News


తేరుకుంటున్న ఏసియన్‌ పెయింట్స్‌

Thursday 20th June 2019
Markets_main1561016694.png-26444

అంతర్జాతీయ బ్రోకింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్ఏ, ఎసియన్‌ పెయింట్స్‌ షేర్ల టార్గెట్‌ ధరను రూ. 1,285కు తగ్గించింది. ఇది ఇప్పుడున్న స్థాయికంటే 7 శాతం తక్కువ. రేటింగ్‌ను మాత్రం ‘అమ్మొచ్చు’గా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. దీంతో  ఏసియన్‌ పెయిం‍ట్స్‌ షేరు విలువ గురువారం ఇంట్రాడేలో 1.5 శాతం నష్టపోయింది. అయితే మధ్యాహ్న సమయానికి కోలుకున్న ఎసీయన్‌ పెయింట్స్‌ షేరు బీఎస్‌ఈలో 0.60శాతం లాభంతో రూ.1,390గా ట్రేడవుతోంది. ‘ఏసియన్‌ పెయింట్స్‌ ఫ్రీ క్యాష్‌ ఫ్లో(ఎఫ్‌సీఎఫ్‌) పెరిగినప్పటికి ఈక్వీటిల పై లాభాలు తక్కువగా ఉన్నాయి. కంపెనీ లావాదేవిల వలన 2020 ఆర్థిక సంవత్సరంలో కూడా జాగ్రత్తగా ఉండాలి’ అని తెలిపింది. కంపెనీ వృద్ధి మందగించడం, క్రూడ్‌ ధరలో నిలకడ లేకపోవడం, స్థూల కారణాలు సమస్యలుగా ఉన్నాయి.



You may be interested

ఎయిరిండియా విక్రయానికి కొత్త ప్రణాళిక

Thursday 20th June 2019

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియా విక్రయానికి కేంద్ర ఆర్థిక శాఖ మరో కొత్త ప్రణాళిక రూపకల్పనలో నిమగ్నమైంది. ఈ సారి చమురు ధరలు, మారకం రేటు హెచ్చు తగ్గులు తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. వాస్తవానికి ఎయిరిండియాలో గతేడాదే వాటాలు విక్రయించే ప్రయత్నాలు జరిగినప్పటికీ.. ఇలాంటి కారణాల వల్లే విఫలమైనట్లు కన్సల్టెన్సీ సంస్థ ఈవై తేల్చి చెప్పడంతో తాజా నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనలను ఎయిరిండియా

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ లో బీఎఫ్‌ఐఎల్‌ విలీనం

Thursday 20th June 2019

రికార్డ్‌ డేట్‌ వచ్చే నెల 4  న్యూఢిల్లీ: ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లో భారత్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ (బీఎఫ్‌ఐఎల్‌) విలీనం వచ్చే నెల 4 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ మేరకు ఇరు కంపెనీలు తమ తమ వాటాదారులకు, రుణదాతలకు సమాచారమిచ్చాయి. అదే రోజును రికార్డ్‌ డేట్‌గా కూడా పరిగణిస్తామని పేర్కొన్నాయి. ఆ రోజు నాటికి ఎవరైతే బీఎఫ్‌ఐఎల్‌ వాటాదారులుగా ఉంటారో వారికి ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌​ షేర్లు లభిస్తాయి. ప్రతి 1,000

Most from this category