నష్టాల్లో ఆటో షేర్లు
By Sakshi

ఈ వారం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సమీక్ష, అమెరికా-చైనా వాణిజ్య చర్చల పునర్‌ప్రారంభం వంటి కీలక అంశాల నేపథ్యంలో దేశియ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఉదయం 9.40 సమయానికి 2.62 శాతం నష్టపోయి 6,973.55 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో బజాజ్ ఆటో 4.93 శాతం, టీవీఎస్ మోటర్స్ 4.55 శాతం, హీరో మోటర్ కార్ప్ 3.62 శాతం, అశోక్ లేలాండ్ 3.57 శాతం, మారుతి 3.07 శాతం, మదర్ సుమీ 2.79 శాతం, టాటా మోటర్స్ 2.75 శాతం, అపోలో టైర్స్ 2.62 శాతం, ఐషర్ మోటర్స్ 2.52 శాతం, భారత్ ఫోర్జ్ 1.98 శాతం, ఎక్సైడ్ ఇండియా 1.81 శాతం, బోచ్ లి. 1.02 శాతం, ఎంఆర్ఎఫ్ 0.88 శాతం, మహింద్రా అండ్ మహింద్రా (ఎం అండ్ ఎం) 0.65 శాతం, అమర్‌రాజా బ్యాటరీస్ 0.09 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి.
You may be interested
ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 10శాతం క్రాష్
Monday 29th July 2019మనీలాండరింగ్ ఆరోపణలు తెరపైకి రావడంతో ఇండియాబుల్స్‌హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ షేర్లు సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 10శాతం పతనమయ్యాయి. ఇండియాబుల్స్ గ్రూప్ రూ.లక్ష కోట్ల మనీలాండరింగ్ మోసానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ ఆదివారం బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి ప్రధాన మంత్రి మోదీకి లేఖ రాశారు. కంపెనీ దాదాపు 100 షెల్ కంపెనీను సృష్టించి నేషనల్ హౌసింగ్ బ్యాంకు(ఎన్‌హెచ్‌బీ) నుంచి రుణాలను పొందినట్లు తెలిపారు. ఈ కుంభకోణంతో చాలామంది కాంగ్రెస్ నాయకులు హస్తం
68.94 వద్ద రూపీ ప్రారంభం
Monday 29th July 2019చమురు ధరలు తగ్గడంతో పాటు దేశియ ఈక్విటీ మార్కెట్లు సానుకూలంగా ఉండడంతో రూపీ డాలర్ మారకంలో సోమవారం 11 పైసలు బలపడి 68.94 వద్ద ప్రారంభమైంది. గత సెషన్లో రూపీ 15 పైసలు బలపడి 69.05 వద్ద ముగిసింది. ఉదయం 9.42 సమయానికి రూపీ డాలర్ మారకంలో 68.93 వద్ద ట్రేడవుతోంది.