News


లాభాల్లో ఆటో షేర్లు

Friday 9th August 2019
Markets_main1565340462.png-27666

ప్రభుత్వం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లను (ఎఫ్‌పీఐ) అధిక సర్‌చార్జి నుంచి మినహాయించడం, మూడేళ్లు దాటిన హొల్డింగ్స్‌పై దీర్ఘకాల మూలధన లాభాలపై(ఎల్‌టీసీజీ) విధించే ట్యాక్స్‌ ను తొలగించడం, డివిడెండ్‌ డిస్ట్రీబ్యూషన్‌ ట్యాక్స్‌ను(డీడీటీ) సులభతరం చేయడం వంటి మార్కెట్‌ ప్రెండ్లీ నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉండడంతో శుక్రవారం మార్కెట్లు పాజిటివ్‌గా కదులుతున్నాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ మధ్యాహ్నం 2.07 సమయానికి 1.60 శాతం లాభపడి 7,110.70 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో మదర్‌ సుమీ 5.13 శాతం, ఐషర్‌ మోటర్స్‌ 3.48 శాతం, అపోలో టైర్స్‌ 3.25 శాతం, మారుతి 3.03 శాతం, అశోక్‌ లేలాండ్‌ 1.42 శాతం, హీరో మోటర్‌ కార్ప్‌ 1.36 శాతం, టీవీఎస్‌ మోటర్స్‌ 1.21 శాతం, ఎంఆర్‌ఎఫ్‌ 1.30 శాతం, భారత్‌ ఫోర్జ్‌ 1.05 శాతం, ఎక్సైడ్‌ ఇండియా 1.00 శాతం, మహింద్రా అండ్‌ మహింద్రా (ఎం అండ్‌ ఎం) 0.80 శాతం, బజాజ్‌ ఆటో 0.29 శాతం లాభపడి ట్రేడవుతుండగా, టాటా మోటర్స్‌ 1.77 శాతం, అమర్‌రాజా బ్యాటరీస్‌ 1.71 శాతం, బోచ్‌ లి. 0.36 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి.  You may be interested

బేర్‌ గుప్పిట్లో చిన్నషేర్లు!

Friday 9th August 2019

స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ బేర్‌మార్కెట్లోకి ప్రవేశించాయని టెక్నికల్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధాన సూచీలు సైతం బేర్‌మార్కెట్లో ప్రవేశించడానికి దగ్గర్లో ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఏడాది గరిష్ఠస్థాయిల నుంచి బిఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ సూచీ ఇప్పటివరకు 39 శాతం పతనం కాగా, బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ సూచీ 20 శాతం క్షీణించింది. దీంతో టెక్నికల్‌గా ఈ రెండు సూచీలు బేర్‌మార్కెట్లోకి ప్రవేశించినట్లయింది. సెన్సెక్స్‌ తన ఏడాది గరిష్ఠం నుంచి ఇప్పటికి 9 శాతం క్షీణించింది. సాధారణంగా

ఏడాది గరిష్ఠానికి 9 స్టాకులు

Friday 9th August 2019

ఎన్‌ఎస్‌ఈలో సుమారుగా 9 స్టాకులు శుక్రవారం వాటి 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకాయి. అబోట్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, బెర్జర్‌ పెయింట్స్, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్, పిడిలైట్ ఇండస్ట్రీస్ షేర్లు వాటి ఏడాది గరిష్ఠాన్ని తాకిన షేర్లలో ఉన్నాయి.  నీఫ్టీ 50 ఇండెక్స్‌లో 35 షేర్లు లాభపడి ట్రేడవుతుండగా, 15 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, వేదాంత, యుపిఎల్ షేర్లు

Most from this category