be interested

తగ్గిన దక్షిణ కొరియా వృద్ధి..నష్టాల్లో చమురు

Tuesday 3rd September 2019

యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌లో భాగంగా ఇరు దేశాలు విధించుకున్న తాజా సుంకాల సెప్టెంబర్‌ 1 నుంచి అమలులోకి రావడంతో ట్రేడ్‌ వార్‌ భయాలు పెరిగాయి. అంతేకాకుండా ఎగుమతులు తగ్గడంతో దక్షిణ కొరియా రెండవ త్రైమాసికపు వృద్ధి మందగించించింది. ఫలితంగా మంగళవారం ట్రేడింగ్‌లో చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 7 సెంట్లు తగ్గి బారెల్‌ 58.59 డాలర్లకు, డబ్యూటీఐ క్రూడ్‌ 32 సెంట్లు తగ్గి బారెల్‌ 54.78 డాలర్లకు పడిపోయాయి.  చైనా

టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ కొత్త రికార్డులు

Tuesday 3rd September 2019

ఆర్థిక సంవత్సరం 2020 మొదటి త్రైమాసికానికి సంబంధించి దేశ జీడీపీ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోవడంతో మంగళవారం ట్రేడింగ్‌లో రూపీ డాలర్‌ మారకంలో 72 దిగువకు క్షీణించింది. రూపీ క్షీణించడంతో ఐటీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. దిగ్గజ ఐటీ కంపెనీలు టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌లు వాటి జీవితకాల రికార్డుస్థాయల్ని తాకడంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ ఉదయం 9.41 సమయానికి 0.66 శాతం లాభపడి 16,115.55 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. టీసీఎస్‌ గత

Most from this category