News


డిసెంబర్‌లో ఆటో అమ్మకాలు వీక్‌

Wednesday 1st January 2020
Markets_main1577864536.png-30586

మారుతీ వాహన విక్రయాలు 3.9 శాతం అప్‌
మహీంద్రా అండ్‌ మహీంద్రా అమ్మకాల వెనకడుగు

గడిచిన డిసెంబర్‌ నెలలో దేశీ ఆటో రంగ అమ్మకాలు అంతంతమాత్రంగానే నమోదయ్యాయి. కొత్త ఏడాది ప్రారంభంకానున్న నేపథ్యంలో కస్టమర్లు కొనుగోళ్లను వాయిదా వేసుకోవడం, వడ్డీ రేట్ల తగ్గుదలపై అంచనాలు వంటి అంశాలు ప్రధానంగా ప్రభావం చూపినట్లు ఆటో రంగ నిపుణులు పేర్కొంటున్నారు. డిసెంబర్‌లో వివిధ ఆటో దిగ్గజాల వాహన విక్రయ గణాంకాలు చూద్దాం..

మారుతీ సుజుకీ
కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ అమ్మకాలు డిసెంబర్‌లో 3.9 శాతం వృద్ధి చూపాయి. ఈ డిసెంబర్‌(2019)లో మారుతీ 133296 వాహనాలను విక్రయించింది. అంతక్రితం ఏడాది(2018) డిసెంబర్‌లో నమోదైన 128338 వాహనాలతో పోలిస్తే ఇది 3.9 శాతం అధికం. కాగా..కాంపాక్ట్‌ విభాగం 28 శాతం వృద్ధితో 65,673 యూనిట్లను తాకగా.. మినీ కార్ల అమ్మకాలు 13.6 శాతం నీరసించి 23,883 యూనిట్లకు పరిమితమయ్యాయి. సియాజ్‌ కార్ల అమ్మకాలు 62 శాతం పడిపోయి 1786 యూనిట్లను తాకగా.. వ్యాన్ల అమ్మకాలు సైతం 52 శాతం వెనకడుగుతో 7634 యూనిట్లకు చేరాయి. ఇక యుటిలిటీ వాహన అమ్మకాలు 17.7 శాతం పుంజుకుని 23808 యూనిట్లకు చేరాయి. ఎగుమతులు 10 శాతం ఎగసి 7561 యూనిట్లుగా నమోదయ్యాయి.

ఎంఅండ్‌ఎం
మహీంద్రా అండ్‌ మహీంద్రా(ఎంఅండ్‌ఎం) మొత్తం అమ్మకాలు 1 శాతం క్షీణించి 39,230 యూనిట్లకు పరిమితమయ్యాయి. వీటిలో ప్యాసింజర్‌ వాహనాలు 4 శాతం పుంజుకుని 15,691 యూనిట్లకు చేరగా.. యుటిలిటీ విభాగం అమ్మకాలు 10 శాతం అధికంగా 15225 యూనిట్లను తాకాయి. కార్లు, వ్యాన్లు 61 శాతం తక్కువగా 466 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అయితే ట్రాక్టర్ల విక్రయాలు 3 శాతం పెరిగి 17,990 యూనిట్లుగా నమోదయ్యాయి.  దేశీ అమ్మకాలు 1 శాతం పెరిగి 37,081 యూనిట్లుగా నమోదుకాగా.. ఎగుమతులు 30 శాతం క్షీణించి 2149 యూనిట్లకు పరిమితమయ్యాయి.

షేర్ల తీరిలా
డిసెంబర్‌(2019) వాహన విక్రయ గణాంకాలు వెలువడిన నేపథ్యంలో మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఎన్‌ఎస్‌ఈలో మారుతీ సుజుకీ షేరు 0.6 శాతం నీరసించి రూ. 7327 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 7410 వద్ద గరిష్టాన్నీ, రూ. 7282 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఇక ఎంఅండ్‌ఎం 0.7 శాతం పుంజుకుని రూ. 535 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ. 537-530 మధ్య ఊగిసలాడింది.



You may be interested

2020లో ఆభరణాలకు డిమాండ్‌ తగ్గుదల: ఇక్రా నివేదిక

Wednesday 1st January 2020

ఈ 2020 ఏడాదిలో అభరణాలకు డిమాండ్‌ 6 నుంచి 8శాతం తగ్గముఖం పట్టే అవకాశం ఉందని ఇక్రా నివేదిక తెలిపింది. పెరిగిన పసిడి ధరలతో పాటు బలహీన వినియోగ డిమాండ్‌లు ఇందుకు కారణవుతాయని ఇక్రా పేర్కోంది. నల్లధనాన్ని ప్రక్షాళన చేయడం, పరిశ్రమను లాంఛనప్రాయంగా మార్చడం, ఇతర అసెట్స్‌ క్లాస్‌తో పోలిస్తే ఆభరణాల్లో పెట్టుబడులు తక్కువ రాబడులను ఇవ్వడంతో భారత్‌లో గత ఐదేళ్లుగా ఆభరణాలకు ఉన్న డిమాండ్‌ ఆర్థిక సంవత్సరం 2019తో

మార్చి నాటికి నిఫ్టీ@ 12,800!

Wednesday 1st January 2020

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనా కొత్త ఏడాది తొలి త్రైమాసికం చివరకు నిఫ్టీ 12800 పాయింట్లను చేరుతుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. బీఎఫ్‌ఎస్‌ఐ, మెటల్స్‌, ఆయిల్‌, ఆటో, నెట్‌ ఆధారిత రంగాలకు చెందిన షేర్లు కొత్త ఏడాది మంచి ప్రదర్శన చూపవచ్చని అభిప్రాయపడింది. లార్జ్‌క్యాప్స్‌, మిడ్‌ మరియు స్మాల్‌క్యాప్స్‌ మధ్య ప్రదర్శనలో అంతరం కొనసాగుతుందని తెలిపింది. అయితే గతంతో పోలిస్తే ఈ అంతరం కొంత తగ్గవచ్చని పేర్కొంది. దేశీయ మార్కెట్లు రిటైల్‌,

Most from this category