News


అటో షేర్ల ర్యాలీ

Monday 17th December 2018
Markets_main1545035862.png-23003

టాటా మోటార్స్‌ అండతో సోమవారం అటోరంగ షేర్లు హుషారుగా ర్యాలీ చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ 1శాతం ఎగిసింది. టాటామోటర్స్‌ బ్రిటన్‌ అనుబంధ సం‍స్థ జాగ్వర్‌ లాండ్‌ రోవర్‌ వ్యయనియంత్రణలో భాగంగా వచ్చే ఏడాదిలో వేలాది ఉద్యోగాల కోత విధిస్తన్నట్లు వార్తలువడటంతో టాటామోటర్స్‌ షేరు 6శాతం ర్యాలీ చేసింది. అలాగే టాటామోటర్స్‌ డీవీఆర్‌ 5శాతం లాభపడింది. అశోక్‌ లేలాండ్‌ 3శాతం, ఎంఆర్‌ఎఫ్‌, టీవీఎస్‌ మోటర్స్‌, మారుతీ సుజుకీ, ఎక్సైడ్‌ షేర్లు 2శాతం నుంచి 1శాతం పెరిగాయి. బజాజ్‌ అటో, మదర్‌ సుమీ, భారత్‌ ఫోర్జ్‌ షేర్లు అరశాతం ర్యాలీ చేశాయి. మరోవైపు హీరోమోటర్‌కార్ప్‌, అపోలోటైర్స్‌, ఎంఅండ్‌ఎం, భాష్‌ లిమిటెడ్‌, అమరరాజా బ్యాటరీస్‌ షేర్లు 1శాతం నుంచి అరశాతం వరకు నష్టపోయాయి. మధ్యాహ్నం 12:30లకు నిఫ్టీ అటో ఇండెక్స్‌ అరశాతం లాభంతో 9,319.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి టాటామోటర్స్‌ షేరు 5శాతం లాభంతో నిఫ్టీ -50 ఇండెక్స్‌లో టాప్‌ -5 గెయినర్లలో ప్రథమస్థానంలో ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ఆపరేషన్‌ క్లీన్‌ మనీ కేసులు.. విచారణ తీరు ఇదీ

Monday 17th December 2018

పెద్ద నోట్ల రద్దు సమయంలో బ్యాంకు ఖాతాల్లో నగదు డిపాజిట్‌ చేసిన వారి సమాచారాన్ని ఆదాయ పన్ను శాఖ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. 2016-17 ఆర్థిక సంవత్సరం నవంబర్‌ 8 నుంచి డిసెంబర్‌ 30 వరకు వివిధ బ్యాంకుల్లో నగదు డిపాజిట్‌ చేసినవారి సమాచారాన్ని ఆరా తీస్తోన్న ఆదాయపన్ను శాఖ.. రిటర్నులు వేసినవారందని పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా కోరుతోంది. 31-3-2017 నాటికి పేర్కొన్న ఆర్థిక సంవత్సరంలో జరిగిన లావాదేవీల వివరాలు, రిటర్నులు

ఉమ్మడి రుణం...ఉభయకుశలోపరి  

Monday 17th December 2018

సొంతింటిని సమకూర్చుకోవాలన్న కల ఎందరికో వుంటుంది. అయితే సొంతంగా ఇంటి కొనుగోలుకు సరిపడా డబ్బులను సమకూర్చుకోవడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఇప్పటికే గణనీయంగా పొదుపు చేసి ఉన్నవారు, వేరే ఆస్తులను విక్రయించడం ద్వారా సమకూర్చుకునే వారికి ఇది సాధ్యమే అయినా, మిగిలిన వారి ముందున్న ఉన్న ఏకైక మార్గం గృహ రుణమే. అందుకే నేడు విక్రయం అవుతున్న కొత్త ప్రాజెక్టుల్లో మూడింట రెండొంతులు గృహ రుణాలపైనే ఉంటున్నాయి. ఇందులో ఇద్దరు

Most from this category