News


ఆటో యాన్సిలరీ షేర్ల లాభాల జోరు

Thursday 26th December 2019
Markets_main1577345279.png-30453

ఆటో విడిభాగాల తయారీ కంపెనీలు జూమ్‌
20 శాతం అప్పర్‌ సర్క్యూట్లను తాకిన పలు షేర్లు

దాదాపు 15 నెలలుగా నేలచూపులకే పరిమితమైన ఆటో విడిభాగాల తయారీ కంపెనీల షేర్లకు ఉన్నట్టుండి భారీ డిమాండ్‌ పుట్టింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో పలు కంపెనీల షేర్లు ఏకంగా 20 శాతం అప్పర్‌ సర్క్యూట్లను తాకాయి. మార్కెట్లు బలహీనంగా కదులుతున్నప్పటికీ ఆటో రంగం ఊపందుకోనున్న అంచనాలు ఈ కౌంటర్లకు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో రాణే గ్రూప్‌లోని పలు కంపెనీలు సైతం యాక్టివ్‌గా ట్రేడవుతున్నాయి. వెరసి బీఎస్‌ఈలో ఆల్‌క్యాప్‌ గెయినర్స్‌ 20లో 13 షేర్లు ఆటో రంగానివే చోటు సాధించాయి. వివరాలు చూద్దాం..

రేసు గుర్రాలు
గురువారం ట్రేడింగ్‌లో పలు ఆటో యాన్సిలరీ కంపెనీల కౌంటర్లు జోరందుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో రాణే మద్రాస్‌, రాణే బ్రేక్‌ లైనింగ్‌, రాణే ఇంజిన్‌ వాల్వ్స్‌, హోల్డింగ్స్‌, సుందరం బ్రేక్‌ లైనింగ్స్‌, ఇండియా నిప్పన్‌ ఎలక్ట్రికల్స్‌, స్టెర్లింగ్‌ టూల్స్‌, ఇగార్షీ మోటార్స్‌ 20-15 శాతం మధ్య దూసుకెళ్లాయి. ఈ బాటలో ఇతర కౌంటర్లు ప్రైకోల్‌, యుకాల్‌ ఫ్యూయల్‌, జెడ్‌ఎఫ్‌ స్టీరింగ్‌, వీల్స్‌ ఇండియా, ఆటోమోటివ్‌ యాక్సిల్స్‌, హైటెక్‌ గేర్‌, ఇండియన్‌ మోటార్‌ పార్ట్స్‌, లుమాక్స్‌ టెక్నాలజీస్‌, లుమాక్స్‌ ఇండస్ట్రీస్‌, మిండా కార్పొరేషన్‌, మిండా ఇండస్ట్రీస్‌, జీఎన్‌ఏ యాక్సిల్స్‌, బ్యాంకో ప్రొడక్ట్స్‌, పీపీఏపీ ఆటోమోటివ్‌, శివమ్‌ ఆటొటెక్‌ తదితరాలు 10-3 శాతం మధ్య జంప్‌చేశాయి. 

రికవరీ అంచనాలు
ఏడాదిన్నర కాలంగా నీరసించిన వాహన అమ్మకాలు ఇకపై ఊపందుకోనున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అధిక డిస్కౌంట్లు, చౌక వడ్డీ రేట్లు, గ్రామీణ ఆదాయం వంటి అంశాలు ఆటో రంగ అమ్మకాలపై అంచనాలను పెంచుతున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా దేశీ వాహన రంగం పయనిస్తున్న నేపథ్యంలో ఇకపై ఆటో అమ్మకాలు పెరిగే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు.

స్టెర్లింగ్‌ టూల్స్‌ జూమ్‌
తాజాగా 15 శాతం దూసుకెళ్లడం ద్వారా స్టెర్లింగ్‌ టూల్స్‌ షేరు రెండు రోజుల్లోనే 35 శాతం జంప్‌చేసింది. మధ్యాహ్న సమయంలో ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో రూ. 33 ఎగసి రూ. 248 వద్ద ట్రేడవుతోంది. జేవీ ఏర్పాటుకు వీలుగా చైనా సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించడంతో ఆటోవిడిభాగాల కంపెనీ స్టెర్లింగ్‌ టూల్స్‌ కౌంటర్‌ మంగళవారం 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకిన సంగతి తెలిసిందే. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు రూ. 36 జంప్‌చేసి రూ. 215 వద్ద లాకయ్యింది. చైనా కంపెనీతో జేవీ ద్వారా దేశీ ఎలక్ట్రిక్‌ వాహనాలకు అత్యుత్తమ మోటార్‌ కంట్రోల్‌ యూనిట్లను(ఎంసీయూలు) సరఫరా చేయనున్నట్లు స్టెర్లింగ్‌ టూల్స్‌ తెలియజేసింది. ఇక మరో కంపెనీ ఇగార్షీ మోటార్స్‌ షేరు 16 శాతం పెరిగి రూ. 386 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 397 వరకూ దూసుకెళ్లింది. ఈ కౌంటర్లో ఉదయం సెషన్‌లోనే బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో కలిపి 6 మిలియన్‌ షేర్లు చేతులు మారడం విశేషం! ఈ షేరు సైతం ఇటీవల కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతుండటం గమనార్హం!!

ఆటో షేర్ల దూకుడు
కంపెనీ పేరు ధర(రూ.) లాభం(%)
రాణే మద్రాస్‌  317  20 
రాణే ఇంజిన్‌  252 20
రాణే బ్రేక్‌ లైనింగ్‌ 677 18.5
సుందరం బ్రేక్‌ 299 17.2
రాణే హోల్డింగ్స్‌ 843 16.2
స్టెర్లింగ్‌ టూల్స్‌ 248 15.5
ఇగార్షీ మోటార్స్‌ 386 15.5
ఇండియా నిప్పన్‌ 357 14.5
యుకాల్‌ ఫ్యూయల్‌ 137 10
వీల్స్‌ ఇండియా 630 7.7

 You may be interested

స్వల్పకాలానికి స్టాక్‌ రికమెండేషన్లు

Thursday 26th December 2019

సూచీలు కొత్త గరిష్టాలను నమోదు చేసిన అనంతరం పరిమిత శ్రేణిలో కదలాడుతున్నాయి. ప్రపంచ మార్కెట్లు ఓవర్‌బాట్‌ అయిన నేపథ్యంలో ఎప్పుడైనా లాభాల స్వీకరణ జరవచ్చనే అంచనాలతో  ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అప్రమత్తత వహిస్తున్నారని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఏడాది బడ్జెట్‌ ప్రవేశపెట్టేంత వరకు మార్కెట్లో స్తబ్దుగా కొనసాగే అవకాశం ఉండొచ్చంటున్నారు.  ఈ నేపథ్యంలో స్వల్పకాలానికి కొనుగోలుచేసేందుకు వారు కొన్ని స్టాక్‌లను సిఫార్సు చేస్తున్నారు.  కునాల్‌ బోత్రా నుంచి 5స్టాక్‌ రికమెండేషన్లు.... షేరు పేరు:- ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ టార్గెట్‌

అమ్మకాల ఒత్తిడిలో పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు

Thursday 26th December 2019

పరిమితి శ్రేణి మార్కెట్‌ ట్రేడింగ్‌లో భాగంగా గురువారం ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లుకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ నేడు 2,538.65 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఈ రంగ షేర్ల అమ్మకాలకు పూనుకోవడంతో ఇండెక్స్‌ ఒకదశలో 1శాతం నష్టపోయి 2,509.80 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:45ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(2,532.20)తో

Most from this category