News


ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ హైజంప్‌

Thursday 23rd January 2020
Markets_main1579769082.png-31134

మూడు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పెడుతూ సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి మరింత బలపడ్డాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మధ్యాహ్నం 12.40 ప్రాంతంలో లాభాలతో కదులుతున్నాయి. సెన్సెక్స్‌ డబుల్‌ సెంచరీ చేసింది. 208 పాయింట్లు పెరిగి 41,324కు చేరింది. నిఫ్టీ సైతం 63 పాయింట్లు పుంజుకుని 12,169 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రోత్సాహకర ఫలితాల కారణంగా ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ఫలితంగా భారీ లాభాలతో కళకళలాడుతోంది. వివరాలు చూద్దాం..

ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌
ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 11 శాతం దూసుకెళ్లి రూ. 985 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1008 వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. కాగా.. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ నికర లాభం దాదాపు రెట్టింపై రూ. 190 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం 46 శాతం పుంజుకుని రూ. 507 కోట్లను అధిగమించింది. ప్రొవిజన్లు 24 శాతం పెరిగి రూ. 40 కోట్లకు చేరాయి. త్రైమాసిక ప్రాతిపదికన స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 2.09 శాతం నుంచి 1.88 శాతానికి చేరగా.. నికర ఎన్‌పీఏలు సైతం 1.14 శాతం నుం‍చి 1.01 శాతానికి నీరసించాయి.



You may be interested

భారత్‌ మార్కెట్లోకి గెలాక్సీ నోట్‌ ఎస్‌10 లైట్‌

Thursday 23rd January 2020

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్స్‌ తయారీ సంస్థ శామ్‌సంగ్‌ గతేడాది విడుదల చేసిన గెలాక్సీ నోట్‌ 10 కు అప్‌డేటెడ్‌ వెర్షన్‌ నోట్‌ 10 లైట్‌ను గురువారం వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈరోజు మద్యహ్నాం 2 గంటలనుంచి అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రారంభంకానున్నాయి. 6 జీబీ, 8జీబీ ర్యామ్‌లతో రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌ ఫిబ్రవరి 2 నుంచి అన్ని ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్లో  వినియోగదారులకు అందుబాటులో

ప్రస్తుతం ఎలాంటి చెల్లింపులు చేయలేం: ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా

Thursday 23rd January 2020

ఏజీఆర్‌ సవరణ పిటీషన్‌పై సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చేంత వరకు ఎలాంటి చెల్లింపులు చేయలేమని వోడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ కంపెనీలు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలీకమ్యూనికేషన్‌(డీఓటీ)కు తెలియజేశాయి. టెలికాం కంపెనీల ఈ నిర్ణయంతో జనవరి 23 గడువులోగా ప్రభుత్వానికి ఎటువంటి చెల్లింపులు చేయవనే విషయం స్పష్టమవుతోంది. గతేడాది నవంబర్‌లో సవరించిన ఏజీఆర్‌లపై టెలికాం సంస్థలు జనవరి 23నాటికి డీఓటీకు రూ.1.02 లక్షల కోట్ల బకాయిలు చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ అంశంపై రివ్యూ

Most from this category