News


లాభాల్లో ఆసియా మార్కెట్లు

Wednesday 5th June 2019
Markets_main1559732411.png-26099

అమెరికా మార్కెట్ల నుంచి లాభాల ముగింపు అందుకున్న ఆసియా మార్కెట్లు బుధవారం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీరేట్లను తగ్గించేందుకు మొగ్గుచూపడంతో పాటు,  డాలర్‌ ఇండెక్స్‌ 7వారాల కనిష్టం వద్ద ట్రేడ్‌ అవుతుండటం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచింది. ఆసియా మార్కెట్లలో జపాన్‌ ఇండెక్స్‌ నికాయ్‌ 225 ఇండెక్స్‌ 2శాతం లాభపడగా, చైనా షాంఘై కాంపోజిట్‌ సూచి అరశాతం పెరిగింది. వాటితో పాటు సింగపూర్‌ స్రైట్‌ టైమ్స్‌, హాంగ్‌ సెంగ్‌, తైవాన్‌ వెయిటెడ్‌, కోస్పి, సెట్‌ కాంపోజిట్‌ ఇండెక్స్‌ లు అరశాతం చొప్పున పెరగాయి. నిన్న రాత్రి ఫెడ్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ పొవెల్‌ చికాగాలో మాట్లాడుతూ వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు,  ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలను ఫెడ్‌ రిజర్వ్‌ నిశీతంగా పరిశీలిస్తుంది. పరిస్థితులకు అనుగుణంగానే ఫెడ్‌ వైఖరి ఉంటుందని వాఖ్యానించారు. పావెల్‌ వాఖ్యలకు రాత్రి అమెరికా మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. డౌన్‌ జోన్స్‌, ఎస్‌ఎండ్‌పీ 500, నాస్‌డాక్‌ ఇండెక్స్‌లు దాదాపు 2శాతం లాభంతో ముగిశాయి. దాదాపు 5నెలల తరువాత ఒక ట్రేడింగ్‌ సెషన్‌లో అమెరికా స్టాక్‌ సూచీలు ఇంత ర్యాలీ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. డాలర్‌ ఇండెక్స్‌ సైతం వరుసగా మూడో రోజూ పతనమై, 97 స్థాయి వద్ద కీలక మద్ధతు స్థాయి తీసుకుంది. మరోవైపు అమెరికా బాండ్‌ ఈల్డ్‌ సైతం కనిష్టస్థాయి నుంచి రికవరి అయ్యింది. 



You may be interested

3నెలల గరిష్టం వద్ద పసిడి

Wednesday 5th June 2019

ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో పసిడి ధర బుధవారం మూడు నెలల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో నేడు మరో 10డాలర్లు లాభపడింది. ఔన్స్‌ పసిడి 1,338.95 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలతో ఆర్థిక వ్యవస్థ మందగించడంతో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల కోతకే మొగ్గు చూపవచ్చని ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ అభిప్రాయపడ్డారు. తక్కువ వడ్డీరేట్ల అంచనాలు పసిడి ర్యాలీకి తోడ్పాటునిస్తున్నాయి. పావెల్‌

స్వల్ప నష్టాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Wednesday 5th June 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ ఇండెక్స్‌ బుధవారం స్వల్ప నష్టంతో ట్రేడ్‌ అవుతోంది. నేటి ఉదయం ట్రేడింగ్‌లో 4 పాయింట్లు తగ్గిన 12,052.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ మంగళవారం ముగింపు స్థాయి 12056.15 పాయింట్లతో పోలిస్తే 4 పాయింట్లు తక్కువ. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు సైతం లాభాల్లో ముగిశాయి. మిశ్రమంగా ముగిసిన ఏడీఆర్‌లు:-  అమెరికా మార్కెట్లో ట్రేడయ్యే భారత ఏడీఆర్‌లు మంగళవారం

Most from this category