News


5ఏళ్ల కనిష్టస్థాయికి అశోక్‌లేలాండ్‌

Friday 2nd August 2019
Markets_main1564738519.png-27504

దేశీయ వాణిజ్య వాహన తయారీ దిగ్గజం అశోక్‌లే లాండ్‌ కంపెనీ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో 5ఏళ్ల కనిష్టానికి పతనమయ్యాయి. కంపెనీ జూలై మాసపు వాహన విక్రయ గణాంకాలు ఆశించిన స్థాయిలో నమోదుకాకపోవడం ఇందుకు కారణమైంది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ రూ.68.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నిన్న(ఆగస్ట్‌ 01) కంపెనీ జూలై విక్రయాలు గణాంకాలను విడుదల చేసింది. ఈ జూలైలో మొత్తం అమ్మకాలు 28శాతం క్షీణించి 10927 యూనిట్లను విక్రయించింది.  గతేడాది ఇదే జూలైలో మొత్తం అమ్మకాలు 15,199 యూనిట్లుగా నమోదయ్యాయి. మధ్య, హెవీ కమర్షియల్‌ విభాగంలో మొత్తం 6722 యూనిట్లకు విక్రయించింది. గతేడాది ఇదే విభాగంలో విక్రయించిన 10966 యూనిట్లతో పోలిస్తే ఇది 39శాతం తక్కువ. చిన్న తరహా వాణిజ్య వాహన విభాగంలో కంపెనీ మొత్తం 4,205 వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే జూలైలో కంపెనీ మొత్తం 4,203 యూనిట్లను అమ్మింది. విక్రయాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నోమురా బ్రోకరేజ్‌ సంస్థ షేరుకు న్యూట్రల్‌ రేటింగ్‌ను కేటాయించింది. అలాగే షేరు కొనుగోలు ధరను రూ.72కు డౌన్‌గ్రేడ్‌ చేసింది. అటు విక్రయాలు క్షీణించడంతో పాటు, ఇటు బ్రోకరేజ్‌ సం‍స్థల రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌తో నేడు ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి షేరు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఫలితంగా  ఇంట్రాడేలో ఒకదశలో 12శాతం క్షీణించి రూ.60.85ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది. ఈ ధర షేరుకు ఐదేళ్ల కనిష్టస్థాయి కావడం గమనార్హం మధ్యాహ్నం గం.3:00లకు షేరు గతముగింపు ధర(రూ.68.95)తో పోలిస్తే 7శాతం నష్టంతో రూ.63.95ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 60.85, రూ.135.10లుగా నమోదయ్యాయి. 



You may be interested

సెన్సెక్స్‌ లాభం 100 పాయింట్లు

Friday 2nd August 2019

ట్రేడింగ్‌లో లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు వారాంతాన్ని స్వల్ప లాభంతో ముగించాయి. సెన్సెక్స్‌ 100 పాయింట్లు లాభపడి 37,118.22 స్థిరపడింది. నిఫ్టీ 17పాయింట్లు పెరిగి 10,997.00 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది. బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంతో ఎన్‌ఎస్‌ఈలోని కీలకమైన నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం నష్టపోయి 28,204.95 వద్ద స్థిరపడింది. అటో, ఐటీ, ఆర్థిక, ఫైనాన్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది, మెటల్‌, మీడియా, బ్యాంకింగ్‌, రియల్టీ రంగ షేర్లు

హెచ్‌డీఎఫ్‌సీ క్యూ1: నికర లాభంలో 46 శాతం వృద్ధి

Friday 2nd August 2019

హెచ్‌డీఎఫ్‌సీ తన జూన్‌ క్వార్టర్‌ ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. ఏడాది ప్రాతిపదికన స్టాండ్‌ ఎలోన్‌ లాభంలో 46 శాతం వృద్ధిని సాధించి, రూ.3,202 కోట్లను నమోదుచేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభం రూ.2,190 కోట్లుగా ఉంది. కాగా మార్కెట్లు స్టాండ్‌ఎలోన్‌ లాభం రూ.3,040 కోట్లుగా ఉంటాయని అంచనా వేశాయి. గృహ్‌ ఫైనాన్స్‌లోని కొంత వాటాను విక్రయించడంతో రూ.1,895 కోట్ల లాభం చేకూరిందని కంపెనీ తెలిపింది. గత ఏడాది ఇదే

Most from this category