News


ఇప్పటి ధరల్లో షేర్లు ఆకర్షణీయం కాదు: రాజీవ్‌ ఖన్నా

Wednesday 25th September 2019
Markets_main1569408633.png-28547

-వినియోగ శక్తి పెరిగితేనే ఆర్థిక వ్యవస్థకు మంచిది
-అప్పటి వరకు వేచి చూసే దోరణి వైపే మొగ్గు: రాజీవ్‌ ఖన్నా
-స్మాల్‌ క్యాప్‌, మిడ్‌క్యాప్‌లలో అవకాశాలు బాగున్నాయి: విజయ్‌ కేడియా
-ఆర్‌ఓసీఈని సమర్ధవంతంగా నిర్వహిస్తున్న కంపెనీల స్టాకులను విడిచిపెట్టోద్దు: అభిషేక్‌ బాసుముల్లిక్‌  
 
    దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి వరుస ఆర్థిక చర్యలను ప్రకటించారు. అన్నిటికన్నా ముఖ్యంగా కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించారు. వీటి ఫలితంగా వరుస రెండు సెషన్‌లలో దేశీయ ఈక్విటీ మార్కెట్లో విపరీతంగా కొనుగోళ్లు పెరిగాయి. కానీ ఈ ర్యాలీపై సీనియర్‌ ఇన్వెస్టర్‌ రాజీవ్‌ ఖన్నా మాత్రం అనుమానస్పదంగానే ఉండడం గమనార్హం. 
వినియోగం పుంజుకోవాలి..
   అక్టోబర్‌ 1 లేదా ఈ తేది తర్వాత నెలకొల్పి, మార్చి 2023లోపు ఉత్పాదకతను ప్రారంభించగలిగే తయారి రంగ కంపెనీలపై కార్పోరేట్‌ ట్యాక్స్‌ను ప్రభుత్వం 15 శాతానికి తగ్గించింది. దీని వలన దీర్ఘకాలంలో పెట్టుబడులు పెరుగుతాయని, ఇది చాలా మంచి ఆలోచనని రాజీవ్‌ ఖన్నా అన్నారు. కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు వలన కొన్ని కంపెనీలు లాభపడే అవకాశం ఖచ్చితంగా ఉందని తెలిపారు. కానీ ఈ చర్య వలన దేశ ఆర్థిక మందగమనం తగ్గడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ‘వినియోగదారుల నగదు లభ్యతను పెంచే విధంగా ప్రభుత్వం ఎటువంటి చర్యనైనా తీసుకోవాలి. లేకపోతే ఆర్థిక మందగమనం దీర్ఘకాలం కొనసాగుతుంది. ఇప్పటికి కూడా ఈ సమస్యపై ప్రభుత్వం దృష్ఠి పెట్టలేదు’ అని రాజీవ్‌ అన్నారు. ‘కేంద్ర ఆర్థిక మంత్రి, ఈ సమస్యపై దృష్ఠి సారిస్తారని ఆశిస్తున్నా. ప్రస్తుత మార్కెట్‌ ర్యాలీ సహేతుమైనది కాదు. వినియోగదారలు నగదు లభ్యత పెరిగేంత వరకు నేను ప్రస్తుత మార్కెట్‌పై అనుమానస్పదంగానే ఉంటాను’ అని వివరించారు.
   కాగా రాజీవ్‌ ఖన్నా ఇండియాలో విజయవంతమైన ఇన్వెస్టర్లలో ముందు వరుసలో ఉంటారు. నాణ్యమైన స్టాకులను ఎన్నుకోవడం, వాటిపై మంచి రిటర్న్‌లను సాధించడంలో ఈయన సిద్ధహస్తుడు.  అంతేకాకుండా ప్రఖ్యాత డాలీ ఖన్నా మల్టీబ్యాగర్ పోర్ట్‌ఫోలియో ఈయనేదే. ప్రసుత మార్కెట్‌లో ఇన్వెస్ట్‌చేయడానికి వేచి ఉన్నానని రాజీవ్‌ అన్నారు. ‘ ముందు దేశ ఆర్థిక మందగమనం తగ్గాలి. దేశంలో వినియోగం పెరిగితే నేను అప్పుడు ఇన్వెస్ట్‌ చేయడం ప్రారంభిస్తా. స్థూల ఆర్థిక సంఖ్యలు ముందు పెరగాలి. నేను దీనిని అంచనా వేసి ఇన్వెస్ట్‌చేయలేను. ప్రస్తుతం నేను దేశ ఆర్థిక వృద్ధిపై దృష్ఠి సారించాను. మార్కెట్‌లో ఇప్పటికిప్పుడు ఏవి కూడా ఆకర్షణియంగా కనిపించడం లేదు. నేనింకా వేచి చూసే దోరణీనే అనుసరిస్తున్నాను’ అని ఆయన వివరించారు. కాగా ఈ ఏడాది జూన్‌ 30 నాటికి రాజీవ్‌ ఖన్నా పోర్టుఫోలియో విలువ రూ. 200 కోట్లకు చేరుకోవడం గమనార్హం.
   మార్చి 31 2019 నాటికి రాజీవ్‌ ఖన్నా, ఒక శాతం కంటే అధిక వాటాను  11 కంపెనీలలో కలిగి ఉండగా, జున్‌ 30 నాటికి అది 6 కంపెనీలకు తగ్గిపోయింది. మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగినప్పుడు ఈయన అనేక కంపెనీలలోని తన వాటాను విక్రయించారని ఏస్‌ ఈక్విటీ డేటా పేర్కొంది.
