News


3 శాతం లాభపడిన హీరో..పాజిటివ్‌గా ‘ఆటో’

Wednesday 31st July 2019
Markets_main1564552157.png-27434

హీరోమోటర్‌ కార్ప్‌ క్యూ1 పలితాలలో మార్కెట్‌ అంచనాలను సునాయాసంగా అధిగమించింది. ఈ కంపెనీ క్యూ1లో రూ. 785 కోట్ల నికర లాభాలను ప్రకటిస్తుందని మార్కెట్లు​ అంచనా వేయగా గత ఏడాది ఇదే త్రైమాసిక నికర లాభం కన్నా  38 శాతం పెరిగి రూ. 1,257 కోట్లను నమోదుచేసింది. ఫలితంగా బుధవారం ఆటో షేర్లు పాజిటివ్‌లో ఉన్నాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ 0.78 శాతం లాభపడి 6,816.65 వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో భాగమైన హీరో మోటర్‌ కార్ప్‌ 3.80 శాతం లాభపడి రూ. 2,344.70 వద్ద ట్రేడవుతోంది. మిగిలిన స్టాకులలో టీవీఎస్‌ మోటర్స్‌ 3.27 శాతం, అమర్‌రాజా బ్యాటరీస్‌ 2.31 శాతం, మదర్‌ సుమీ 2.17 శాతం, అపోలో టైర్స్‌ 2.20 శాతం, బోచ్‌ లి. 1.41 శాతం, బజాజ్‌ ఆటో 1.36 శాతం, భారత్‌ ఫోర్జ్‌ 0.86 శాతం, ఐషర్‌ మోటర్స్‌ 0.84 శాతం, అశోక్‌ లేలాండ్‌ 0.80 శాతం, మారుతి 0.67 శాతం,  టాటా మోటర్స్‌ 0.26 శాతం, ఎక్సైడ్‌ ఇండియా 0.08 శాతం లాభపడి ట్రేడవుతుండగా, ఎంఆర్‌ఎఫ్‌ 1.24 శాతం, మహింద్రా అండ్‌ మహింద్రా (ఎం అండ్‌ ఎం) 0.50 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి.  



You may be interested

కార్పోరేట్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఆసక్తి..!

Wednesday 31st July 2019

ఆకర్షితులవుతున్న ఇన్వెస్టర్లు బ్యాంక్‌లు డిపాజిట్లపై వడ్డీ రేట్ల తగ్గింపే కారణం బ్యాంక్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ రేట్ల తగ్గింపు వలన కార్పోరేట్‌ ఫిక్సిడ్‌ డిపాజిట్ల వైపు స్థిర ఆదాయం కలిగిన ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత రెండేళ్ల నుంచి స్టాక్ మార్కెట్‌లలో పెట్టుబడులకు ప్రతికూల రాబడులే వస్తున్నాయని, అందుకే   చాలా మంది పెట్టుబడిదారులు స్థిర-రాబడి ఉత్పత్తులకు ఆకర్షితులవుతున్నారని మనీ హనీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సిఈఓ అనుప్ భయ్యా అన్నారు.  ‘మొదటిసారి

ఫెడ్‌ నిర్ణయం కొరకు పసిడి ఎదురుచూపులు

Wednesday 31st July 2019

కీలక వడ్డీరేట్లపై ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంకు నిర్ణయం కొరకు పసిడి ఎదురుచూపులు చూస్తోంది. డాలర్‌ ఇండెక్స్‌ 2నెలల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫలితంగా నేడు ఆసియా ట్రేడింగ్‌లో పసిడి స్థిరంగా కదులుతోంది. బుధవారం ఉదయం సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర అరడాలరు స్వల్ప లాభంతో 1,430.10 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫెడ్‌ సమావేశం కారణంగా పసిడి ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఇంతకాలం వేచిచూసారు. ఒకవేళ ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను

Most from this category