సన్ ఫార్మాకు నవోదయం ఆరంభమైందా...?
By Sakshi

సన్ ఫార్మా లాభాలు ఎన్నో ఏళ్ల కనిష్ట స్థాయిలకు చేరాయి. షేరు ధర కూడా 2013 నాటి స్థాయిల్లోనే కదలాడుతోంది. కానీ, ‘సన్‌ఫార్మా’ బలమైన టర్న్ అరౌండ్ స్టోరీగా మోర్గాన్ స్టాన్లీ చెబుతోంది. తాజాగా ఈ స్టాక్‌కు రేటింగ్‌ను ఓవర్ వెయిట్ (అధిక ప్రాధాన్యం)కు పెంచడంతోపాటు రూ.505 టార్గెట్‌ను కూడా ఇవ్వడం గమనార్హం. గత ఐదు రోజుల్లోనే ఈ స్టాక్ రూ.381 స్థాయి నుంచి రూ.433 స్థాయికి పెరిగిపోవడం విశేషం. 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి సన్‌ఫార్మా లాభాలు పుంజుకుంటాయన్నది మోర్గాన్ స్టాన్లీ అంచనా. కంపెనీ ప్రధాన వ్యాపారం పుంజుకోవడం, ప్రస్తుతం పెరిగిన వ్యయాలు తగ్గడం వంటి వాటితో నిర్వహణ పరంగా పరిస్థితులు సానుకూలంగా మారతాయని పేర్కొంది. గత ఆదివారం మోర్గాన్ స్టాన్లీ ప్రకటించిన అప్‌గ్రేడ్ రేటింగ్‌తో సోమవారం ఒక్కరోజే సన్‌ఫార్మా షేరు ధర 4 శాతానికి పైగా పెరిగి రూ.424.50కు చేరుకుంది. ఇది 2013లో పలికిన ధరే కావడం గమనార్హం. 2015 ఏప్రిల్ 7న ఈ స్టాక్ జీవిత కాల గరిష్ట ధర రూ.1,151ను నమోదు చేసిన తర్వాత నుంచి... స్టాక్‌లో క్షీణత మొదలైంది. అక్కడి నుంచి 52 వారాల కనిష్ట స్థాయి ధర రూ.350.40కు పడిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు రికవరీ ప్రదర్శిస్తోంది. ఈ స్టాక్‌కు 11 మంది అనలిస్టులు బై రేటింగ్ ఇవ్వగా, 12 మంది నిపుణులు అవుట్ పెర్ఫార్మ్ రేటింగ్ ఇచ్చారు. 10 మంది హోల్డింగ్ రేటింగ్ ఇస్తే, మరో 9 మంది విశ్లేషకులు అండర్ పెర్ఫార్మ్ రేటింగ్ ఇవ్వడం గమనించాలి. 2020-22 మధ్య సన్‌ఫార్మా అమ్మకాలు 13 శాతం, లాభాలు 20 శాతం చొప్పున వార్షికంగా వృద్ధి చెందుతాయన్నది మోర్గాన్‌స్టాన్లీ అంచనా. గత రెండు సంవత్సరాల్లో ఆదాయాల్లో 4 శాతం క్షీణత, లాభాల్లో 21 శాతం క్షీణతతో పోలిస్తే మంచి ప్రదర్శనే అవుతుంది. తయారీ క్రమబద్ధీకరణ, వ్యయ నియంత్రణలు, హాలోల్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి కంపెనీకి 2021 ఆర్థిక సంవత్సరంలో మార్జిన్ల పెరుగుదలకు తోడ్పడతాయని మోర్గాన్ స్టాన్లీ భావిస్తోంది. సోరియాటిక్ ఆర్థరైటిస్ డ్రగ్ ఇలుమ్యా ఫేస్ 2 క్లినికల్ డేటా ఎంతో ఉత్తేజకరంగా ఉందని, 2020లో 30 మిలియన్ డాలర్లు, 2021లో 110 మిలియనడాలర్ల ఆదాయం వస్తుందని తాము అంచనా వేస్తున్నట్టు తెలిపింది.
You may be interested
పాజిటివ్ ఓపెనింగ్
Wednesday 17th July 2019అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూలంగా వున్నా, బుధవారం భారత్ సూచీలు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. ఇలా పాజిటివ్ ప్రారంభాన్నివ్వడం వరుసగా ఇది మూడో రోజు. బీఎస్ఈ సెన్సెక్స్ 40 పాయింట్ల లాభంతో 39,141 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో 11,670 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. యూపీఎల్, జీ టెలిఫిల్మ్, కోటక్‌బ్యాంక్, టెక్ మహింద్రా, ఆసియన్ పెయింట్స్ షేర్లు 1-2 శాతం మధ్య లాభాలతో మొదలయ్యాయి. మరోవైపు గెయిల్, టాటా
ఫండ్ మేనేజర్లకు చిక్కిన టాప్ స్టాక్స్
Tuesday 16th July 2019మ్యూచువల్ ఫండ్స్ పథకాలు జూన్ నెలలో ప్రైవేటు బ్యాంకులు, కన్జ్యూమర్, యుటిలిటీలు, టెక్నాలజీ, ఎన్బీఎఫ్సీలు, రిటైల్, మెటల్స్, పీఎస్‌యూ బ్యాంకు స్టాక్స్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టినట్టు ఐసీఐసీఐ డైరెక్ట్ సంస్థ ఓ నివేదికలో తెలిపింది. అదే సమయలో ఆయిల్ అండ్ గ్యా్స్, కెమికల్స్, ఆటో, సిమెంట్ స్టాక్స్‌లో వాటాలు తగ్గించుకున్నారని తెలిపింది. ఈ నివేదికలోని మరిన్ని వివరాలు గమనిస్తే... ఫండ్స్ మేనేజర్లు కొనుగోలు చేసిన లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో... గెయిల్, క్యాడిలా, గోద్రేజ్