అధ్వాన్న పరిస్థితులు అలానే ఉన్నాయి: విజయ్‌ కేడియా
  షార్ట్‌ కవరింగ్‌ చోటు చేసుకోవడంతో శుక్రవారం, సోమవారం ట్రేడింగ్‌లో మార్కెట్‌లు భారీ​ర్యాలీని చేశాయని ముంబైకి చెందిన సీనియర్‌ ఇన్వెస్టర్‌ విజయ్‌ కేడియా అన్నారు. కానీ వ్యవస్థలో డిమాండ్‌ లోపించడం, నిరుద్యోగం వంటి సమస్యలు ఇంకా పరిష్కారం కాకపోవడంతో మార్కెట్‌ ఇక్కడి నుంచి గణనీయంగా పెరిగే అవకాశం లేదని వివరించారు. వ్యవస్థలో అధ్వాన్న స్థితిలో ఉన్న అంశాలు ఇంకా అదే స్థితిలో ఉన్నాయని, ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు అక్టోబర్‌ నుంచి స్మాల్‌క్యాప్‌, మిడ్‌ క్యాప్‌లలో అవకాశాలను వెతుక్కోవడం మంచిదని కేడియా సలహాయిచ్చారు.  కాగా సెప్టెంబర్‌ 1 నుంచి 23 తేది వరకు పరిశీలిస్తే బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌లు ఒక్కొక్కటి చొప్పున 8 శాతం లాభపడ్డాయి. ఇదే సమయంలో సెన్సెక్స్‌ 4.71 శాతం లాభపడింది.
ఆర్‌ఓసీఈ నిర్వహణ సామర్ధ్యం ముఖ్యం: అభిషేక్‌ బాసుముల్లిక్‌
   ‘ఆర్‌ఓసీఈ(రిటర్న్‌ ఆన్‌ క్యాపిటల్‌ ఎంప్లాయిడ్‌-ఒక కంపెనీ తన క్యాపిటల్‌ నుంచి ఎంత వరకు లాభాలను పోందగలుతుందో తెలిపే రేషియో)ని సమర్ధవంతంగా ఉపయోగించుకోగలిగే కంపెనీలు, ట్యాక్స్‌ తగ్గింపు ప్రయోజనాలను కూడా సమర్ధవంతంగా ఉపయోగించుకుంటాయి. అందువలన ఇన్వెస్టర్లు భయాందోళనతో కొనుగోలు(పానిక్‌ బయ్యింగ్‌) చేయడం కంటే నాణ్యత, క్యాపిటల్‌ సామర్ధ్యం కలిగిన కంపెనీల స్టాకులను ఎంచుకోవడం ఉత్తమం’ అని కోల్‌కత్తాకు చెందిన సీనియర్‌ ఇన్వెస్టర్‌, ఇంటల్‌ సెన్స్‌ క్యాపిటల్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వజర్‌ అభిషేక్‌ బాసుముల్లిక్‌ అన్నారు. కాగా గత ఐదేళ్ల డేటాను పరిశీలిస్తే బీఎస్‌ఈ 500కు చెందిన ప్రతి 5 కంపెనీలలో ఒక కంపెనీ 20 శాతంపైనే ఆర్‌ఓసీఈని ప్రకటిస్తున్నాయి. హెచ్‌యూఎల్(హిందుస్తాన్‌ యూనిలీవర్‌), బ్రిటానియా ఇండస్ట్రీస్‌, వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌, హీరో మోటోకార్ప్‌, టీసీఎస్‌, కేర్ రేటింగ్స్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ కన్స్యూమర్ కేర్, మైండ్‌ట్రీ, వర్ల్పూల్, అలెంబిక్ ఫార్మా వంటి కంపెనీ ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నాయి. 
స్మాల్‌, మిడ్‌క్యాప్‌లలో అధ్వాన్న స్థితి పూర్తయ్యింది
మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాకులలో అధ్వాన్న పరిస్థితి పూర్తయ్యిందని, ఇన్వెస్టర్లు మూలధన వ్యయం బాగున్న స్మాల్‌, మిడ్‌క్యాప్‌ షేర్లను ఎన్నుకోవడం మంచిదని అవెక్సాత్‌ ఫైనాన్సియల్‌ అడ్వజరీ వ్యవస్థాపకుడు అవీక్‌ మిత్ర అన్నారు. 
  కాగా ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయిన దేశ జీడీపీ వృద్ధిని పెంచేందుకు, 45 ఏళ్లలో అత్యధికంగా ఏర్పడిన నిరుద్యోగ రేటును కట్టడి చేసేందుకు, ప్రభుత్వం రూ. 1.45 కోట్లను  ట్యాక్స్‌ కట్‌ రూపంలో  దేశీయ కంపెనీలకు అందించింది. ఫలితంగా  రెండు సెషన్‌లలో(సెప్టెంబర్‌ 20, 22) మొత్తంగా బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాప్‌ సుమారుగా రూ. 10 లక్షల కోట్లు పెరగడం తెలిసిందే.
 You may be interested

