News


ఒత్తిడిలో ఆసియా మార్కెట్లు

Monday 12th August 2019
news_main1565588078.png-27700

దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుఎస్‌-చైనా ట్రేడ్‌ వార్‌ వలన ప్రపంచ, యుఎస్‌ ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలో చిక్కుకుంటాయనే ఆందోళన నేపథ్యంలో ఆసియా మార్కెట్లు సోమవారం ట్రేడింగ్‌లో నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఫలితంగా  బంగారం ధరలు పెరిగాయి. వాల్ స్ట్రీట్ శుక్రవారం పతనమవ్వడంతో, జపాన్ వెలుపల ఎంఎస్‌సీఐ(మోర్గాన్‌ స్టాన్లీ క్యాపిటల్‌ ఇండెక్స్‌) ఆసియా-పసిఫిక్ ఇండెక్స్‌ సోమవారం ప్రారంభ ట్రేడ్‌లో 0.17 శాతం తగ్గింది. ఆస్ట్రేలియా మార్కెట్‌ 0.1 శాతం క్షీణించగా, దక్షిణ కొరియా కొస్పి ప్రారంభ నష్టాల నుంచి 0.12 శాతం పెరిగింది. జపాన్, సింగపూర్‌లోని మార్కెట్లు సోమవారం సెలవుదినం కావడంతో పనిచేయడం లేదు. 
  యుఎస్‌, చైనాతో వాణిజ్య చర్చలు జరుపుతోందని, అయినప్పటికి ప్రస్తుతం చైనాతో ఒప్పందం కుదుర్చుకోడానికి వీలుకాకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించడంతో యుఎస్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. గత సెషన్‌లో డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.34 శాతం, ఎస్ అండ్‌ పీ 500 0.66 శాతం, నాస్డాక్ కాంపోజిట్  1 శాతం తగ్గి ముగిశాయి. అమెరికా చైనాతో ఇంకో రౌండ్‌ వాణిజ్య చర్చలను జరపడంపై ఆలోచిస్తోందని ట్రంప్‌ వ్యాఖ్యల తర్వాత యుఎస్‌ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో తెలిపారు. యుఎస్‌ చైనా మధ్య జరిగిన వాణిజ్య చర్చలలో ఎటువంటి పురోగతి లేకపోవడంతో గత కొన్ని నెలల నుంచి ఇన్వెస్టర్లు ప్రమాదకర ఆస్తుల నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నరని, దీనితోపాటు అంతర్జాతీయ వృద్ధి, కార్పోరేట్‌ లాభాలు మందగించడం కూడా ఇన్వెస్టర్లపై అధికంగా ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు తెలిపారు.
  గత వారం బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ  రెండవ త్రైమాసికంలో ఊహించని విధంగా తగ్గిందని అధికారిక డేటా తెలుపుతోంది. అంతేకాకుండా జర్మని పారిశ్రామిక ఉత్పత్తి తొమ్మిదేళ్ళలో అతిపెద్ద వార్షిక క్షీణతను చవిచూసింది. పెరుగుతున్న చైనా-యుఎస్ వాణిజ్య యుద్ధం అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బతీసిందని, ఇవన్నీ ప్రపంచ మాంద్యం భయాలను పెంచుతున్నాయని విశ్లేషకులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండడంతో సురక్షిత ఆస్తుల విలువ గణనీయంగా పెరుగుతోంది. గత వారం బం‍గారం ధర ఔన్స్‌కు 1,500 డాలర్లను దాటింది. గత సెషన్లో స్వల్పంగా బంగారం ధరలు తగ్గినప్పటికి, సోమవారం ట్రేడింగ్‌లో ఈ ధర ఔన్స్‌కు 0.18 శాతం పెరిగి 1,499.52 డాలర్లకు చేరుకుంది.  యురోప్‌ దేశాల చమురు నిల్వలు తగ్గడంతో పాటు ఒపెక్‌ దేశాలు ఉత్పత్తి కోతను తగ్గించడంతో శుక్రవారం చమురు ధరలు పెరిగాయి. కాగా సోమవారం చమురు ధరలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. డబ్యూటీఐ క్రూడ్‌ 0.53 శాతం తగ్గి బ్యారెల్కు 54.21 డాలర్ల వద్ద,  బ్రెంట్ క్రూడ్‌ 0.51 శాతం తగ్గి బ్యారెల్కు 58.23 డాలర్లకు చేరుకున్నాయి.You may be interested

పెట్టుబడుల వృద్ధికి... రిలయన్స్‌ గ్రోత్‌ ఫండ్‌

Monday 12th August 2019

రిలయన్స్‌ గ్రోత్‌ ఫండ్‌ అన్నది ఓపెన్‌ ఎండెడ్‌ మిడ్‌క్యాప్‌ తరహా పథకం. అధికంగా వృద్ధిని సాధించే కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా దీర్ఘకాలంలో సంపద సృష్టించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. ఈ పథకం నిర్వహణ వ్యవహారాలను (మేనేజర్‌) మనీష్‌ గున్వానీ 2017 నుంచి చూస్తున్నారు. ఆర్థిక సేవల రంగంలో ఆయనకు 17 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది.  పెట్టుబడుల విధానం... బోటమ్‌ అప్‌ విధానాన్ని ఈ పథకం ఎక్కువగా అనుసరిస్తుంది. లేదా

‘పన్ను’కు టైమైంది....

Monday 12th August 2019

ఈ నెలాఖరు వరకు ఐటీఆర్‌ దాఖలు గడువు ఒక నెలపాటు పొడిగించిన కేంద్రం గడువులోపు దాఖలుతో జరిమానాల భారం ఉండదు ఆదాయంలో ఎన్నో భాగాలు కొన్నింటిపైనే పన్ను మినహాయింపులు పోను మిగిలిన ఆదాయంపై పన్ను ఆన్‌లైన్‌లోనే సులభంగా రిటర్నులు దాఖలు అందరికీ ఒకటే ఫామ్‌ కాదు ఒక్కో వర్గానికి ఒక్కో ఐటీఆర్‌ గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నులు దాఖలు చేసేందుకు పెద్దగా సమయం లేదు. వాస్తవానికి జూలై చివరి నాటికే ఆదాయపన్ను రిటర్నులు (ఐటీఆర్‌) దాఖలు చేయాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం

Most from this category