News


మిశ్రమంగా ఆసియా మార్కెట్లు

Tuesday 10th September 2019
Markets_main1568099541.png-28287

చైనా ఫ్యాక్టరీ గేట్‌ ధరలు (ఉత్పత్తులకు ఫ్యాక్టరీ నిర్ణయించే ధరలు)  మూడేళ్ల కనిష్టానికి పతనం కావడంతో మంగళవారం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌, స్ట్రైట్స్‌ టైమ్స్‌, కోప్పీ, హాంగ్‌సెంగ్‌ సూచీలు అరశాతం వరకు లాభపడగా, తైవాన్‌ వెయిటైడ్‌, సెట్‌కాంపోజిట్‌, జకర్తా కాంపోజిట్‌, షాంఘై కాంపోజిట్‌ సూచీలు అరశాతం నష్టపోయాయి. దేశ, విదేశాల్లో డిమాండ్‌ తగ్గడంతో కొన్ని వ్యాపారాల్లో ధరలను తగ్గించిన కారణంగా ఆగస్ట్‌లో వార్షిక ప్రాతిపదికన చైనా ప్రొడ్యూసర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ 0.8శాతంగా నమోదైంది. రానున్న రోజుల్లో కీలక దేశాల కేంద్ర రిజర్వ్‌బ్యాంక్‌ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మంగళవారం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ గురువారం యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌, వచ్చే వారంలో జరిగే అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్యపరపతి సమావేశాల్లో ఆయా బ్యాంకులు కీలక వడ్డీరేట్లపై ఎంత మేరకు కోత తగ్గింపు ఉంటుందోనని ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య చర్చలు ‘‘చాలా పురోగతి’’సాధించినట్లు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్‌మిచిగాన్‌ ప్రకటనతో ఇన్వెస్టర్ల ఆందోళనను తగ్గించినట్లైంది. డాలర్‌ నెలరోజుల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతున్న తరుణంలో యెన్‌ బలహీనపడింది. మందగమనాన్ని ఎదుర్కోవటానికి జర్మనీ ఆర్థిక ఉద్దీపన చర్యలను అమలు చేయవచ్చనే కచ్చితమైన అంచనాలతో ప్రపంచ బాండ్ల ధరలు తగ్గాయి. ఒపెక్‌, దాని అనుబంధ కూటమి అబుదాబిలో సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో క్రూడాయిల్‌ ఉత్పత్తి కోత కొనసాగుతుందని సౌదీ అరేబియా కొత్త ఇంధనశాఖ మంత్రి సంకేతాలివ్వడంతో క్రూడాయిలు ధరలు పెరిగాయి.
స్వల్ప నష్టంతో ట్రేడ్‌ అవుతున్న ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ:-
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ స్వల్పనష్టంతో ట్రేడ్‌ అవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో మార్కెట్లో 11,015 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11025.25 పాయింట్లతో పోలిస్తే 10 పాయింట్ల నష్టంతోఉంది. జాతీయ, అంతర్జాతీయంగా నేడు, రేపు ఎలాంటి అనూహ్య పరిణామాలు జరగకపోతే బుధవారం నిఫ్టీ ఇండెక్స్‌ ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.You may be interested

1500డాలర్ల దిగువకు పసిడి

Tuesday 10th September 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర మంగళవారం 1500డాలర్ల దిగువకు తగ్గింది. ఆర్థిక మందగమనంలో ఉన్న వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు పలు దేశాల కేంద్ర బ్యాంకులు ఉద్దీపనలు ప్రకటించవచ్చనే అంచనాలు, అగ్రరాజ్యాల మధ్య వాణిజ్య చర్చలు ఫలించవచ్చనే ఆశాహనంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు తన పెట్టుబడులను రిస్క్‌ సాధనమైన స్టాక్‌ మార్కెట్ల వైపు మళ్లిస్తున్నారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ తగ్గితోంది. నేడు ఆసియాలో ఉదయం ట్రేడింగ్లో ఔన్స్‌ పసిడి ధర 17డాలర్లు క్షీణించి

అధ్వాన్నంగా ఆగస్టులో ఆటో అమ్మకాలు

Tuesday 10th September 2019

- అన్ని విభాగాల్లోనూ క్షీణతే - 1997-98 తరువాత అత్యంత తక్కువ సేల్స్ న్యూఢిల్లీ: ఆటో రంగంలో మాంద్యం ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆగస్టులో వాహన విక్రయాలు భారీగా పడిపోవడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. భారత ఆటోమొబైల్‌ తయారీదారుల సమాఖ్య (సియామ్‌) తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. గతనెల్లో దేశీ వాహన అమ్మకాలు చరిత్రలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయిలకు పడిపోయాయి. అన్ని విభాగాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. సియామ్‌ 1997-98 నుంచి

Most from this category