STOCKS

News


నష్టాల్లో మారుతి, ఎం అండ్‌ ఎం షేర్లు

Tuesday 13th August 2019
Markets_main1565682582.png-27736

అంతర్జాతీయ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ట్రేడవుతుండడంతో దేశియ మార్కెట్లు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. మధ్యాహ్నం 1.09 సమయానికి భారత్‌ ఫోర్జ్‌ (5.25 శాతం), మహింద్రా అండ్‌ మహింద్రా (ఎం అండ్‌ ఎం)(4.79 శాతం), మారుతి(2.95 శాతం) షేర్లు నష్టపోయాయి. మొత్తంగా నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ 2.26 శాతం నష్టపోయి 6,976.10 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో ఇతర కంపెనీలయిన అమర్‌రాజా బ్యాటరీస్‌ 1.62 శాతం, బజాజ్‌ ఆటో 0.92 శాతం, టాటా మోటర్స్‌ 0.70 శాతం, హీరో మోటర్‌ కార్ప్‌ 0.62 శాతం లాభపడి ట్రేడవుతుండగా, మదర్‌ సుమీ 8.57 శాతం,  టీవీఎస్‌ మోటర్స్‌ 3.37 శాతం, ఐషర్‌ మోటర్స్‌ 2.94శాతం, అశోక్‌ లేలాండ్‌ 2.49 శాతం, బోచ్‌ లి. 1.51 శాతం, అపోలో టైర్స్‌ 1.20 శాతం, ఎంఆర్‌ఎఫ్‌ 0.69 శాతం, ఎక్సైడ్‌ ఇండియా 0.72 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి.  You may be interested

ఆగని యస్‌ బ్యాంక్‌ షేర్ల పతనం

Tuesday 13th August 2019

మరో 10శాతం క్షీణించిన షేర్లు  యస్‌బ్యాంక్‌ షేర్ల పతనం పతనం ఆగడం లేదు. మంగళవారం మరో 10శాతం నష్టపోయాయి. నేడు బీస్‌ఈలో రూ.84.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచి షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో షేర్లు ఒకదశలో 10.50శాతం నష్టపోయి రూ.73.40ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమయ్యాయి. ఈ స్థాయి షేర్లకు ఐదేళ్ల లేదా 6 ఏళ్ల కనిష్టస్థాయి ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయం. ఏదశలోనూ రివకవరి సాధించకపోవడంతో మిడ్‌సెషన్‌

జెట్‌ ఎయిర్‌వేస్‌ : లోయర్‌ సర్క్యూట్‌!

Tuesday 13th August 2019

రుణ సంక్షోభంలో కూరుపోయిన్‌ జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు మంగళవారం లోయర్‌ సర్క్యూట్‌ వద్ద ఫ్రీజ్‌ అయ్యాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ పునరుద్ధరణ కోసం ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) బిడ్‌ దాఖలు చేయడం లేదని వేదాంతా రిసోర్సెస్‌ వ్యవస్థాపకులు, ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ స్పష్టం చేయడం ఇందుకు కారణమైంది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ. 44.55 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ పునరుద్ధరణ కోసం వోల్కన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ద్వారా ఈఓఐ

Most from this category