News


కొనసాగుతున్న ఆటో షేర్ల పతనం

Monday 8th July 2019
Markets_main1562570413.png-26880

బడ్జెట్‌లో ఆటో రంగానికి అనుకున్నంత చేయూత లేకపోవడంతో పాటు ఆసియా మార్కెట్ల పతనం కారణంగా సోమవారం (జులై 8) ట్రేడింగ్‌లో నిఫ్టీ ఆటో సూచీ 2.15 శాతం లేదా 168.90 పాయింట్లు నష్టపోయి ఏడాది కనిష్ఠాన్ని తాకింది. ఉదయం 10.00 సమయంలో ఆటో ఇండెక్స్‌ సూచీ 7,680.20 పాయింట్ల వద్ద  ట్రేడవుతోంది.  హీరో మోటర్‌ కార్ప్‌ 4.09 శాతం, మారుతి 2.88 శాతం, అపోలో టైర్స్‌ 2.84 శాతం, మదర్‌ సుమీ 2.69 శాతం,  బజాజ్‌ ఆటో 2.59 శాతం, టీవీఎస్‌ మోటర్స్‌ 2.55 శాతం మేర నష్టపోయి ట్రేడవుతున్నాయి. వీటితో పాటు  అశోక్‌ లేలాండ్‌ 1.72 శాతం, టాటా మోటర్స్‌ 1.56 శాతం, ఎంఆర్‌ఎఫ్‌ 1.51 శాతం, బోచ్‌ లి.1.47 శాతం, ఎక్సైడ్‌ ఇండియా 1.43 శాతం, ఎం అండ్‌ ఎం 1.28 శాతం,  అమర్‌రాజా బ్యాటరీస్‌ 1.06 శాతం,  ఎయిచర్‌ మోటర్స్‌ 0.99శాతం, భారత్‌ ఫోర్జ్‌ 0.12 శాతం కూడా నష్టపోయిన షేర్లలో ఉన్నాయి. You may be interested

సెన్సెక్స్‌ మద్దతు శ్రేణి 39,320-39,090

Monday 8th July 2019

బడ్జెట్‌ అంచనాలు, ప్రపంచ మార్కెట్ల సానుకూల పవనాల కారణంగా గతవారం తొలి నాలుగురోజులూ క్రమేపీ పెరిగిన మన మార్కెట్‌...బడ్జెట్‌ ప్రతిపాదనలు నిరుత్సాహపర్చడంతో వారంలో ఆర్జించిన లాభాల్లో చాలావరకూ కోల్పోయింది. మరోవైపు అమెరికాలో తాజాగా వెలువడిన జాబ్స్‌ డేటాతో ఫెడ్‌ వడ్డీ రేట్లు తగ్గవన్న అంచనాల్ని ఏర్పర్చడంతో గత శుక్రవారం అమెరికా, యూరప్‌ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఈ అంశాల ప్రభావం ఈ వారం ప్రారంభంలో మన మార్కెట్‌పై పడవచ్చు.

మార్కెట్‌పై బడ్జెట్‌ నిర్ణయాల ప్రభావం

Monday 8th July 2019

మార్కెట్‌పై బడ్జెట్‌ నిర్ణయాల ప్రభావం ఐఐపీ, ద్రవ్యోల్బణం, కార్పొరేట్‌ ఫలితాల పాత్ర కూడా ఈ వారం మార్కెట్‌ గమనంపై నిపుణుల అంచనాలు 9న టీసీఎస్‌, 12న ఇన్ఫోసిస్‌ ఫలితాలు న్యూఢిల్లీ: గత శుక్రవారం బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన కీలక నిర్ణయాలు, ప్రతిపాదనల ప్రభావం ఈ వారం మార్కెట్‌పై ఉంటుందని, అలాగే ఐఐపీ(పారిశ్రామికోత్పత్తి), ద్రవ్యోల్బణం వంటి స్థూల ఆర్థిక గణాంకాలపైనా ఇన్వె‍స్టర్ల దృష్టి ఉంటుందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇక జూన్‌ త్రైమాసికానికి సంబంధించి విడుదలయ్యే

Most from this category