News


ప్యాకేజీ అంచనాలు...ఆటో షేర్ల పరుగులు

Tuesday 20th August 2019
Markets_main1566291987.png-27897

ప్రభుత్వం రంగాల వారిగా ప్యాకేజిని ప్రకటించే అవకాశం ఉండడంతో మార్కెట్‌  మంగళవారం నష్టాల్లో ట్రేడవుతోంది. కాగా ఆటో సెక్టార్‌ మందగమనాన్ని అపడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే అంచనాల నేపథ్యంలో ఆటో ఇండెక్స్‌ పాజిటివ్‌గా ట్రేడవుతోంది. మధ్యాహ్నాం 2.21 సమయానికి 1.35 శాతం లాభపడి 7,053.10 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవివెయిట్‌ షేర్లయిన  ఎంఆర్‌ఎఫ్‌ 0.11 శాతం లాభపడి రూ. 57,502.00 వద్ద ట్రేడవుతుండగా, మారుతి సుజుకీ 3.11 శాతం పెరిగి రూ. 6,003.00 వద్ద ట్రేడవుతోంది. మిగిలిన షేర్లలో  హీరో మోటర్‌ కార్ప్‌ 1.54 శాతం, బజాజ్‌ ఆటో 0.91 శాతం, టాటా మోటర్స్‌ 2.28 శాతం, మహింద్రా అండ్‌ మహింద్రా (ఎం అండ్‌ ఎం) 2.24 శాతం, అపోలో టైర్స్‌ 1.16 శాతం, మదర్‌ సుమీ 0.61 శాతం, ఎక్సైడ్‌ ఇండియా 0.14 శాతం లాభపడి ట్రేడవుతున్నాయి. ఐషర్‌ మోటర్స్‌ 1.88 శాతం, భారత్‌ ఫోర్జ్‌ 0.84 శాతం, అశోక్‌ లేలాండ్‌ 0.70 శాతం, అమర్‌రాజా బ్యాటరీస్‌ 0.59 శాతం, టీవీఎస్‌ మోటర్స్‌ 0.32 శాతం, బోచ్‌ 0.27 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి.You may be interested

ఏడాది కనిష్టానికి నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌

Tuesday 20th August 2019

ఒడిదుడుకుల మార్కెట్‌లో భాగంగా ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు మంగళవారం భారీగా పతమమయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 3శాతం మేర నష్టపోయి ఏడాది కనిష్ట స్థాయిని తాకింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 4శాతం క్షీణించగా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూనియన్‌ బ్యాంక్‌ 3.50శాతం నష్టపోయాయి. ఓరియంటల్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ బ్యాంక్‌ 3శాతం నష్టపోయాయి. అలాగే కెనరా బ్యాంక్‌ 2.50శాతం,

క్యాపిటల్‌ ఎయిమ్‌ నుంచి టాప్‌ 3 సిఫార్సులు

Tuesday 20th August 2019

స్వల్పకాలానికి మూడు షేర్లపై క్యాపిటల్‌ ఎయిమ్‌ సంస్థ సిఫార్సులు ఇలా ఉన్నాయి... 1. టాటామోటర్స్‌: కాంట్రా బెట్‌గా కొనుగోలు చేయవచ్చు. నెల రోజుల్లో దాదాపు 30 శాతం పతనమైంది. క్యు1 పేలవ ఫలితాలు, డిమాండ్‌లో క్షీణత, అమ్మకాల్లో మందగమనం, రేటింగ్‌ డౌన్‌గ్రేడ్స్‌ తదితరాలు స్టాకుపై ప్రభావం చూపాయి. దీంతో స్వల్పకాలంలో భారీ పతనం చూసింది. ప్రస్తుతం స్టాకు ఓవర్‌సోల్డ్‌గా ఉంది. పలు ఇండికేటర్లు ఇంకా సెల్‌ సిగ్నల్సే ఇస్తున్నాయి. అందువల్ల మరికొంత

Most from this category