News


నష్టాల్లో ఆసియా మార్కెట్లు

Tuesday 25th June 2019
Markets_main1561440557.png-26556

  • జీ20 సమ్మిట్‌ ముందు ఎదురు చూసే దోరణి
  • అమెరికా-చైనా సమావేశంపై ఇన్వెస్టర్ల దృష్ఠి

 ఆసియా మార్కెట్లు మంగళవారం(జూన్‌ 25)ట్రేడింగ్‌లో నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఈ వారం చివరిలో జపాన్‌లో జరగనున్నా జీ20 సమ్మిట్‌లో అమెరికా- చైనా మధ్య వాణిజ్య చర్చలు జరగనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించడంతో ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. చైనా షాంఘై కాంపోసీట్‌ 1.6 శాతం, షెంజన్‌ 1.1 శాతం నష్టపోయాయి. అదేవిధంగా హాంకాంగ్‌ హంగ్‌ సెంగ్‌ ఇండెక్స్‌ 1.2 శాతం, జపాన్‌ నికాయ్‌ 225 0.5 శాతం నష్టపోగా, కొరియా కోస్పి(కేఓఎస్‌పీఐ) కూడా నష్టాల్లోనే ప్రారంభమైంది. ఆస్రే‍్టలియా ఏఎస్‌ఎక్స్‌ 200 0.1శాతం నష్టపోయింది.  ఈ రోజు చెప్పుకోదగ్గ ఆర్థిక చర్యలేమి లేకపోవడంతో ఆసియా ఇన్వెస్టర్లు ఈ వారం చివరిలో జరగనున్న జీ 20 మీటింగ్‌ పై దృష్ఠి సారించారు. అంతే కాకుండా అమెరికా ఈ వారం ఇంకో ఐదు చైనా కంపెనీలను బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చడం వలన జీ 20 సమ్మిట్‌లో అమెరికా-చైనా మధ్య చర్చలు జరిగిన చెప్పుకోదగ్గ మార్పేమి ఉండదని ఇన్వె‍స్టర్లు భావిస్తున్నారు. ‘అమెరికా, చైనా కంపెనీలపై తీసుకుంటున్నా ఇటువంటి చర్యలను ఆపడం ఇరు దేశాల వాణిజ్యానికి మంచిది. ప్రపంచ వాణజ్య సంస్థ(డబ్యూటీఓ) నియమాలు, స్వేచ్చా వాణిజ్య భావాలకు అనుగుణంగా అమెరికా నడుచుకొని ​చైనా కంపెనీలను బ్లాక్‌ లిస్ట్‌ నుంచి తొలగిస్తుందని ఆశిస్తున్నాం’ అని చైనా వాణిజ్య ఉప మంత్రి వాంగ్‌ షోవెన్‌ సోమవారం అన్నారు.  అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, చైనాతో ఒక మంచి సమావేశాన్ని కోరుకుంటున్నామని కానీ చైనా ముందు జరిగిన చర్చల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని గత వారం హెచ్చరించిన విషయం తెలిసిందే. చైనా వైస్‌ ప్రీమియర్‌ లీ హీ, యూఎస్‌ ట్రెజరీ సెక్రటరి స్టీవెన్‌ నుచిన్‌, వాణిజ్య ప్రతినిధి రోబర్ట్‌ లిట్జర్‌తో ఫోన్‌లో మాట్లాడారని వాంగ్‌ ప్రకటనను విడుదల చేశారు. వీరు వాణిజ్య విషయాలను గురించి మాట్లాడుకున్నారని వాంగ్‌ ప్రకటనలో పేర్కొన్నారు. ట్రంప్‌ జీ20 సమ్మిట్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, టర్కీ అధ్యక్షడు రెసప్‌ టయ్యిప్‌ ఎర్డగాన్‌తో కూడా సమావేశం జరపనున్నారని వైట్‌హౌస్‌ సోమవారం తెలిపిందిYou may be interested

ఎంఏసీడీ ఏం చెబుతోంది!

Tuesday 25th June 2019

ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.   బుల్లిష్‌ సిగ్నల్స్‌ సోమవారం

గూగుల్‌ మ్యాప్స్‌ నుంచి

Tuesday 25th June 2019

30 లక్షల నకిలీ బిజినెస్‌ ప్రొఫైల్స్‌ తొలగింపు న్యూఢిల్లీ: గూగుల్‌ మ్యాప్స్‌ నుంచి  30 లక్షల నకిలీ బిజినెస్‌ ప్రొఫైల్స్‌ను గత ఏడాది గూగుల్‌ తొలగించింది. వీటిల్లో దాదాపు 90 శాతం బిజినెస్‌ ప్రొఫైల్స్‌ను, యూజర్లు చూడకముందే తొలగించామని గూగుల్‌ మ్యాప్స్‌ ప్రొడక్ట్‌ డైరెక్టర్‌ ఈథన్‌ రస్సెల్‌ ఒక బ్లాగ్‌స్పాట్‌లో తెలిపారు. ఒక వ్యాపార సంస్థ కాంటాక్ట్‌ వివరాలను, ఆ సం‍స్థకు చేరుకోవలసిన మార్గాల గురించి గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా యూజర్లు

Most from this category