News


నష్టాల్లోంచి లాభాల్లోకి అశోక్‌ లే లాండ్‌ షేరు

Thursday 20th June 2019
Markets_main1561013648.png-26435

అశోక్‌ లే లాండ్‌  పంట్నాగర్‌ ప్లాంట్‌లో ఉత్పత్తిని నిలిపివేస్తున్నామని ప్రకటించాక గురువారం ఆరంభ ట్రేడింగ్‌లో షేరు విలువ 3 శాతం నష్టపోయింది. ఉత్పత్తి, అమ్మకాల మధ్య సంబంధాలలో భాగంగా కంపెనీ ఈ వ్యుహాత్మకమైన నిర్ణయం తీసుకుంది. జూన్‌ 24, 2019 నుంచి జూన్‌ 29, 2019(రెండు తేదిలు కలిపి) వరకు ఉత్పత్తిని నిలిపివేయనున్నామని కంపెనీ బీఎస్‌ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. అశోక్‌ లే లాండ్‌ షేరు జూన్‌ 21, 2018న రూ. 138.55 గరిష్ఠ స్థాయిని తాకింది. 2019 ఫిబ్రవరి 18న రూ.77.50 ఏడాది కనిష్ఠాన్ని తాకిన ఈ షేరు ప్రస్తుతం 2.05 శాతం లాభంతో  రూ.84.55 వద్ద ట్రేడవుతోంది. కంపెనీ ప్రైస్‌ టూ ఎర్నింగ్‌ నిష్పత్తి 12.81గా ట్రైలింగ్‌ 12 మంత్‌(టీటీఎమ్‌) ఈపీఎస్‌ షేరుకు రూ.6.35గా(మార్చి, 2019) ఉంది. 



You may be interested

బ్లాక్‌స్టోన్‌ చేతికి వన్‌ బీకేసీ బిల్డింగ్‌

Thursday 20th June 2019

డీల్‌ విలువ రూ.2,500కోట్లు  దేశీ ఆఫీస్‌ స్పేస్‌ సెగ్మెంట్లో ఇదే అతిపెద్ద డీల్‌ ముంబై: అమెరికాకు చెందిన ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ, బ్లాక్‌స్టోన్‌... ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌(బీకేసీ)లో ఉన్న ఎనిమిది అంతస్తుల వన్‌ బీకేసీ బిల్డింగ్‌లో దాదాపు సగం ఆఫీస్‌ స్పేస్‌ను కొనుగోలు చేసింది. రేడియస్‌ డెవలపర్‌ నుంచి వన్‌ బీకేసీలో 0.7 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ ఆఫీస్‌ స్పేస్‌ను బ్లాక్‌స్టోన్‌ సంస్థ రూ.2,500 కోట్లకు కొనుగోలు చేసింది. దేశీయ ఆఫీస్‌ స్పేస్‌

ఐదేళ్ల గరిష్టానికి పసిడి ధర

Thursday 20th June 2019

వడ్డీరేట్ల తగ్గింపునకు ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంకు సంసిద్ధం కావడంతో పసిడి ధర పరుగులు పెడుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో గురువారం పసిడి ధర ఏకంగా 5ఏళ్ల గరిష్టానికి ఎగిసింది. నేడు ఔన్స్‌ పసిడి ధర ఏకంగా 47డాలర్లు (3.50శాతం) పెరిగి 1395.35 డాలర్ల స్థాయిని తాకింది. అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ నిన్నరాత్రి కీలక వడ్డీరేట్లపై యథాతథ పాలసీ అమలుకే కట్టుబడుతున్నట్లు ప్రకటించింది. అయితే ఆర్థిక మందగమనం,  ద్రవ్యోల్బణం అంశాలను దృష్టిలో ఉంచుకొని

Most from this category