News


ఫలితాలు హిట్‌..అరబిందో షేరు ర్యాలీ

Thursday 8th August 2019
Markets_main1565256669.png-27641

జూన్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాలలో అరబిందో ఫార్మా అన్ని పారామితులలో విశ్లేషకుల అంచనాలను అధిగమించడంతో గురువారం(అగష్టు 08) ఇంట్రాడేలో ఈ కంపెనీ షేరు 7.8 శాతం ర్యాలీ చేసింది. ఈ త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన ఈ కంపెనీ 39.5 శాతం వృద్ధిని సాధించడం గమనర్హం. యుఎస్, యూరప్, యాంటీరెట్రోవైరల్ వ్యాపారాలలో గణనీయమైన వృద్ధి కారణంగా, జూన్‌ త్రైమాసికంలో కంపెనీ రూ. 635.7 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. యుఎస్ ఫార్ములేషన్ వ్యాపారం 42.3 శాతం, యురప్‌ ఫార్ములేషన్స్ విభాగం 16.1 శాతం వృద్ధిని సాధించాయి. అంతేకాకుండా యాంటీరెట్రోవైరల్ ఔషదాల అమ్మకాలు ఏడాది క్రితం కంటే రెట్టింపయ్యి రూ. 318.5 కోట్లకు చేరుకున్నాయి. వీటి ఫలితంగా కంపెనీ మొత్తం ఆదాయం ఈ జూన్‌ త్రైమాసికంలో  28.1 శాతం పెరిగి రూ .5,444.6 కోట్లకు చేరుకుంది. 
    మొత్తం ఆదాయంలో 87 శాతం వాటా ఫార్ములేషన్ లేదా జెనెరిక్ ఔషదాల అమ్మకాల వలనే ఉండడం గమనర్హం. వీటి అమ్మకాలు ఈ త్రైమాసికంలో పెరిగి రూ .4,712 కోట్లకు చేరుకున్నాయి. కాగా గత ఏడాది ఇదే కాలంలో వీటి అమ్మకాలు రూ. 3,500.8 కోట్లుగా ఉన్నాయి. అయినప్పటికి, ఔషధాల తయారీలో వినియోగించే కీలకమైన ముడి పదార్థాలైన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాల అమ్మకాలు (ఏపీఐ) 2.1 శాతం తగ్గి రూ. 732.2 కోట్లకు పడిపోయాయి. ‘మేము ఆరోగ్యకరమైన ప్రదర్శనతో ఈ ఏడాదిని ప్రారంభించాం. మా నాణ్యత నిర్వహణ పద్ధతులను మెరుగుపరచడం, నియంత్రణ అవసరాలకు కట్టుబడి ఉండటం, మా అత్యధిక ప్రాధాన్యతగా కొనసాగుతాయి’ అని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ గోవిందరాజన్ అన్నారు. 
  ఈబీఐటీడీఏ(వడ్డీ, పన్ను, తరుగుదల, రుణ విమోచన ముందు ఆదాయాలు) 61.3 శాతం పెరిగి రూ .1,146.5 కోట్లకు, ఏడాది ప్రాతిపదికన మార్జిన్ 440 బీపీఎస్‌ పెరిగి 21.1 శాతానికి చేరుకున్నాయి. అరబిందో ఫార్మా నికర అప్పు త్రైమాసిక ప్రాతిపదికన 18.3 శాతం తగ్గి రూ .4,093.9 కోట్లుగా ఉంది. అరబిందో కంపెనీ జూన్‌ త్రైమాసిక ఫలితాలలో, మొత్తం ఆదాయం రూ.5,216.7 కోట్లు, నికర లాభం రూ. రూ .601.5 కోట్లు, 20 శాతం మార్జిన్‌తో ఈబీఐటీడీఏ రూ. 1,036.4 కోట్లుగా ప్రకటిస్తుందని మార్కెట్‌  విశ్లేషకులు అంచనా వేశారు. కాగా ఈ కంపెనీ ఫలితాలు అంచనాలకు మించి ఉండడం గమనర్హం. ఐసీఐసీఐ డైరెక్ట్‌ అరబిందో స్టాకుపై ‘బై’ రేటింగ్‌ను ఇస్తూ.. షేరు టార్గెట్‌ ధరను రూ. 735 గా నిర్ణయించింది. అంతేకాకుండా ఈ కంపెనీ షేరు ప్రస్తుత ధరల స్థాయి నుంచి 32 శాతం పెరిగే అవకాశం ఉందని తెలిపింది. 
ఈ స్టాక్ మధ్యాహ్నం 2.47 సమయానికి 6.85 శాతం లాభపడి రూ .592.70 వద్ద ట్రేడవుతోంది.



You may be interested

బ్యాంకు నిఫ్టీ 513 పాయింట్ల రికవరీ

Thursday 8th August 2019

బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్ గురువారం ట్రేడింగ్‌లో తిరిగి 28000 స్థాయిని అందుకుంది. నేడు ఈ ఇండెక్స్‌ 27,840.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో భాగంగా జరిగిన అమ్మకాల్లో ఒక దశలో ఇండెక్స్‌ 171 పాయింట్లను కోల్పోయి 27,531.05 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం నుంచి మార్కెట్లో మొదలైన కొనుగోళ్లతో ఇండెక్స్‌ కనిష్టస్థాయిల నుంచి రివకరి అయ్యింది. ముఖ్యంగా ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్లైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌,

రాణిస్తున్న ఐటీ షేర్లు

Thursday 8th August 2019

ఐటీ షేర్లు గురువారం రాణిస్తున్నాయి. ఐటీరంగంలో అదిక వెయిటేజీ కలిగిన ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ షేర్లు ర్యాలీ, రూపాయి ఒడిదుడుకుల ట్రేడింగ్‌ ఐటీ ఇండెక్స్‌ బలపడేందుకు తోడ్పాటునందిస్తున్నాయి. నేడు ఐటీ ఇండెక్స్‌ 15,677.45 వద్ద ప్రారంభమైంది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు 2శాతం ర్యాలీతో పాటు హెచ్‌సీఎసీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు 6శాతం లాభపడటంతో ఇండెక్స్‌ 1.74 శాతానికి పైగా

Most from this category