News


అరబిందో ఫార్మా లాంగ్‌జంప్‌...18 శాతం అప్‌

Wednesday 19th February 2020
Markets_main1582090668.png-31925

18 శాతం దూసుకెళ్లిన షేరు
రూ. 590 వద్ద ట్రేడింగ్‌
యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి ఈఐఆర్‌

అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్‌ఎఫ్‌డీఏ) నుం‍చి సక్రమ తనిఖీల నివేదిక(EIR) లభించినట్లు దేశీ ఫార్మా రంగ దిగ్గజం అరబిం‍దో ఫార్మా తాజాగా పేర్కొంది. హైదరాబాద్‌లోని పాశమైలారంలో గల ఇంజక్టబుల్‌ ఫార్ములేషన్ల తయారీ ప్లాంటుకి ఈఐఆర్‌ను పొందినట్లు వెల్లడించింది. ఈ యూనిట్‌-4  ప్లాంటులో యూఎస్‌ఎఫ్‌డీఏ 2019 నవంబర్‌ 4-13 మధ్య తనిఖీలు చేపట్టినట్లు తెలియజేసింది. అయితే వొలంటరీ యాక‌్షన్‌ ఇనీషియేటెడ్‌(వీఏఊ)తో కూడిన ఈఐఆర్‌ను జారీ చేసినట్లు వివరించింది. ఇది ఫార్మా ప్రొడక్టుల ఉత్పత్తి, విక్రయాలకు ప్రోత్సాహమిచ్చే అంశమేనని ఈ సందర్భంగా పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తావించదగ్గ స్థాయిలోలేని లోపాలు గుర్తించినప్పుడు ఇలాంటివి జరిగే అవకాశముంటుందని తెలియజేశాయి. దీంతో హైదరాబాద్‌ కంపెనీ అరబిం‍దో ఫార్మా కౌంటర్‌కు ఒక్కసారిగా డిమాండ్‌ పెరగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ షేరు దాదాపు 18 శాతం దూసుకెళ్లింది. ఉదయం 11 ప్రాంతంలో ఎన్‌ఎస్‌ఈలో అరబిందో షేరు దాదాపు 18 శాతం దూసుకెళ్లింది. రూ. 589 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 592 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది. డిసెంబర్‌కల్లా అరబిందో ఫార్మాలో ప్రమోటర్లకు 51.87 శాతం వాటా ఉన్నట్లు తెలుస్తోంది. 



You may be interested

నిఫ్టీ మార్పులతో శ్రీసిమెంట్‌ అప్‌- యస్‌ బ్యాంక్‌ డౌన్‌

Wednesday 19th February 2020

వచ్చే నెల(మార్చి) 27 నుంచి ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీలో చేపడుతున్న మార్పుల నేపథ్యంలో శ్రీ సిమెంట్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ నెలకొంది. మరోపక్క యస్‌ బ్యాంక్‌ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. ఉదయం 11.20 ప్రాంతంలో ఎన్‌ఎస్‌ఈలో శ్రీ సిమెంట్‌ షేరు 3 శాతం జంప్‌చేసి రూ. 24,503 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 25,200 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మరోవైపు యస్‌ బ్యాంక్‌ 2 శాతం నీరసించి

వొడాఫోన్‌ఐడియాకు ఎటువంటి విలువా లేదు!

Wednesday 19th February 2020

సిటీ గ్రూప్‌ అంచనా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వొడాఫోన్‌ ఇండియాకు ఎలాంటి ఈక్విటీ విలువ లేదని సిటీగ్రూప్‌ వ్యాఖ్యానించింది. అందుకే వీఐఎల్‌ షేరు టార్గెట్‌ను డ్రాప్‌ చేసినట్లు(ఎలాంటి టార్గెట్‌ ధర ప్రకటించకపోవడం) తెలిపింది. వీఐఎల్‌ భవితవ్యంపై సుప్రీం కోర్టు తాజా తీర్పు అనంతరం నీలినీడలు కమ్ముకున్నాయన్నారు. ఇక ప్రస్తుతానికి వీఐఎల్‌కు ఉన్న ఒకే ఒక ఆఖరు ఆశ ప్రభుత్వ సాయమని, కానీ ఇప్పటికైతే ప్రభుత్వం నుంచి ఈ దిశగా ఎలాంటి సంకేతాలు

Most from this category