News


క్షీణించిన బజాజ్‌, అశోక్‌ లేలాండ్‌ అమ్మకాలు

Friday 1st November 2019
Markets_main1572601744.png-29288

9శాతం క్షీణించిన బజాజ్‌ అమ్మకాలు:-
వార్షిక ప్రాతిపదికన బజాజ్‌ అమ్మకాలు అక్టోబర్‌లో 9శాతం క్షీణించాయి. ఈ అక్టోబర్‌ నెలలో మొత్తం 4,63,208 వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో మొత్తం 5,06,699 వాహనాలు అమ్ముడైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ అక్టోబర్‌లో దేశీయ అమ్మకాలు 2.78లక్షలు నమోదు కాగా గతేడాది ఇదే అక్టోబర్‌లో నమోదైన మొత్తం 3.20లక్షల అమ్మకాలతో పోలిస్తే ఇది 13శాతం తక్కువ. మోటర్‌ సైకిల్‌ విభాగపు అమ్మకాలు సైతం 14శాతం క్షీణతను నమోదు చేశాయి. గతేడాది అక్టోబర్‌లో మొత్తం 2.81లక్షల వాహన విక్రయాలు జరగ్గా, ఈ అక్టోబర్‌లో 2.42లక్షల వాహనాల విక్రయం జరిగింది. వాణిజ్య విభాగపు అమ్మకాలు కూడా స్వల్పంగా తగ్గముఖం పట్టాయి. ఈ అక్టోబర్‌లో మొత్తం 36,260 వాహన విక్రయాలు జరగ్గా, గతేడాది ఇదే నెలలో 38,360 అమ్మకాలు జరిగాయి. ఎగుమతులు 1శాతం తగ్గాయి. గతేడాదిలో 1.87లక్షల వాహనాలు ఎగుమతి అవ్వగా, ఈ అ‍క్టోబర్‌లో 1.84లక్షలు వాహనాలు విదేశాలను ఎగుమతయ్యాయి.
35శాతం తగ్గిన అశోక్‌ లేలాండ్‌ అమ్మకాలు:- 
అశోక్‌ లేలాండ్‌ అమ్మకాలు అక్టోబర్‌లో 35శాతం తగ్గుముఖం పట్టాయి. ఈ అక్టోబర్‌ నెలలో కంపెనీ మొత్తం 9,857 వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో కంపెనీ 15,149 వాహనాలను విక్రయించింది. దేశీయంగా ఈ నెలలో మొత్తం 9,074 వాహనాలను అమ్మింది. గతేడాది ఇదే నెలలో విక్రయించిన 14,341 వాహనాలతో పోలిస్తే ఇది 37 శాతం తక్కువ. తేలికపాటి వాణిజ్య విక్రయాలు సైతం 15శాతం తగ్గుముఖం పట్టాయి. గతేడాది ఇదే నెలలో 5,279 వాహనాలను విక్రయించగా, ఈ నెలలో 4,509 యూనిట్లకు పరిమితమైంది.



You may be interested

పెరిగిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నికర లాభం

Friday 1st November 2019

   ఆర్థిక సంవత్సరం 2020 సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ. 266.4 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఈ త్రైమాసికంలో ప్రొవిజన్లు తగ్గడంతో పాటు, నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) పెరగడంతో  బ్యాంక్‌ నికర లాభం పెరిగింది. అంతేకాకుండా బ్యాంక్‌ ఇతర ఆదాయం, ప్రొవిజన్లకు ముందు ఆపరేటింగ్‌ లాభం పెరగడంతో కూడా బ్యాంక్‌ నికర లాభం పెరిగింది. కాగా గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ బ్యాంక్‌ రూ.

పెరిగిన మారుతి సుజుకీ అక్టోబర్‌ అమ్మకాలు

Friday 1st November 2019

మారుతి సుజుకీ అక్టోబర్‌ అమ్మకాలు మార్కెట్‌ అంచనాలకు తగ్గట్టుగానే అక్టోబర్‌లో అమ్మకాలు పెరిగాయి. పండుగ సీజన్‌ సందర్భంగా వాహన విక్రయాలు పెరగడంతో మెరుగైన అమ్మకాల గణాంకాలను నమోదు చేసినట్లు కంపెనీ తెలిపింది. వార్షిక ప్రాతిపాదికన అక్టోబర్‌లో మొత్తం అమ్మకాలు 4.5శాతం పెరిగాయి. ఈ అక్టోబర్‌లో మొత్తం 153435 వాహనాల విక్రయం జరగ్గా, గతేడాది ఇదే అక్టోబర్‌లో మొత్తం 1,46,766 వాహనాలు అమ్ముడయ్యాయి. దేశీయ అమ్మకాలు 1,44,277 యూనిట్లు నమోదు కాగా, కిందటేడాది

Most from this category