News


అటో షేర్ల పరుగులు

Thursday 9th January 2020
Markets_main1578566463.png-30807

మార్కెట్లో గురువారం జరిగిన బుల్‌ రన్‌లో అటో షేర్లు లాభాల పరుగులు పెట్టాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో అటో షేర్లకు ప్రాతినిథ్యం వహించే అటో ఇండెక్స్‌ 2.68శాతం లాభపడింది. నేడు ఈ ఇండెక్స్‌ మునుపటి ముగింపు(7,942.75)తో పోలిస్తే 93 పాయింట్లు లాభంతో 8,035.45 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి అటో షేర్లకు గిరాకి నెలకొనడంతో ఇండెక్స్‌ ఒక దశలో 2.80శాతం లాభంతో 8165.90 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఇండెక్స్‌లో అత్యధికంగా టాటా మోటర్స్‌ షేరు 5.50శాతం లాభపడింది. భారత్‌ ఫోర్జ్‌ 4శాతం, టీవీఎస్‌ మోటర్స్‌, ఎక్సైడ్‌, ఎంఆర్‌ఎఫ్ షేర్లు 3శాతం లాభపడ్డాయి. భాష్‌ లిమిటెడ్‌, అశోక్‌ లేలాండ్‌, అమరరాజా బ్యాటరీస్‌, ఐషర్‌ మోటర్స్‌, అపోలో టైర్స్‌, హీరోమోటర్స్‌, మదర్‌ సుమీ బజాజ్‌ అటో షేర్లు 2శాతం నుంచి 1శాతం వరకు పెరిగాయి. అక్టోబర్‌ 29 నుంచి ఒకరోజులో ఆటో ఇండెక్స్‌ ఇంతస్థాయిలో లాభపడటం ఇదే తొలిసారి. మార్కెట్‌ ముగిసే సరికి 2.70శాతం లాభంతో 8,155.25 వద్ద స్థిరపడింది. 



You may be interested

రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు పెద్ద ఉపశమనం

Friday 10th January 2020

అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీకి పెద్ద ఉపశమనం లభించింది. ఢిల్లీ-ఆగ్రా టోల్‌ రోడ్డు ప్రాజెక్టును సింగపూర్‌కు చెందిన క్యూబ్‌ హైవేస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు విక్రయించేందుకు ఈ కంపెనీ గతంలోనే అవగాహనకు రాగా.. ఎట్టకేలకు దీనికి నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కంపెనీ సైతం ధ్రువీకరించింది. ‘సామరస్య పూర్వక ప్రత్యామ్నాయం’ కింద ఎన్‌హెచ్‌ఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ,

సెన్సెక్స్‌.. హైజంప్‌...635 పాయింట్లు అప్‌

Thursday 9th January 2020

నిఫ్టీ లాభాల డబుల్‌ సెంచరీ రియల్టీ, ఆటో, బ్యాంక్‌ నిఫ్టీ జూమ్‌ ఐటీ ఇండెక్స్‌ వెనకడుగు చిన్న షేర్లకు భారీ డిమాండ్‌ గత గురువారం తలెత్తిన ఉద్రిక్త వాతావరణం ఈ గురువారానికల్లా తేలిపోవడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లకు ఒక్కసారిగా హుషారొచ్చింది. అటు అమెరికా.. ఇటు ఇరాన్‌ ప్రత్యక్ష దాడులకు దిగబోమంటూ సంకేతాలు ఇవ్వడంతో ఒక్కసారిగా సెంటిమెంటు బలపడింది. ఫలితంగా ముడిచమురు, బంగారం ధరలు దిగివచ్చాయి. దీంతో రూపాయి జోరందుకుంది. ఈ అన్ని అంశాలూ దేశీయంగా ఇన్వెస్టర్లకు

Most from this category