News


ఆటో, ఆటో విడిభాగాల షేర్లు భేష్‌

Tuesday 31st December 2019
Markets_main1577773423.png-30556

ఆర్థిక మందమనంలోనూ ఆశలు రేపుతున్న ఆటో రంగం
క్వాంటమ్‌ సెక్యూరిటీస్‌ డైరెక్టర్‌ నీరజ్‌ దివాన్‌

ఇప్పటికే ఆర్థిక మందగమన ప్రభావం పలు రంగాలపై కనిపిస్తోంది. అయితే ఇటీవల ఆటో, ఆటో విడిభాగల పరిశ్రమలో కొంతమేర ఆశావహ పరిస్థితులకు బీజం పడిందని చెబుతున్నారు క్వాంటమ్‌ సెక్యూరిటీస్‌ డైరెక్టర్‌ నీరజ్‌ దివాన్‌. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్థిక మందగమనం, బడ్జెట్‌ తదితర అంశాలపై నీరజ్‌ పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం..

ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(సెప్టెంబర్‌-అక్టోబర్‌)లో మధ్య, చిన్నతరహా కౌంటర్లు డీలాపడ్డాయి. ఇకపై మిడ్‌ క్యాప్‌ కంపెనీలు ప్రోత్సాహకర ఫలితాలు సాధించగలిగితే.. ఈ ట్రెండ్‌లో మార్పువచ్చే అవకాశముంటుంది. ఇక మరోపక్క రిజర్వ్‌ బ్యాంక్‌ భవిష్యత్‌లోనూ మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) పెరిగే వీలున్నట్లు అభిప్రాయపడింది. వెరసి ఇప్పటికీ సమస్యాత్మక వాతావరణం నెలకొన్నప్పటికీ ఆర్థిక వృద్ధి ఊపందుకుంటే.. పరిస్థితులు మెరుగుపడేందుకు అవకాశముంటుంది. డిసెంబర్‌లో కొంతమేర రికవరీ కనిపించవచ్చు. 

బడ్జెట్‌ కీలకం
ఫిబ్రవరిలో వెలువడనున్న కేంద్ర బడ్జెట్‌ ఇకపై అత్యంత కీలకంగా నిలవనుంది. ప్రస్తుతం కంపెనీల పనితీరు, వసూళ్లు వంటి పలు పరిస్థితులు నెమ్మదించాయి. దీంతో ఆర్థిక వ్యవస్థను  అభివృద్ధి బాట పట్టించవలసి ఉంది. ఇందుకు బడ్జెట్‌ దారిచూపే అవకాశముంది. ఇటీవల మార్కెట్లు 15-20 బ్లూచిప్స్‌ బలపడటం ద్వారానే ర్యాలీ చేస్తున్నాయి. ఈ స్టాక్స్‌ భవిష్యత్‌లోనూ అత్యధిక రిటర్నులు ఇచ్చే చాన్స్‌ తక్కువే. ఇటీవల వరకూ దేశ, విదేశీ పెట్టుబడులు ఈ కౌంటర్లకు జోష్‌నిస్తూ వచ్చాయి.

ఆటో జోరు?
ఇకపై మార్కెట్ల ర్యాలీ కొనసాగాలంటే ఎఫ్‌ఎంసీజీ(డాబర్‌, గోద్రెజ్‌)తోపాటు.. సిమెంట్‌, స్టీల్‌ రంగాలు సైతం పార్టిసిపేట్‌ చేయవలసి ఉంటుంది. ఇది క్లిష్టమైన ప్రశ్నే అయినప్పటికీ అవకామున్నదని భావిస్తున్నాం. తద్వారా ర్యాలీ మధ్య, చిన్నతరహా కౌంటర్లకూ విస్తరించవలసి ఉంది. అయితే ఇన్వెస్టర్లు స్టాక్‌ స్పెసిఫిక్‌గా వ్యవహరించాలి. అధిక రుణ భారంలేని, నాణ్యమైన కంపెనీలపై దృష్టిపెట్టడం మేలు. కొంతకాలంగా వడ్డీ రేట్లు తగ్గుతున్న పరిస్థితుల ఆధారంగా ఆటో, వినియోగ రంగాలు పుంజుకోవచ్చన్న అంచనాకు వచ్చాం. ఇకపై బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు వృద్ధికి ఊతమివ్వవలసి ఉంది. ఇదే విధంగా బ్యాంకులు సైతం వడ్డీ రేట్ల తగ్గింపు లబ్దిని వినియోగదారులకు అందించవలసి ఉంటుంది. ఆటో రంగంపట్ల మరీ బుల్లిష్‌గా లేనప్పటికీ.. తొలుత ప్రయాణికుల వాహన రంగ విభాగం పుంజుకోవలసి ఉంది. కార్లు లేదా ద్విచక్ర వాహన అమ్మకాలపై ఈ ప్రభావం కనిపించే అవకాశమున్నట్లు భావిస్తున్నాం. డిసెంబర్‌ నెల గణాంకాలలో ఇందుకు బీజంపడితే ప్యాసింజర్‌ ఆటో, ఆటో విడిభాగాల కంపెనీలవైపు దృష్టిపెట్టవచ్చు. ఈ విభాగంలో వేల్యుయేషన్స్‌ ఆకర్షణీయంగా ఉన్నాయి.