సెన్సెక్స్‌ 500 పాయింట్లు, నిఫ్టీ 150 పాయింట్లు డౌన్‌

Wednesday 25th September 2019

అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు లాభాల స్వీకరణ జతకలవడంతో బుధవారం దేశీయ మార్కెట్‌ భారీ నష్టాలతో ముగిసింది. రేపు సెప్టెంబర్‌ ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ గడువు ముగింపు నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. ఫలితంగా సెనెక్స్‌ 3రోజుల వరుస లాభాలకు ముగింపు పలుకుతూ 503 పాయింట్ల నష్టంతో 38593.52 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 148 పాయింట్లు నష్టపోయి 11450 దిగువున 11,440.20 వద్ద ముగిసింది. ఈ నెలలో నిఫ్టీ సూచీకిది రెండో

బలహీన రంగాలవైపే మొగ్గు!

Wednesday 25th September 2019

  ‘ప్రభుత్వం కొత్తగా ఏర్పాటయ్యే తయారీరంగ కంపెనీలపై 15 శాతం ట్యాక్స్‌ను విధించింది. దీని ఫలితంగా చైనా నుంచి బయటకొచ్చే కంపెనీలకు ఇండియా ఆకర్షణియమైన గమ్యస్థానంగా కనిపిస్తుంది’ అని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, సీఐఓ ఎస్ నరేన్ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం.. కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడం ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక సంస్కరణలలో ముఖ్యమైనది. మూలధన వ్యయం, ప్రైవేట్‌ పెట్టుబడుల పెరుగుదలే

Most from this category