News


లాభాల్లో ఆటో షేర్లు..టాటామోటర్స్‌ 5 శాతం అప్‌

Thursday 5th September 2019
Markets_main1567664091.png-28211

యుఎస్‌-చైనా మధ్య మరో రౌండ్‌ వాణిజ్య చర్చలు అక్టోబర్‌ నెల ప్రారంభంలో జరగనున్నాయని చైనా వాణిజ్య మంత్రి ప్రకటించడంతో గురువారం అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతేకాకుండా దేశియ బెంచ్‌మార్క్‌ సూచీలు పాజిటివ్‌గా ట్రేడవుతుండడంతో ఉదయం 11.34 సమయానికి నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ 1.68 శాతం లాభపడి 6,896.10 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవివెయిట్‌ షేర్లయిన  మారుతి సుజుకీ 1.43 శాతం లాభపడి రూ. 5,914.00 వద్ద, బోష్‌ లి. 1.46 శాతం లాభపడి రూ. 13,590.10 వద్ద,  ఐషర్‌ మోటర్స్‌ 0.39 శాతం లాభపడి రూ. 15,766.00 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ ఇండెక్స్‌లో ఇతర షేర్లయిన బజాజ్‌ ఆటో 1.32 శాతం, ఎంఆర్‌ఎఫ్‌ 0.57 శాతం, హీరో మోటర్‌ కార్ప్‌ 0.78 శాతం, టాటా మోటర్స్‌ 5.75 శాతం, భారత్‌ ఫోర్జ్‌ 3.47 శాతం, మహింద్రా అండ్‌ మహింద్రా (ఎం అండ్‌ ఎం) 1.94 శాతం, టీవీఎస్‌ మోటర్స్‌ 1.93 శాతం,  మదర్‌ సుమీ 1.89 శాతం,  ఎక్సైడ్‌ ఇండియా 1.82 శాతం, అశోక్‌ లేలాండ్‌ 0.48 శాతం, అమర్‌రాజా బ్యాటరీస్‌ 0.11 శాతం లాభపడి ట్రేడవుతుండగా, అపోలో టైర్స్‌ మాత్రం 0.85 శాతం నష్టపోయి ట్రేడవుతోంది.  



You may be interested

ఆల్‌టైం గరిష్ఠానికి ఇన్ఫోసిస్‌

Thursday 5th September 2019

యుఎస్‌-చైనా మధ్య మరో రౌండ్‌ వాణిజ్య చర్చలు అక్టోబర్‌ నెల ప్రారంభంలో ఉండడంతో గురువారం ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఫలితంగా దేశియ ఐటీ దిగ్గజమైన ఇన్ఫోసిస్‌ తన ఆల్‌ టైం గరిష్ఠాన్ని చేరుకుంది. ఉదయం 11.53 సమయానికి ఇన్ఫోసిస్‌ స్టాకు 1.53 శాతం లాభపడి రూ. 833.85  వద్ద ట్రేడవుతోంది. రూపీ డాలర్‌ మారకంలో భారీగా పడిపోవడంతో సెప్టెంబర్‌ 3 సెషన్‌లో తన 52 వారాల గరిష్ఠాన్ని

సెప్టెంబర్‌ సీరిస్‌లో 10800- 11200 రేంజ్‌లో నిఫ్టీ!

Thursday 5th September 2019

నిఫ్టీ సెప్టెంబర్‌ సీరిస్‌ మొత్తం 10800- 11200 పాయింట్ల శ్రేణిలోనే కదలాడవచ్చని టెక్నికల్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ శ్రేణిని ఛేదించడం జరిగితేనే నిఫ్టీలో తీవ్రకదలికలుంటాయని చెబుతున్నారు. ఉదాహరణకు దిగువన 10800 పాయింట్ల దిగువన వరుసగా రెండు రోజులు క్లోజయితే 10640- 10500 పాయింట్ల వరకు నిఫ్టీ దిగజారవచ్చని, ఒకవేళ 11200 పాయింట్లను దాటితే 11500- 11700 పాయింట్ల వరకు ఎగబాకవచ్చని తెలిపాపరు. ముఖ్యంగా 11150 పాయింట్లను దాటితే మంచి

Most from this category