హౌసింగ్‌ ఫైనాన్స్‌
పెట్టుబడుల విషయంలో సంస్థాగత ఇన్వెస్టర్ల దన్ను కలిగిన హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలపట్ల సానుకూల ధృక్పథాన్ని కలిగి ఉన్నాం. ఈ తరహా కంపెనీలు.. నిధుల సమీకరణ సమస్యాత్మకంగా పరిణమించిన గత ఏడాది కాలంలోనూ తాజా పెట్టుబడులను సమకూర్చుకోగలిగాయి.  హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ విభాగ జాబితాలో ఎల్‌ఐసీ హౌసింగ్‌, కేన్‌ ఫిన్‌ హోమ్స్‌, హడ్కోలను ప్రస్తావించవచ్చు. ఈ కంపెనీల పెట్టుబడి సమీకరణ వ్యయాలు సైతం అంతగా పెరగకపోవడం గమనార్హం. ఇక మరోపక్క లార్జ్‌ క్యాప్స్‌లో ఏసీసీ, అల్ట్రాటెక్‌, గుజరాత్‌ అంబుజా దిద్దుబాటు(కరెక్షన్‌)కు లోనయ్యాయి. పెట్టుబడులకు ఈ కంపెనీలనూ పరిశీలించవచ్చు. You may be interested

3నెలల గరిష్టానికి పసిడి

Tuesday 31st December 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ఫ్యూచర్ల ధర ఈ ఏడాది చివరి రోజైన డిసెంబర్‌ 31న 3నెలల గరిష్టాన్ని అం‍దుకుంది. సంవత్సరాంతపు కొనుగోళ్ల పాటు డాలర్‌ బలహీనత పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్ల మద్దతునిచ్చాయి. ఆసియాలో మంగళవారం ఔన్స్‌ పసిడి ధర 9డాలర్లు బలపడి 1,527డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అప్‌ట్రెండ్‌లో 1,535డాలర్ల వద్ద కీలక నిరోధ స్థాయి ఉంది. మొదటి దశ వాణిజ్య ఒప్పంద పత్రాలపై ట్రంప్‌, జింగ్‌ పింగ్‌లు వచ్చే నెల

2020లో ఈ సూత్రాలు మర్చిపోకండి

Tuesday 31st December 2019

కొత్త ఏడాది ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే మదుపరులు తప్పక గుర్తుంచుకోవాల్సిన నాలుగు సూత్రాలను నిపుణులు వివరిస్తున్నారు.  1. క్వాలిటీనే కీలకం: సైక్లిక్స్‌ మార్కెట్లో మార్పులు తీసుకువస్తుంటాయి, కానీ ఎప్పుడూ కాలపరీక్షకు నిలిచేది క్వాలిటీ మాత్రమే. నాణ్యమైన స్టాకులు మార్కెట్‌ ఆటుపోట్లను తట్టుకుంటాయని మరచిపోకండి.  2. రిస్కు- రివార్డు: మార్కెట్లో కేవలం వాల్యూషన్లు మాత్రమే పరిశీలించి నిర్ణయం తీసుకోకుండా రిస్కు- రివార్డు నిష్పత్తిని సైతం లెక్కించి నిర్ణయం తీసుకోవాలి. బలమైన యాజమాన్యం, స్థిరమైన

Most from this category