అరబిందో ఫార్మా 8.50శాతం డౌన్
By Sakshi

దేశీయ ఫార్మా దిగ్గజ కంపెనీ అరబిందో ఫార్మా షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో 8.50శాతం నష్టపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో యూనిట్- 1, యూనిట్ X1, యూనిట్ 1X తనిఖీలను పూర్తి చేసిన యూఎస్ఎఫ్డీఏ ఆయా యూనిట్లకు ఓఏఐ (అఫిషియల్ యాక్షన్ ఇండికేటెడ్) లేఖను జారీ చేసినట్లు కంపెనీ స్టాక్ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. యూఎస్ఎఫ్డీఏ తెలిపిన అభ్యంతరాలకు వివరణ ఇచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఓఏఐ కారణంగా ఈ ప్లాంట్లకు సంబంధించి ఆదాయం లేదా సరఫరాలకు ఎలాంటి అంతరాయం కలగదని, దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉన్న వివరాలను దాఖలు చేయనున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో ట్రేడింగ్ ప్రారంభం నుంచి అరవిందో షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. షేరు ఒకానొక దశలో 8.50శాతం నష్టపోయి రూ.662.15ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి నమోదు చేసింది. మధ్యాహ్నం గం.1:30ని.లకు షేరు గతముగింపు (రూ.724.8)తో పోలిస్తే 8శాతం నష్టంతో రూ.669.00ల వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా, షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 527.05 రూ.838.00లుగా నమోదయ్యాయి.
You may be interested
8శాతం లాభపడ్డ డీహెచ్ఎఫ్ఎల్ షేర్లు
Friday 17th May 2019ముంబై: డీహెచ్ఎఫ్ఎల్ షేర్లు శుక్రవారం 4శాతం పెరిగాయి. నేడు బీఎస్ఈలో కంపెనీ షేర్లు రూ.111.20ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. డీహెచ్ఎఫ్ఎల్ తన హోల్‌సేల్ రియల్ఎస్టేట్ రుణాలను అమెరికా ఆధారిత కంపెనీ ఓక్ట్రీ క్యాపిటల్ మేనేజ్మెంట్ సంస్థకు 17,000-18,000 కోట్లకు విక్రయించేందుకు సిద్ధమైంది. ఈ ప్రక్రియలో భాగంగా కంపెనీ నాన్బిండింగ్ ఒప్పందంపై సంతకం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే మరో రెండు నెలల్లో రూ.8400 కోట్ల రుణ, సెక్యూరిటైజేషన్ చెల్లింపులను
ఈ స్టాకులు మార్కెట్ కదలికలకు అతీతం!
Friday 17th May 2019మార్కెట్లో వస్తున్న తీవ్ర ఆటుపోట్లకు అతీతంగా ముందుకే దూసుకుపోతున్న కొన్ని స్టాకులను అనలిస్టులు గుర్తించారు. ఈ ఏడాది ఆరంభం నుంచి ప్రతినెలా ఈ స్టాకులు అప్‌మూవ్‌నే చూపుతున్నాయి. ఇలా మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా ర్యాలీ జరుపుతున్న చిన్న స్టాకుల్లో ఎస్ఆర్ఎఫ్, డీసీబీ బ్యాంక్, ఇండో రమా సింథటిక్స్, లీడింగ్ లీజింగ్ ఫైనాన్స్, ఎస్సార్, సహయోగ్ మల్టిబేస్, జంప్నెట్వర్క్, ప్రభాత్ టెక్నాలజీస్, కావిట్ ఇండస్ట్రీస్, ఫ్రెడన్ ఫార్మా, ఆర్ఏసీఎల్ గేర్‌టెక్,