News


కొస్పి డౌన్‌.. మిగతావి అప్‌..

Saturday 1st December 2018
Markets_main1543645616.png-22561

దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి మినహా మిగతా ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం లాభాల్లోనే ముగిశాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 8 పాయింట్ల లాభంతో 3,117 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 3 పాయింట్ల లాభంతో 9,888 పాయింట్ల వద్ద ముగిసింది. చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 21 పాయింట్ల లాభంతో 2,588 పాయింట్ల వద్ద ఉంది. దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 17 పాయింట్ల నష్టంతో 2,096 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 56 పాయింట్ల లాభంతో 26,506 పాయింట్ల వద్ద ఉంది. జపాన్‌ నికాయ్‌ 225.. 88 పాయింట్ల లాభంతో 22,351 పాయింట్ల వద్ద ముగిశాయి. అర్జెంటినాలో శనివారం జరగనున్న జీ-20 సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ భేటీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఇరువురి మధ్య టారిఫ్‌ అంశంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది. 



You may be interested

ఇన్ఫోసిస్‌, విప్రో ఏడీఆర్‌లు 2% జంప్‌

Saturday 1st December 2018

వేదాంత, టాటా మోటార్స్‌ ఏడీఆర్‌లు 2 శాతం డౌన్‌ అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఇన్ఫోసిస్‌, విప్రో, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఏడీఆర్‌లు పెరిగాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, వేదాంత, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌లు తగ్గాయి. విప్రో ఏడీఆర్‌ గరిష్టంగా 2 శాతానికి పైగా పెరిగితే.. టాటా మోటార్స్‌, వేదాంత ఏడీఆర్‌లు 2 శాతానికి పైగా

7 ఏళ్ల తర్వాత అదిరిపోయే పనితీరు

Saturday 1st December 2018

అమెరికా మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.79 శాతం లేదా 200 పాయిం‍ట్ల లాభంతో 25,538 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.81 శాతం లేదా 22 పాయింట్ల లాభంతో 2,759 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 0.79 శాతం లేదా 57 పాయింట్ల లాభంతో 7,330 పాయింట్ల వద్ద ముగిసింది. టెలికం, యుటిలిటీస్‌, హెల్త్‌కేర్‌ రంగాల షేర్లు ర్యాలీ చేశాయి.

Most from this category