News


ఇండియాపైనే విదేశీ ఇన్వెస్టర్ల చిన్నచూపు

Monday 29th July 2019
Markets_main1564396141.png-27386

జూలై నెలలో ఇప్పటివరకు దేశియ ఈక్విటీ మార్కెట్ల నుంచి 200 కోట్ల డాలర్ల పెట్టుబడులను విదేశీ ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. ఇది ఈ నెలలో ఇతర వర్థమాన మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్న పెట్టుబడుల కంటే అధికం కావడం గమనర్హం. సూపర్‌ రిచ్ ట్యాక్స్‌ విధించడంతో పాటు దేశియంగా ఆర్థిక మందగమనం కొనసాగుతుండడంతో స్టాక్‌ మార్కెట్‌ నుంచి ఎఫ్‌ఐఐలు వెళ్లిపోతున్నాయని పరిశీలకులు తెలిపారు. ఈ నెలలో సెన్సెక్స్‌, నిఫ్టీ 4 శాతం మేర నష్టపోయాయి. 
 థాయిలాండ్, ఇండోనేషియా, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలలో 40 కోట్ల డాలర్ల నుంచి 170 కోట్ల డాలర్ల మధ్య విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ జరగగా చైనా డేటా ఇంకా అందుబాటులోకి రాలేదు.  140 కోట్ల డాలర్ల ఉపసంహరణతో బ్రెజిల్‌, ఇండియా తర్వాత రెండవ స్థానంలో ఉంది. 
  ఎన్‌డీఏ నేతృత్వంలోని ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చాక ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటుందని భావించిన ఇన్వెస్టర్లు బడ్జెట్ తర్వాత నిరాశకు గురయ్యారు. విదేశీ ఫండ్స్‌తో కలిపి ధనవంతులపై  సూపర్‌ రిచ్‌ ట్యాక్స్‌ను విధించడంతో ఎఫ్‌ఐఐల ఉపసంహరణ జరుగుతోందని నిపుణులు తెలిపారు. దీంతో పాటు లిస్టెడ్ కంపెనీల వాటా బైబ్యాక్‌లపై పన్ను విధించాలన్న ప్రతిపాదన, కనీస పబ్లిక్‌ హోల్డింగ్‌ పెంచడం కూడా ఈ ఉపసంహరణపై ప్రభావం చూపాయి. ‘రిస్క్-రివార్డ్ భారతీయ మార్కెట్లలో ఆకర్షిణియంగా కనిపించడం లేదు. ఆర్థిక ఉద్దీపన, సంస్కరణలను మార్కెట్ ఆశించాయి. కానీ అది బడ్జెట్లో కనిపించకపోవడంతో కొన్ని విదేశీ ఫండ్స్‌ అమ్మకాలు జరిపి ఉండవచ్చు’ అని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్‌ అధికారి సంజీవ్ ప్రసాద్ అన్నారు. 



You may be interested

11,200 దిగువన నిఫ్టీ ముగింపు

Monday 29th July 2019

మార్కెట్‌ అమ్మకాలు మళ్లీ మొదలయ్యాయి. ఫలితంగా సూచీలు సోమవారం భారీ నష్టంతో ముగిశాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి అటో, మెటల్, ఫార్మా రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువత్తడంతో సెన్సెక్స్‌ 196 పాయింట్లు నష్టపోయి 37,686.37 వద్ద, నిఫ్టీ 95 పాయింట్లను నష్టపోయి 11200ల దిగువున 11189.20 వద్ద స్థిరపడ్డాయి.  బ్యాంకు షేర్ల పతనంతో ఎన్ఎస్‌ఈలో కీలకమైన బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ 30 పాయింట్ల నష్టంతో 29,295.90 వద్ద స్థిరపడింది. ఒక్క

ఐసిఐసిఐ బ్యాంక్‌కు బ్రోకరేజ్‌ల థమ్స్‌అప్‌

Monday 29th July 2019

ఐసిఐసిఐ బ్యాంక్ జూన్ త్రైమాసిక ఫలితాలు మార్కెట్ల అంచనాలకు మించి నమోదు కావడంతో ఈ షేరు ఇన్వెస్టర్లను ఆకర్షించింది. సోమవారం ట్రేడింగ్‌లో బెంచ్‌మార్క్‌ సూచీలు నష్టాల్లో ఉండగా ఐసిఐసిఐ షేరు మాత్రం పాజిటివ్‌గా కదలాడింది. మధ్యాహ్నాం 2.51 సమయానికి ఈ షేరు 3.24 శాతం లాభపడి రూ.429.20 వద్ద ట్రేడవుతోంది. ఈ స్టాక్‌ వచ్చే ఏడాది కాలానికి 25-50 శాతం ర్యాలీ చేసే అవకాశం ఉందని బ్రోకరేజీలు అభిప్రాయపడుతున్నాయి.    

Most from this category