News


తీవ్రమైన ట్రేడ్‌ వార్‌..పతనంలో ఆసియా మార్కెట్లు

Monday 26th August 2019
Markets_main1566792947.png-28009

యుఎస్‌-చైనా ట్రేడ్‌ వార్‌ తీవ్రమవ్వడంతో ఆసియా మార్కెట్లు సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ (హెచ్‌ఎస్‌ఐ) దాదాపు 3 శాతం, చైనా షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ (ఎస్‌హెచ్‌కాంప్) 1.2శాతం నష్టపోయాయి. జపాన్‌కు చెందిన నికాయ్‌ 225 (ఎన్‌225) 2.2 శాతం, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి (కోస్పి) 1.7 శాతం క్షీణించాయి. యునైటెడ్ స్టేట్స్(యుఎస్‌), చైనా  రెండు దేశాలు సుంకాలను పెంచడంతో యుఎస్‌-చైనా ట్రేడ్‌ వార్‌ ఇంకా ముదురుతుందని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారని విశ్లేషకులు తెలిపారు. ట్రేడ్‌ వార్‌ ఫలితంగా యుఎస్ ఫ్యూచర్స్ కూడా నష్టపోయాయి. డోజోన్స్‌ (ఇండు) ఫ్యూచర్స్ ఆసియా మార్కెట్‌ టైంలో దాదాపు 200 పాయింట్లు లేదా 0.7 శాతం పతనమయ్యింది. ఎస్ అండ్ పీ 500 (ఎస్‌ఎండ్‌పీ) 0.8 శాతం, నాస్డాక్ (కాంప్) 0.9 శాతం పతనమయ్యాయి. 
  తాజాగా యుఎస్‌-చైనా దేశాల మధ్య ట్రేడ్‌ వార్‌ తీవ్రమవ్వడంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ మార్కెట్లు ప్రమాదంలో పడ్డాయని యుబీఎస్ వెల్త్ మేనేజ్‌మెంట్, గ్లోబల్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్ మార్క్ హేఫెలే ఓ నివేదికలో తెలిపారు.  ఈ నెల ప్రారంభంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 1 నుం‍చి అదనపు 300 బిలయన్‌ డాలర్ల చైనా దిగుమతులపై 10 శాతం సుంకాన్ని విధిస్తానని ట్విట్టర్‌లో ప్రకటించారు. కానీ ఇది కొంత ఆలస్యమయ్యింది. కాగా 75 బిలియన్ డాలర్ల విలువైన యుఎస్ దిగుమతులపై, 10 శాతం సుంకాలను శుక్రవారం చైనా విధించింది. దీంతో 250 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై ప్రస్తుతం ఉన్న 25 శాతం టారిఫ్‌ను 30 శాతానికి శుక్రవారం యుఎస్‌ పెంచింది. ఈ చర్య అక్టోబర్‌ 1 నుంచి అమలులోకి రానుంది. మిగిలిన 300 బిలియన్‌ డాలర్ల చైనా దిగుమతులపై ప్రస్తుతం ఉన్న 10 శాతం టారిఫ్‌ను 15 శాతానికి పెంచగా, ఈ చర్య సెప్టెంబర్‌ 1 నుంచి అమలులో‍కి వస్తుందని ట్రంప్‌ అన్నారు. ఇందులో సగం వస్తువులపై టారిఫ్‌లను డిసెంబర్‌ 15 వరకు మినహాయించనున్నారు. కాగా ఈ టారిఫ్‌లను విధించే తేదీలను యుఎస్‌ ట్రేడ్‌ ప్రతినిధులు ద్రువీకరించారు.You may be interested

సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌లో ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు..!

Monday 26th August 2019

న్యూఢిల్లీ: స్థానిక సోర్సింగ్ నిబంధనల నుంచి సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌ రంగానికి కేంద్ర ప్రభుత్వం ఊరటనివ్వనుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డిఐ) ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఈ తరహ వ్యాపారులు తప్పనిసరిగా 30 శాతం వస్తువులను ప్రాంతీయ వ్యాపారుల నుంచి మాత్రమే కొనుగోలుచేయాల్సి ఉంటుంది. ఈ అంశంలో వీరికి ఊరటలభించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆన్‌లైన్‌ విక్రయాల్లోనూ నిబంధనలు సులభతరంకానున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌ ప్లేయర్లు

థాపర్‌ను తొలగించాలి

Monday 26th August 2019

సీజీ పవర్‌ రుణదాతలు, ఇన్వెస్టర్ల అభిప్రాయం న్యూఢిల్లీ: భారీ కుంభకోణం బైటపడిన నేపథ్యంలో సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్‌ చైర్మన్‌ హోదా నుంచి గౌతమ్ థాపర్‌ను తప్పించాలని సంస్థకు రుణాలిచ్చిన సంస్థలు, ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. సంస్థ ఆస్తులను తనఖా పెట్టి రుణాలు పొందిన కొందరు సిబ్బంది, ఆ నిధులను దారి మళ్లించిన తీరు ఇటీవల విచారణలో బైటపడిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో గవర్నెన్స్‌పరమైన లోపాలను బోర్డు గుర్తించినట్లు స్టాక్

Most from this category