News


లాభాల బాటలో అటో షేర్లు

Monday 2nd March 2020
Markets_main1583131851.png-32213

కరోనా వైరస్‌ ప్రభావంతో ఫిబ్రవరిలో అటో అమ్మకాలు క్షీణించినప్పటికీ..., ఈ రంగానికి చెందిన షేర్లు మాత్రం సోమవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో లాభాల బాటపట్టాయి. మార్కెట్లో నెలకొన్న షార్ట్‌ కవరింగ్‌లో భాగంగా అటోరంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ సైతం వాహనరంగ షేర్లకు కొనుగోలు రేటింగ్‌ను సిఫార్సు చేయడం సెంటిమెంట్‌ను బలపరిచింది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో అటోరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 2శాతానికి పైగా లాభపడింది. ఉదయం గం.11:30ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(6,903.95)తో పోలిస్తే 1శాతం లాభంతో 6972 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇండెక్స్‌లో అత్యధికంగా అశోక్‌ లేలాండ్‌ షేరు 6శాతం పెరిగింది. భాష్‌ లిమిటెడ్‌ షేరు 5శాతం, ఐషర్‌మోటర్స్‌ 4.50శాతం, భారత్‌ ఫోర్జ్‌ 3శాతం, ఎంఅండ్‌ఎం షేరు 2శాతం, ఎంఆర్‌ఎఫ్‌, మారుతి, ఎక్సైడ్‌, టాటామోటర్స్‌, హీరోమోటర్స్‌ షేర్లు 1శాతం లాభపడ్డాయి. మరోవైపు ఇదే ఇండెక్స్‌లో బజాజ్‌ అటో 3.50శాతం నష్టపోయింది. మదర్‌ సుమీ 3శాతం, అపోలోటైర్స్‌ 2శాతం, అమరరాజా బ్యాటరీస్‌ షేరు 1శాతం నష్టాలను చవిచూశాయి. 

అటో అమ్మకాలు డీలా
పలు వాహన రంగ కంపెనీలు ఆదివారం ఫిబ్రవరి విక్రయ గణాంకాలను విడుదల చేశాయి. కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తితో చైనా నుంచి సప్లై తగ్గడంతో అమ్మకాలు తగ్గినట్లు వాహన కంపెనీలు తెలిపాయి. వార్షిక ప్రాతిపదికన మారుతి సుజుకీ అమ్మకాలు 1.60శాతం, టాటా మోటర్స్‌ అమ్మకాలు 34శాతం, హోండాకార్స్‌ అమ్మకాలు 46శాతం, మహీంద్రా అండ్‌ మహీంద్రా విక్రయాలు 42శాతం, హ్యుందాయ్‌ అమ్మకాలు 7.2శాతం క్షీణించనట్లు గణాంకాలు చెబుతున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం సమీపిస్తున్న తరుణంలో బీఎస్- VI ఉద్గార ప్రమాణాలకు మారడానికి సిద్దమతున్నాయి. బీఎస్‌-VI వాహనా ప్రమాణాలు కలిగిన వాహనాల కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపుతుండంతో డిమాండ్‌ తగ్గింది.  మరోవైపు కరోనా వైరస్‌ వ్యాప్తితో నెలకొన్న ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోనేందుకు ప్రతిఘటించేందుకు వాహనకంపెనీలు శాయశక్తుల ప్రయత్నాలు చేశాయి. 

మోతీలాల్‌ ఓస్వాల్‌ ‘‘బై’’ రేటింగ్‌ 
మారుతీ సుజుకి, మహీంద్రా & మహీంద్రా, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్ కంపెనీలు తమ ఫిబ్రవరి అమ్మక గణాంకాలను విడుదల చేసిన తర్వాత ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆయా కంపెనీల షేర్లకు ‘‘బై’’ రేటింగ్‌ను ఇచ్చింది. దేశీ ఆర్థిక వ్యవస్థ రికవరీ ఐనట్లైతే వాహన రంగం తిరిగి పుంజుకోవడం ప్రారంభం అవుతుందని బ్రోకరేజ్‌ సం‍స్థ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో బ్రోకరేజ్‌ సంస్థ పలు వాహన కంపెనీ షేర్ల టార్గెట్‌ ధరను పెంచింది. 

ఆయా కంపెనీల షేర్లపై మోతీలాల్‌ ఓస్వాల్‌ రేటింగ్‌
స్టాక్‌ పేరు టార్గెట్‌ ధర అప్‌సైడ్‌(శాతాల్లో)
 
మారుతీ సుజుకీ రూ.8000 27
ఎంఅండ్‌ఎం రూ.666 46
టాటామోటర్స్ రూ.228 77
ఐషర్‌ మోటర్స్‌ రూ.25,350 53

 



You may be interested

అనిశ్చితి మార్కెట్లో సిప్‌ పెట్టుబడులు మేలు!

Monday 2nd March 2020

మార్చి సిరీస్‌పై గ్లోబల్‌  మార్కెట్ల ప్రభావం 10,800పైన నిలదొక్కుకుంటే నిఫ్టీలో రికవరీ -ఉమేష్‌ మెహతా, శామ్‌కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ కరోనా వైరస్‌ సృష్టిస్తున్న విలయంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఆందోళనకు లోనవుతున్నారు. దీంతో దేశీయంగానూ గత వారం ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ 7 శాతం పతనమైంది. అయితే 10,850-10800 పాయింట్ల స్థాయిలో నిఫ్టీ నిలదొక్కుకుంటే రికవరీకి వీలుందంటున్నారు ఉమేష్‌ మెహతా. శామ్‌కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌.. మెహతా ఒక ఇంటర్వ్యూలో ఇంకా పలు

వేదాంత షేరు 2% అప్‌!

Monday 2nd March 2020

సోమవారం వేదాంత కంపెనీ షేరు 2 శాతం పెరిగింది. ఉదయం 11గంటల ప్రాంతంలో వేదాంత షేరు 2.41 శాతం పెరిగి 116.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీపీసీఎల్‌) మెజారిటీ వాటాను కొనేందుకు అందరికంటే ముందు ఆసక్తి కనబర్చిన వేదాంత కంపెనీ ప్రస్తుతం వెనకడుగు వేసింది. బీపీసీఎల్‌ కంపెనీ​విలువ చాలా ఎక్కువగా ఉందని, తుది బిడ్డింగ్‌ పత్రం వచ్చిన తర్వాత పరిశీలిస్తామని వేదాంత కంపెనీ అధినేత అనీల్‌

Most from this category