News


ఏటీఎఫ్‌ ధరల పెంపు: అయినా లాభాల్లో ఏవియేషన్‌ షేర్లు

Wednesday 1st January 2020
Markets_main1577872205.png-30591

విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలు వరుసగా రెండో నెలలో పెరిగాయి. ఏటీఎఫ్ ధరను సరాసరిన కిలోలీటరుకు రూ.1,637.25(2.5శాతం) మేర పెంచుతున్నట్లు చమురు కంపెనీలు బుధవారం వెల్లడించాయి. అలాగే నాన్ సబ్సిడీ ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) లేదా కుకింగ్ గ్యాస్ సిలిండర్ ధర రూ.19లు మేర పెరిగాయి. పెరిగిన ధరలు బుధవారం నుంచి అమల్లోకి వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో పాటు డాలరు మారకంలో రూపాయి విలువ తగ్గడం ఇందుకు కారణమైనట్లు ప్రభుత్వరంగ ఇంధన రిటైలర్లు తెలిపారు. పెంచిన ధరల ప్రకారం నేటి నుంచి ఢిల్లీలో ఏటీఎఫ్ కిలోలీటరు ధర రూ.64,323.76 చేరుకుంటుందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారి ఒకరు తెలిపారు. మనకు అవసరమైన చమురులో 84 శాతం దిగుమతే చేసుకుంటాం. దేశీయ ఇంధన ధరలను అంతర్జాతీయ ధరలతో అనుసంధానించి విక్రయిస్తున్నారు. 

ఏవియేషన్‌ షేర్ల ర్యాలీ:- 
విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరల పెంచినప్పటికీ, ఏవియేషన్‌ షేర్లు గురువారం ట్రేడింగ్‌లో భారీగా ర్యాలీ చేస్తున్నాయి. మిడ్‌సెషన్‌ సమయానికి జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు 5శాతం శాతం ఎగసి రూ. 31.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. స్పైస్‌జెట్‌ షేరు 2.26 శాతం జంప్‌చేసి రూ.115.25 వద్ద ట్రేడవుతోంది. ఇండిగో షేరు 1శాతం ర్యాలీ చేసి రూ.1347.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

కొత్త ఏడాదిలో గ్యాస్‌ మరింత ధర:- 
నాన్ సబ్సిడీ ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) లేదా కుకింగ్ గ్యాస్ సిలిండర్  ధర జనవరి 1, 2020 నుంచి స్వల్పంగా పెరిగింది. ఎల్పీజీ ధరలు పెరగడం ఇది వరుసగా ఐదో నెల. ఒక్కో సిలిండర్‌పై రూ. 19ల భారం పడనుంది. పెంచిన ధరల ప్రకారం న్యూఢిల్లీలో 14.2 కేజీల సిలిండర్‌  ధర రూ. 695 నుంచి రూ. 714కు చేరుకోనుంది. వివిధ రాష్ట్రాల్లో స్థానిక పన్నులను అనుసరించి, ఢిల్లీ ధరతో పోలిస్తే వ్యత్యాసం వుంటుంది. కాగా గతేడాది ఆగస్ట్‌ 2019 నుంచి సిలిండర్‌ ధర రూ.139(24.28శాతం) పెరిగింది. You may be interested

స్వల్ప లాభాలతో కొత్త ఏడాదికి స్వాగతం

Wednesday 1st January 2020

ఆదుకున్న ఐటీ, ఎఫ్‌ఎంసీజీ కొత్త ఏడాది(2020)ని దేశీ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో స్వాగతించాయి. బుధవారం సెన్సెక్స్‌ 52 పాయింట్లు పెరిగి 41,306 వద్ద ముగిసింది. నిఫ్టీ 14 పాయింట్లు పుంజుకుని 12,183 సమీపంలో నిలిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 41,443 వద్ద గరిష్టాన్ని తాకగా.. 41,251 వద్ద కనిష్టానికి చేరింది. నిఫ్టీ సైతం 12,222-12165 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. నూతన సంవత్సరం సందర్భంగా ప్రపంచ మార్కెట్లన్నీ సెలవుల్లో కొనసాగుతుండటంతో ట్రేడింగ్‌ యాక్టివిటీ తగ్గిపోయినట్లు

ఏపీఎల్‌, స్టెర్లింగ్‌ జూమ్‌- డిష్‌మన్‌ బోర్లా

Wednesday 1st January 2020

కొత్త ఏడాది తొలి రోజు హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు మిడ్‌సెషన్‌కల్లా కొంతమేర మందగించాయి. 2.30 ప్రాంతంలో స్వల్ప లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల ఆధారంగా ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌, స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ కౌంటర్లలో కొనుగోళ్లు పెరగడంతో లాభాలతో సందడి చేస్తున్నాయి. అయితే మరోవైపు ఐటీ సోదాలలో ఖాతాలలో చూపని సొమ్ము లభించినట్లు వెలువడిన వార్తలు డిష్‌మన్‌ కార్బోజెన్‌

Most from this category