News


టాటా మోటర్స్‌ జోరు: లాభాల బాటలో అటో షేర్లు

Monday 14th October 2019
Markets_main1571037009.png-28870

టాటా మోటర్స్‌ షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో లాభాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో నేటి ఉదయం సెషన్‌లో 6శాతానికి పైగా ర్యాలీ చేశాయి. నేడు  ఈ కంపెనీ షేర్లు రూ.122.60 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. టాటా మోటార్స్‌కు చెందిన అతిపెద్ద అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ కు చైనాతో పాటు అమెరికాలోనూ మంచి మార్కెట్ ఉంది. ఇటీవల ఇరుదేశాల మధ్య కుదిరిన వాణిజ్య సంధితో రెండు దేశాల్లో జేఎల్‌ఆర్‌ అమ్మకాలు మరింత పెరగవచ్చనే ఆశాభావంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఈ షేర్ల కొనుగోళ్లకు మొగ్గచూపుతున్నారు. ఇటీవల చైనాలో జేఎల్‌ఆర్‌ అమ్మకాల్లో స్థిరమైన రికవరి, కంపెనీ వ్యయ నియంత్రణ కార్యక్రమాలపై దృష్టి సారించడంతో పాటు ఇండియాలో వాణిజ్య వాహనాల వ్యాపారం డౌన్‌సైకిల్‌లో ఈ కంపెనీ షేర్లు అత్యుత్తమ ఆదాయాలను ఆర్జించవచ్చనే అంచనాలు షేర్ల ర్యాలీకి తోడ్పాటునందిచాయని విశ్లేషకులంటున్నారు. ఫలితంగా ఈ షేర్లు 6.34శాతం వరకు పెరిగి రూ.129.00లు వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. ఉదయం గం.11:45ని.లకు షేర్లు క్రితం ముగింపు(రూ.121.30)తో పోలిస్తే 5.77శాతం లాభంతో రూ.128.30 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. కాగా షేర్లు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.106.00లు, రూ.239.35లుగా నమోదయ్యాయి. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ-50 సూచీలో టాప్‌-5 గెయినర్లలో మొదటి స్థానంలో ట్రేడ్‌ అవుతోంది.
నిఫ్టీ అటో ఇండెక్స్‌ 1.25శాతం ర్యాలీ:- 
లాభాల మార్కెట్లో అటో షేర్లు రాణిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ 1.25శాతం లాభపడింది. ఇండెక్స్‌లో ప్రధాన షేర్లైన టాటామోటర్స్‌ 6శాతం, మదర్‌ సుమీ, భారత్‌ ఫోర్జ్‌, అపోలో టైర్స్‌ షేర్లు 3శాతం నుంచి 4శాతం పెరిగాయి. బజాజ్‌ అటో, ఎంఅండ్‌ఎం, ఎంఆర్‌ఎఫ్‌, భాష్‌ షేర్లు 3శాతం నుంచి 2శాతం ర్యాలీ చేశాయి. ఐషర్‌ మోటర్స్‌, అమర రాజా బ్యాటరీస్‌, మారుతి, టీవీఎస్‌ షేర్లు 1శాతం నుంచి అరశాతం లాభపడ్డాయి. అయితే అశోక్‌ లేలాండ్‌ షేర్లు మాత్రం 2శాతం నష్టంతో ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

ఐఆర్‌సీటీసీ బంపర్‌ లిస్టింగ్‌: ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి..?

Monday 14th October 2019

ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) బంపర్‌ లిస్టింగ్‌ సాధించింది. ఇష్యూ ధర రూ. 320కాగా లిస్టింగ్‌ 101.25 శాతం ప్రీమియంతో రూ. 644వద్ద జరిగింది.  ఇంట్రాడేలో మరింత దూసుకెళ్లి (132 శాతం) రూ.743.80 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. దీంతోఐఆర్‌సీటీసీ సంస్థ మార్కెట్ విలువ రూ. 5 వేల కోట్ల నుంచి రూ. 10,972 కోట్లకు చేరుకుంది. ఐపీఓ చివరి నాటికి ఏకంగా

పాజిటివ్‌గా రియల్టీ..డీఎల్‌ఎఫ్‌ 6% ర్యాలీ!

Monday 14th October 2019

 దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు పాజిటివ్‌గా ట్రేడవుతుండడంతో పాటు, ఆర్‌బీఐ రేట్‌ను  బ్యాంకులు వినియోగదారులకు బదిలీ చేస్తుండడంతో సోమవారం రియల్టీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.  ఓక్‌ట్రీ క్యాపిటల్‌తో నాన్‌ బైండింగ్‌ టెర్మ్‌ షీట్‌ ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు, సిద్ధంగా ఉన్న 376 లక్సరీ ప్లాట్‌లను గురుగ్రామ్‌లోని తన హౌసింగ్‌ ప్రాజెక్టును ప్రారంభించిన మొదటి రోజునే డీఎల్‌ఎఫ్‌ రూ. 700 కోట్లకు విక్రయించడంతో సోమవారం ట్రేడింగ్‌లో ఈ కంపెనీ షేరువిలువ 6.52 శాతం

Most from this category