News


నష్టాల బాటలో అటో షేర్లు

Wednesday 8th January 2020
Markets_main1578464250.png-30761

మార్కెట్‌ పతనంలో అటోరంగ షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో అటోరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ 7,921.65 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇండెక్స్ అటో రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా ఒకదశలో ఇండెక్స్‌ 1.25శాతం నష్టపోయి 7,900.80 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:15ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(8,002.50)తో పోలిస్తే 1.04శాతం నష్టంతో 7,919.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో ప్రధాన షేర్లైన ఐషర్‌ మోటర్స్‌ షేరు 3శాతం, అశోక్‌ లేలాండ్‌ 2.50శాతం, టాటా మోటర్స్‌ 2శాతం నష్టపోయాయి. టీవీఎస్‌ మోటర్స్‌, ఎంఅండ్‌ఎం, భాష్‌ లిమటెడ్‌ షేర్లు 1.50శాతం క్షీణించాయి. ఎంఆర్‌ఎఫ్‌, అపోలో టైర్స్‌, మారుతి షేర్లు 1శాతం నష్టపోయాయి. భారత్‌ ఫోర్జ్‌, అమరరాజా బ్యాటరీస్‌ షేర్లు అరశాతం పతనమయ్యాయి. మదర్‌ సుమీ, బజాజ్‌ అటో షేర్లు ఎలాంటి లాభ, నష్టాలను చవిచూడకుండా స్థిరంగా ట్రేడ్‌ అవుతున్నాయి.


ఇక ప్రధాన ఇండెక్స్‌లైన సెన్సెక్స్‌ 283 పాయింట్లు నష్టపోయి 40,585.72 వద్ద, నిఫ్టీ 91.45 పాయింట్లు క్షీణించి 11,961.50 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. 
 You may be interested

క్రూడ్‌ కారణంగా పతనమయ్యే షేర్లు కొంటున్నాం...

Wednesday 8th January 2020

దేవాంగ్‌ మెహతా క్రూడాయిల్‌ ధరతో పతనమయ్యే ఎంఎన్‌సీ ఫార్మా, కన్జూమర్‌ కంపెనీల షేర్లలో నాణ్యమైన వాటిని తాము కొంటున్నామని, పోర్టుఫోలియోలో వీటి వాటా పెంచుకుంటున్నామని సెంట్రమ్‌ వెల్త్‌ సలహాదారు దేవాంగ్‌ మెహతా చెప్పారు. వీటితో పాటు బిల్డింగ్‌ మెటీరియల్స్‌, పెయింట్స్‌, ఎలక్ట్రిక్‌ గూడ్స్‌ కంపెనీల షేర్లను కూడా పెంచుకుంటున్నామన్నారు. ఈ కంపెనీలన్నింటికీ ప్రైసింగ్‌ పవర్‌ ఉందని, స్వల్పకాలిక ఉద్రిక్తతలతో తలెత్తిన నెగిటివిటీ వల్ల ఇవి పతనమవుతున్నాయని వివరించారు. అందుకే వీటిని కొని

టీసీఎస్‌ లాభాల్లో- ఇన్ఫీ నేలచూపు

Wednesday 8th January 2020

రుపీ ఎఫెక్ట్‌? లాభాల్లో ఎన్‌ఐఐటీ టెక్‌, టీసీఎస్‌ ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌, టాటా ఎలక్సీ డీలా అమెరికా, ఇరాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ముడిచమురు, బంగారం ధరలు జోరందుకున్నాయి. దీంతో దేశీ కరెన్సీ మరోసారి డీలా పడింది. డాలరుతో మారకంలో 72 మార్క్‌ను తాకింది. ఫలితంగా మార్కెట్లు బలహీనపడ్డాయి. అయితే తొలుత ఎన్‌ఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్‌ అమ్మకాలకు ఎదురీదుతూ లాభపడింది. తదుపరి కొంత బలహీనపడింది. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం టీసీఎస్‌, మిడ్‌

Most from this category